న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ తయారీ సర్వీసుల కంపెనీ ఎవలాన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 415–436 ధరల శ్రేణి ప్రకటించింది. ఏప్రిల్ 3న ప్రారంభంకానున్న ఇష్యూ 6న ముగియనుంది. తద్వారా కంపెనీ రూ. 865 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 31న షేర్లను విక్రయించనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.
వీటికి జతగా మరో రూ. 545 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేర్ల జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 34 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఏప్రిల్ 18న షేర్లు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నాయి. ఎండ్‌టుఎండ్ ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీస్ సొల్యూషన్లు అందిస్తున్న ఎవలాన్ టెక్ 1999లో ఏర్పాటైంది. యూఎస్‌తోపాటు దేశీయంగా 12 తయారీ ప్లాంట్లను నిర్వహిస్తోంది. 2021–22లో రూ. 840 కోట్ల ఆదాయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment