Electronic Manufacturing Cluster
-
వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమైన వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్
-
కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ ఉత్పత్తి షురూ!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ)లో ఏఐఎల్ డిక్సన్ కంపెనీ వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమవుతోంది. ఈ సంస్థ రూ.127 కోట్లతో భద్రత కోసం వినియోగించే సీసీటీవీ, ఐపీ కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. గత నెల రోజుల నుంచి ప్రయోగాత్మకంగా ఉత్పత్తిని ప్రారంభించిన ఏఐఎల్ డిక్సన్ త్వరలో వాణిజ్యపరంగా ఉత్పత్తికి రంగం సిద్ధం చేసుకుంటోంది. రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏఐఎల్ డిక్సన్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో సీపీ ప్లస్ బ్రాండ్ పేరున్న సీసీ కెమెరాలను ఉత్పత్తి చేయనుంది. అత్యాధునిక టెక్నాలజీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటెలిజెంట్ నెట్వర్క్ సొల్యూషన్స్ వెర్టికల్ సరై్వవ్లెన్స్ కెమెరాలను తయారుచేస్తుంది. ఆదిత్య ఇన్ఫోటెక్‌తో కలిసి డిక్సన్ టెక్నాలజీస్ ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ద్వారా 1,800 మందికి ఉపాధి లభించనుంది. ఈ నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ యూనిట్‌ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ ఎల్రక్టానిక్ ఐటీ ఏజెన్సీ(అపిటా) గ్రూప్ సీఈవో ఎస్.కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. మరో రెండు తయారీ యూనిట్లు.. దుబాయ్‌కి చెందిన ప్రముఖ ఎల్రక్టానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ.. ఎలిస్టా కొప్పర్తిలో టెక్నోడోమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎల్ఈడీ టీవీలు, ఎల్రక్టానిక్ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. సుమారు 2.95 ఎకరాల విస్తీర్ణంలో రూ.52 కోట్ల వ్యయంతో దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉపాధి లభించనుంది. ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తులను మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, కామన్వెల్త్ దేశాలకు ఎగుమతి చేస్తుంది. అలాగే వర్చువల్ మేజ్ సాఫ్ట్‌సిస్ ప్రైవేట్ లిమిటెడ్.. ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీల తయారీ, జీపీఎస్ ట్రాకర్, స్మార్ట్ పీసీబీల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. 7.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.71.10 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ ద్వారా 1,350 మందికి ఉపాధి లభించనుంది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులకు కూడా సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. నిర్మాణ పనులు మొదలైన 24 నెలల్లోగా ఉత్పత్తిని ప్రారంభించే విధంగా కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. రూ.749 కోట్లతో వైఎస్సార్ ఈఎంసీ అభివృద్ధి ఎల్రక్టానిక్ ఉత్పత్తుల తయారీ కోసం వైఎస్సార్ ఈఎంసీని 801 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో భాగంగా తొలిదశలో 540 ఎకరాలు, రెండో దశలో 261 ఎకరాలు అభివృద్ధి చేయనున్నాం. తొలిదశలో రూ.749 కోట్లతో వైఎస్సార్ ఈఎంసీని అభివృద్ధి చేశాం. సుమారు రూ.8,910 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా సుమారు 28,250 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నాం. ఇప్పటికే ఆరు యూనిట్లకు సుమారు 30 ఎకరాల వరకు కేటాయించాం. రానున్న కాలంలో ఎల్రక్టానిక్ తయారీ హబ్‌గా కొప్పర్తి కొత్తరూపు సంతరించుకోనుంది. – కోన శశిధర్, ఐటీ శాఖ కార్యదర్శి -
ఎవలాన్ టెక్ @ 415–436
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ తయారీ సర్వీసుల కంపెనీ ఎవలాన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 415–436 ధరల శ్రేణి ప్రకటించింది. ఏప్రిల్ 3న ప్రారంభంకానున్న ఇష్యూ 6న ముగియనుంది. తద్వారా కంపెనీ రూ. 865 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 31న షేర్లను విక్రయించనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 545 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేర్ల జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 34 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఏప్రిల్ 18న షేర్లు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నాయి. ఎండ్టుఎండ్ ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీస్ సొల్యూషన్లు అందిస్తున్న ఎవలాన్ టెక్ 1999లో ఏర్పాటైంది. యూఎస్‌తోపాటు దేశీయంగా 12 తయారీ ప్లాంట్లను నిర్వహిస్తోంది. 2021–22లో రూ. 840 కోట్ల ఆదాయం సాధించింది. -
రాబోయే పదేళ్లలో 16 లక్షల ఉద్యోగాలు: మంత్రి కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి : ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి రంగంలో రాబోయే పదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం, 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకుడు ఉన్నందునే ఇది సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని రావిర్యాల ఈ-సిటీలో రేడియంట్ ఎలక్ట్రానిక్స్ యూనిట్లో మరో నూతన ప్లాంట్‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేడియంట్ కంపెనీ నుంచి 50 లక్షల టీవీలు తయారవ్వడం గర్వంగా ఉందన్నారు. దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ టీవీ కంపెనీ ఇది అని పేర్కొన్నారు. రేడియంట్ కంపెనీలో 3,800ల మందికి పైగా పని చేస్తున్నారని తెలిపారు. యూనిట్ ప్రారంభంలో సంవత్సరానికి 4 లక్షల టీవీలు తయారు చేద్దామని అనుకున్నప్పటికీ.. నెలకు 4 లక్షల టీవీలు తయారు చేసే స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందన్నారు. ఇది తెలంగాణకు గర్వకారణం అన్నారు. ఉద్యోగుల్లో 53 శాతం మహిళలు ఉండగా, 60 శాతం తెలంగాణ వారే ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. చదవండి: అన్నీ కొరతలే.. అద్భుతం: కేటీఆర్ ట్వీట్ అన్ని రంగాల్లో బహుముఖ అభివృద్ధి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో టెన్త్, ఇంటర్మీడియట్, ఐటీఐ చదువుకున్న పిల్లలను ఉద్యోగులుగా తీర్చిదిద్దే అవకాశం ఉందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేటీఆర్ తెలిపారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మరింత విస్తరిస్తే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఫ్యాబ్ సిటీలో 15 వేల మంది ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. రాబోయే సంవత్సర కాలంలో 15 వేల సంఖ్య 40 వేలకు చేరుకోబోతుందన్నారు. శేరిలింగంపల్లిలో ఇటీవలే ప్రపంచంలోనే రెండో అతిపెద్దదైన గూగుల్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేశామన్నారు. కొత్తూరులో లిక్విడ్ డిటర్జెంట్ యూనిట్‌ను ప్రారంభించామన్నారు. ఈ రకంగా తెలంగాణలో సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ రంగాలతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగాలతో పాటు అన్ని రంగాల్లో బహుముఖంగా దూసుకుపోతున్నామని చెప్పారు. చదవండి: తెలంగాణ గ్రూప్-1 పోస్టులకు అప్లై చేస్తున్నారా? బబ్లింగ్‌తో భద్రం! Live: Addressing the gathering after inaugurating the Radiant Appliances and Electronics plant at E-City in Raviryala. https://t.co/x5aepfSErc — KTR (@KTRTRS) May 2, 2022 రాబోయే 10 సంవత్సరాల్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో దాదాపు రెండున్నర లక్షల కోట్లు ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా ఎదగాలని, 16 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వ్యాపారానికి తెలంగాణలో సానుకూల వాతావరణం ఉంది. స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకుడు తెలంగాణలో ఉన్నారు. హైదరాబాద్ చుట్టూ మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌ను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. -
వైఎస్సార్ జిల్లాలో విదేశీ మొబైల్స్ తయారీ!
సాక్షి, అమరావతి/వైఎస్సార్: విదేశీ ఫోన్ ట్రింగ్ ట్రింగ్‌తో త్వరలోనే వైఎస్ఆర్ కడప జిల్లా మారుమ్రోగనుంది. కోవిడ్–19 తర్వాత విదేశీ ఎలక్ట్రానిక్ కంపెనీలు ఇప్పుడు ఇండియాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తుండటంతో ఈ కంపెనీలను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ) ఏర్పాటు చేస్తోంది. వైఎస్ఆర్ కడప జిల్లా కోపర్తి వద్ద సుమారు 500 ఎకరాల్లో ఈఎంసీ3ని అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే తిరుపతి సమీపంలో వికృతమాళ వద్ద 113.27 ఎకరాల్లో ఈఎంసీ1 , 501.40 ఎకరాల్లో ఈఎంసీ 2 ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా 500 ఎకరాల్లో కోపర్తి వద్ద ఈఎంసీ3ని అభివృద్ధి చేయనున్నారు. తైవాన్‌కు చెందిన పలు ఎలక్ట్రానిక్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నాయని, దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక చర్చలు కూడా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. (ప్రజా నాడి తెలిసిన నేత మరిలేరు) మొబైల్ తయారీ యూనిట్ల ఆకర్షణే లక్ష్యం యాపిల్, రెడ్మీ వంటి ఫోన్లను తయారు చేసే ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో మరో రెండు యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఫాక్స్‌కాన్ కోపర్తి ఈఎంసీలో యూనిట్ ఏర్పాటు అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. అలాగే యాపిల్ ఫోన్ తయారు చేసే మరో తైవాన్ సంస్థ పెగాట్రాన్ కూడా కోపర్తిలో యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. కోవిడ్–19 తర్వాత పలు విదేశీ కంపెనీలు ఇండియాలో యూనిట్లు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయని, వీటిని ఆకర్షించడం కోసం కోపర్తిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈఎంసీ–3ని అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే విదేశాలకు చెందిన సుమారు 22 కంపెనీలు ఇండియాలో యూనిట్లు పెట్టడానికి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాయని, వీటిలో అత్యధిక భాగం రాష్ట్రానికి తీసుకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే కడప జిల్లా యాపిల్ ఫోన్ ట్రింగ్ ట్రింగ్‌లతో మారుమ్రోగనుంది. (‘అమూల్’ శిక్షణా తరగతులు) -
హైదరాబాద్‌లో 1,200 కోట్ల పెట్టుబడి
►సిద్ధంగా ఉన్న 64 ఎలక్ట్రానిక్ కంపెనీలు ►స్థలం కేటాయించగానే ప్లాంట్ల ఏర్పాటు ►ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ‘ఇ-సిటీ’లో అడుగు పెట్టేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. తొలుత 64 కంపెనీలు రూ.1,200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. ప్రత్యక్షంగా 35 వేల మందికి, పరోక్షంగా 2.10 లక్షల మందికి ఉపాధి లభించనుంది. మరో 150 కంపెనీలు ప్లాంట్లను పెట్టేందుకు సుముఖంగా ఉన్నాయని ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఎలియాప్) చెబుతోంది. స్థలం ధర విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కోసం కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. ప్లాంట్ల ఏర్పాటు కార్యరూపంలోకి వస్తే ఎలక్ట్రానిక్స్ రంగంలో హైదరాబాద్ కొత్త పుంతలు తొక్కడం ఖాయమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. వ్యాపారావకాశాలు మెరుగై మరిన్ని కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఐటీఐఆర్ పరిధిలో..: హైదరాబాద్ సమీపంలో రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను గతేడాదే కేంద్రం కేటాయించింది. ఫ్యాబ్‌సిటీలో 602 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ సిటీ (ఇ-సిటీ) పేరుతో, రెండోది అనుబంధ పరిశ్రమల కోసం మహేశ్వరం వద్ద 310 ఎకరాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. ఈ రెండు క్లస్టర్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) పరిధిలోకి వస్తాయి. ఐటీఐఆర్ హైదరాబాద్‌కు రావడంలో ఎలియాప్, నాస్కామ్, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కృషి ఉంది. ఇక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఇ-సిటీ ఉండడంతో ఎగుమతులకు కలిసొస్తుందని కంపెనీలు భావిస్తున్నాయి. తయారీ రంగానికి ఊతమిచ్చేలా బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన వరాలు అమలైతే పరిశ్రమ రూపురేఖలు మారతాయన్నది కంపెనీల విశ్వాసం. తెలంగాణ ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా 2 వారాల్లోనే ప్రాజెక్టులకు కావాల్సిన అనుమతులన్నీ ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉంది. ధర విషయంలోనే.. ఇ-సిటీలో ప్లాంట్ల ఏర్పాటుకు ఏడాది నుంచి ఎలియాప్ తీవ్రంగా కృషి చేస్తోంది. ధర విషయంలో స్పష్టత రాకపోవడం, ఆ తర్వాత ఎన్నికల కోడ్‌తో ప్రతిపాదన కాస్తా ఆలస్యమైంది. కొత్త ప్రభుత్వం రాకతో తిరిగి ప్రక్రియను ఎలియాప్ వేగిరం చేసింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు వివిధ శాఖల అధికారులతో చర్చలు జరుపుతోంది. ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఎలియాప్ ప్రెసిడెంట్, ల్యామ్‌పెక్స్ ఎలక్ట్రానిక్స్ ఎండీ ఎన్.శివప్రసాద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. 64 కంపెనీలు తొలి దశలో రూ.1,200 కోట్లు వెచ్చిస్తాయని పేర్కొన్నారు. ఎకరాకు రూ.35 లక్షలతోపాటు అభివృద్ధి వ్యయం కూడా చెల్లించాలని టీఎస్ఐఐసీ చెబుతోందని, ఇంత మొత్తం చెల్లించే స్తోమత కంపెనీలకు లేదని తెలిపారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ప్రభుత్వం నుంచి త్వరలోనే తీపి కబురు వస్తుందని విశ్వసిస్తున్నట్టు ఎలికో ఎండీ రమేష్ దాట్ల చెప్పారు. ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైతే హైదరాబాద్‌కు మరిన్ని సంస్థలు వస్తాయని అన్నారు. కంపెనీలకు పూర్తి తోడ్పాటు.. ప్లాంట్ల ఏర్పాటుకు కావాల్సిన పూర్తి సహకారం ప్రభుత్వం నుంచి ఉంటుందని తెలంగాణ పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏవైతే వర్తిస్తాయో అవే ప్రయోజనాలు తెలంగాణలోనూ అమలవుతాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆందోళన చెందక్కర లేదని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీయే స్థలం ధర నిర్ణయిస్తుందని తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) ఎండీ జయేష్ రంజన్ వెల్లడించారు. -
హైదరాబాద్‌లో 1,200 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ‘ఇ-సిటీ’లో అడుగు పెట్టేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. తొలుత 64 కంపెనీలు రూ.1,200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. ప్రత్యక్షంగా 35 వేల మందికి, పరోక్షంగా 2.10 లక్షల మందికి ఉపాధి లభించనుంది. మరో 150 కంపెనీలు ప్లాంట్లను పెట్టేందుకు సుముఖంగా ఉన్నాయని ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఎలియాప్) చెబుతోంది. స్థలం ధర విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కోసం కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. ప్లాంట్ల ఏర్పాటు కార్యరూపంలోకి వస్తే ఎలక్ట్రానిక్స్ రంగంలో హైదరాబాద్ కొత్త పుంతలు తొక్కడం ఖాయమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. వ్యాపారావకాశాలు మెరుగై మరిన్ని కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఐటీఐఆర్ పరిధిలో.. హైదరాబాద్ సమీపంలో రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల ఏర్పాటుకు గత ఏడాదే కేంద్రం అనుమతించింది. ఫ్యాబ్‌సిటీలో 602 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ సిటీ (ఇ-సిటీ) పేరుతో, రెండోది అనుబంధ పరిశ్రమల కోసం మహేశ్వరం వద్ద 310 ఎకరాల్లో క్లస్టర్లు ఏర్పాటు కానున్నాయి. ఈ రెండు క్లస్టర్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) పరిధిలోకి వస్తాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలో ఇ-సిటీ ఉండడంతో ఎగుమతులకు కలిసి వస్తుందని కంపెనీలు భావిస్తున్నాయి. తయారీ రంగానికి బూస్ట్నిచ్చేలా బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన వరాలు అమలైతే పరిశ్రమ రూపురేఖలు మారతాయన్నది కంపెనీల విశ్వాసం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా రెండు మూడు వారాల్లోనే ప్రాజెక్టులకు కావాల్సిన అన్ని అనుమతులు ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉంది. ధర విషయంలోనే.. ఇ-సిటీలో ప్లాంట్ల ఏర్పాటుకు ఏడాదికిపైగా కాలంగా ఎలియాప్ తీవ్రంగా కృషి చేస్తోంది. ధర విషయంలో స్పష్టత రాకపోవడం, ఆ తర్వాత ఎన్నికల కోడ్‌తో ప్రతిపాదన కాస్తా ఆలస్యమైంది. కొత్త ప్రభుత్వం రాకతో తిరిగి ప్రక్రియను ఎలియాప్ వేగిరం చేసింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు వివిధ శాఖల అధికారులతో చర్చలు జరుపుతోంది. ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఎలియాప్ ప్రెసిడెంట్, ల్యామ్‌పెక్స్ ఎలక్ట్రానిక్స్ ఎండీ ఎన్.శివప్రసాద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. 64 కంపెనీలు తొలి దశలో రూ.1,200 కోట్లు వెచ్చిస్తాయని పేర్కొన్నారు. టీఎస్ఐఐసీ ఎకరాకు రూ.35 లక్షలు చెబుతోందని, ఇంత మొత్తం చెల్లించే స్తోమత కంపెనీలకు లేదని తెలిపారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ప్రభుత్వం నుంచి త్వరలోనే తీపి కబురు వస్తుందని విశ్వసిస్తున్నట్టు ఎలికో ఎండీ రమేష్ దాట్ల చెప్పారు. ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైతే హైదరాబాద్‌కు మరిన్ని సంస్థలు వస్తాయని అన్నారు. కంపెనీలకు పూర్తి తోడ్పాటు.. ప్లాంట్ల ఏర్పాటుకు కావాల్సిన పూర్తి సహకారం ప్రభుత్వం నుంచి ఉంటుందని తెలంగాణ పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏవైతే వర్తిస్తాయో అవే ప్రయోజనాలు తెలంగాణలోనూ అమలవుతాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో పరిశ్రమల ప్రతినిధులు ఆందోళన చెందక్కర లేదని అన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీయే స్థలం ధర నిర్ణయిస్తుందని తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) ఎండీ జయేష్ రంజన్ వెల్లడించారు.