jewellery sector
-
సెన్కో గోల్డ్ @ రూ. 301–317
కోల్‌కతా: జ్యువెలరీ రిటైల్ కంపెనీ సెన్కో గోల్డ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 301–317 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ నేడు(4న) ప్రారంభమై గురువారం(6న) ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు సోమవారం(3న) షేర్లను విక్రయించనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 270 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 135 కోట్ల విలువైన షేర్లను కంపెనీలో ప్రస్తుత వాటాదారు సంస్థ సైఫ్ పార్ట్నర్స్ ఇండియా ఐవీ లిమిటెడ్ విక్రయానికి ఉంచనుంది. ప్రస్తుతం సైఫ్ పార్ట్నర్స్కు కంపెనీలో 19.23 శాతం వాటా ఉంది. దీనిలో 8–9 శాతం వాటాను ఆఫర్ చేయనున్నట్లు సెన్కో ఎండీ, సీఈవో సువంకర్ సేన్ పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 47 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 196 కోట్లు వర్కింగ్ క్యాపిటల్‌కు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనుంది. కంపెనీ 13 రాష్ట్రాలలో మొత్తం 140 షోరూములను నిర్వహిస్తోంది. ఎస్పీసీ లైఫ్ సైన్సెస్ రెడీ ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్స్ తయా రీ కంపెనీ ఎస్పీసీ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. కంపెనీ ప్రాస్పెక్టస్‌కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 89.39 లక్షల షేర్లను ప్రమోటర్ స్నేహల్ రాజీవ్‌భాయ్ పటేల్ విక్రయానికి ఉంచనున్నారు. మళ్లీ ఐపీవోకు అక్మే ఫిన్.. ప్రాస్పెక్టస్ దాఖలు నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అక్మే ఫిన్‌ట్రేడ్(ఇండియా) లిమిటెడ్ మరోసారి పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కంపెనీ తొలుత ఫిబ్రవరి 16న దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌ను సెబీ ఏప్రిల్ 27న వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీ తిరిగి తాజా ప్రాస్పెక్టస్‌ను సెబీకి అందించింది. -
నోట్ల రద్దు తర్వాత బంగారానికి మరో దెబ్బ
పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను కేంద్రప్రభుత్వం నవంబర్ 8న అకస్మాత్తుగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ రద్దుతో రాత్రికి రాత్రి భారీగా పెరిగిన బంగారం అమ్మకాలు, ఆ తర్వాత తీసుకొచ్చిన కఠినతరమైన నిబంధనలు, చర్యలతో కుప్పకూలాయి. జువెల్లరీ సెక్టార్ కోలుకోలేని దెబ్బతిన్నది. ప్రస్తుతం జీఎస్టీతో మరోసారి జువెల్లరీ సెక్టార్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేవలం పన్ను రేట్లతోనే కాక, గూడ్స్ తరలింపు ప్రక్రియలో విధానపరమైన సమస్యలను జువెల్లరీ సెక్టార్ ఎదుర్కొంటుందని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. కొత్త జీఎస్టీ నిబంధనల ప్రకారం, రూ.50వేల కంటే ఎక్కువ విలువ ఉన్న కమోడిటీని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి ట్రేడర్ కచ్చితంగా ఈ-వే బిల్‌ను జనరేట్ చేయాల్సి ఉటుంది. అయితే బంగారం విషయంలో ఇది క్లిష్టంగా మారుతోంది. బంగారం ఎక్కువ విలువ ఉన్న కమోడిటీ. దీన్ని పలు ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. ప్రతిసారి ఈ-వే బిల్లు ప్రొసీజర్‌ను నమోదుచేయడం కష్టమని జువెల్లరీ ట్రేడర్లు పేర్కొంటున్నారు. ఈ-వే బిల్లు నిబంధన జువెల్లరీ రంగంలో చాలా సమస్యలను తెస్తుందని చెప్పారు. తమ ఆందోళనలను ప్రభుత్వం ముందు ఉంచామని, త్వరలో ఈ నిబంధనలను మార్చుతారని ఆశిస్తున్నట్టు ఆల్-ఇండియా జెమ్స్ అండ్ జువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ చైర్మన్ నితిన్ ఖండేల్వాల్ చెప్పారు. ఈ-వే బిల్లు ప్రొసీజర్ పరిమితిని బంగారానికి కనీసం రూ.1.5 కోట్లకు పెంచాలని జువెల్లరీ సెక్టార్ డిమాండ్ చేస్తోంది. ఆగస్టు 5న నిర్వహించబోతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జువెల్లరీ డిమాండ్‌ను చర్చిస్తామని వాణిజ్య పన్నుల కమిషనర్ రిట్విక్ రంజనమ్ పాండే చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత ఏర్పడటంతో బంగారం అమ్మకాలు 20 శాతం పడిపోయాయి. కానీ ఇప్పుడిప్పుడే ఇవి కోలుకుంటున్నాయని జువెల్లరీ వర్గాలు చెప్పాయి. మరో ఏడాది పాటు ఈ రికవరీ పట్టవచ్చన్నారు. ఈ-వే బిల్లు అంటే.. అంతరాష్ట్రాలు, రాష్ట్రంలోనూ కమోడిటీని గమ్యస్థానానికి తరలించే ముందు దాని విలువను, పరిమాణాన్ని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. రూ.50వేల కంటే ఎక్కువ విలువున్న ఉత్పత్తులకు ఈ-వే బిల్లు అవసరం. గమ్యస్థానం 100 కిలోమీటర్ల లోపు ఉంటే, ఈ-వే బిల్లుకు గడువు రెండు రోజుల్లో కాలం చెల్లుతుంది. కిలోమీటర్ల బట్టి ఈ బిల్లుకు వాలిడిటీ కాలాన్ని నిర్థారించారు. -
పాన్ నిబంధనలు మార్చండి..
► రూ.2 లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంచండి ► బంగారం దిగుమతి సుంకాన్ని 2 శాతం చేయాలి ► జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్ అభ్యర్థన న్యూఢిల్లీ: ఆభరణాల కంపెనీల సమాఖ్య ఆల్ ఇండియా జెమ్స్, జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్)... కొత్తగా తెస్తున్న పాన్ నిబంధనలను తప్పుపట్టింది. రూ.2 లక్షలపై కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి అనే నిబంధనలు జ్యుయలరీ రంగానికి ప్రతికూలమని వ్యాఖ్యానించింది. దీనివల్ల తమ వ్యాపారం దెబ్బతింటుందని, రూ.2 లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని కోరింది. ‘‘పాన్ తప్పనిసరి చేయడం వల్ల జ్యుయలరీ విక్రయాలు తగ్గొచ్చు. ప్రత్యేకంగా గ్రామాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది’’ అని తెలియజేసింది. మెట్రో పట్టణాల్లో కూడా బంగారు ఆభరణాల విక్రయాలు 50% మేర తగ్గే అవకాశముందని పేర్కొంది. బంగారం దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 10% నుంచి 2%కి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇది ఒకేసారి సాధ్యపడకపోతే దశలవారీగా తగ్గించాలని సూచించింది. జనవరి 1 నుంచి రూ.2 లక్షలపై కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి చేస్తే.. జ్యుయలరీ పరిశ్రమ నాశనమయ్యే ప్రమాదముందని జీజేఎఫ్ చైర్మన్ జి.వి.శ్రీధర్ చెప్పారు. పాన్ తప్పనిసరి వల్ల బంగారం కొనుగోళ్లు వ్యవస్థీకృత మార్కెట్ నుంచి అవ్యవస్థీకృత మార్కెట్వైపునకు మళ్లే అవకాశం ఉందని, తద్వారా ప్రస్తుతం 20-25 శాతంగా ఉన్న వ్యవస్థీకృత మార్కెట్ వాటా తగ్గే ప్రమాదముందని చెప్పారు. తాజా నిబంధనలను గ్రామాల్లో అమలుచేయడం కష్టమన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంత జ్యుయలరీ మార్కెట్ వాటా 70 శాతంగా ఉందన్నారు. దేశంలో ఇప్పటికీ పాన్ కార్డుల మంజూరు సంఖ్య స్వల్పంగానే ఉందని చెప్పారు. కొత్త నిబంధనలు జ్యుయలరీ పరిశ్రమను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని జెమ్స్ అండ్ జ్యుయలరీ ఫెడరేషన్ మాజీ చైర్మన్ అశోక్ మీనావాలా చెప్పారు. ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 6 కోట్ల మంది ఆధారపడ్డారని తెలిపారు. రూ.10 లక్షలు దాటిన కొనుగోళ్లకే పాన్ తప్పనిసరి చేయాలన్నారు. నల్లధనాన్ని అరికట్టడానికి కేంద్రం తీసుకున్న ఈ చర్యను తాము తప్పుపట్టడం లేదన్నారు. ‘‘ఇది ఆచరణాత్మకమైనదికాదు. దీనివల్ల పాన్ కార్డులు లేని, పన్ను పరిధిలోకి రాని కొనుగోలుదారులున్న 70% గ్రామాల్లో జ్యుయలరీ మార్కెట్‌ను వివక్షకు గురిచేసినట్లవుతుంది’’ అన్నారాయన. 1000 టన్నులకు పసిడి దిగుమతులు! న్యూఢిల్లీ: పసిడి దిగుమతులు 2015లో వెయ్యి టన్నులకు చేరుతాయని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య (ఏఐజీజేటీఎఫ్) అంచనావేసింది. ఇదే జరిగితే గతేడాది దిగుమతులకన్నా (900 టన్నులు) ఇది 11% అధికం. అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గుతుండడం దీనికి కారణమని సమాఖ్య చైర్మన్ జీవీ శ్రీధర్ చెప్పారు. ఈ ఏడాది స్మగ్లింగ్ ద్వారా దాదాపు 100 టన్నుల పసిడి దిగుమతి జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య దేశం 850 టన్నుల పసిడి దిగుమతులు చేసుకుంది. గతేడాది ఇదే కాలంలో దిగుమతులు 650 టన్నులు. ధరల తగ్గుదల కారణంగా కొనుగోళ్లు భారీగా ఉండడంతో పసిడికి 2015 కలిసొస్తోందని చెప్పారు.