కోల్‌కతా: జ్యువెలరీ రిటైల్ కంపెనీ సెన్‌కో గోల్డ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 301–317 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ నేడు(4న) ప్రారంభమై గురువారం(6న) ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు సోమవారం(3న) షేర్లను విక్రయించనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 270 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 135 కోట్ల విలువైన షేర్లను కంపెనీలో ప్రస్తుత వాటాదారు సంస్థ సైఫ్ పార్ట్‌నర్స్ ఇండియా ఐవీ లిమిటెడ్ విక్రయానికి ఉంచనుంది.
ప్రస్తుతం సైఫ్ పార్ట్‌నర్స్‌కు కంపెనీలో 19.23 శాతం వాటా ఉంది. దీనిలో 8–9 శాతం వాటాను ఆఫర్ చేయనున్నట్లు సెన్‌కో ఎండీ, సీఈవో సువంకర్ సేన్ పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 47 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 196 కోట్లు వర్కింగ్ క్యాపిటల్‌కు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనుంది. కంపెనీ 13 రాష్ట్రాలలో మొత్తం 140 షోరూములను నిర్వహిస్తోంది.
ఎస్‌పీసీ లైఫ్ సైన్సెస్ రెడీ
ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్
ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్స్ తయా రీ కంపెనీ ఎస్‌పీసీ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. కంపెనీ ప్రాస్పెక్టస్‌కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 89.39 లక్షల షేర్లను ప్రమోటర్ స్నేహల్ రాజీవ్‌భాయ్ పటేల్ విక్రయానికి ఉంచనున్నారు.
మళ్లీ ఐపీవోకు అక్మే ఫిన్.. ప్రాస్పెక్టస్ దాఖలు
నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అక్మే ఫిన్‌ట్రేడ్(ఇండియా) లిమిటెడ్ మరోసారి పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కంపెనీ తొలుత ఫిబ్రవరి 16న దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌ను సెబీ ఏప్రిల్ 27న వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీ తిరిగి తాజా ప్రాస్పెక్టస్‌ను సెబీకి అందించింది.
Comments
Please login to add a commentAdd a comment