సూరజ్‌కు త్వరలో పటుత్వ పరీక్షలు | Medical examination for Suraj Revann | Sakshi
Sakshi News home page

సూరజ్‌కు త్వరలో పటుత్వ పరీక్షలు

Published Wed, Jun 26 2024 10:15 AM | Last Updated on Wed, Jun 26 2024 1:28 PM

Medical examination for Suraj Revann

అసహజ లైంగిక దాడి కేసు...  

శివాజీనగర: లైంగిక దాడుల కేసులో గతంలో అన్న ప్రజ్వల్‌ రేవణ్ణకు పోలీసులు, వైద్యులు లైంగిక పటుత్వ పరీక్షలను నిర్వహించారు. ఇప్పుడు తమ్ముడు సూరజ్‌కు కూడా ఇవే పరీక్షలు చేయడానికి  సీఐడీ ప్రత్యేక తనిఖీ బృందం సిద్దమైంది. యువకున్ని బెదిరించి అసహజ లైంగిక దాడి చేశారనే కేసులో ఈ నెల 23వ తేదీన సూరజ్‌ని హాసన్‌లో అరెస్టు చేయడం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా అతి త్వరలోనే అతనికి బౌరింగ్‌ ఆస్పత్రిలో పురుషత్వ పరీక్షలు చేయించే అవకాశముంది.

 అలాగే స్వలింగ కామం సహజమైందా అనేదానికి మరికొన్ని పరీక్షలు చేయవచ్చని పోలీసులు తెలిపారు. అన్న ప్రజ్వల్‌కు జరిపిన పరీక్షల కంటే కొంతవరకు భిన్నంగా ఉంటాయని తెలిసింది. సూరజ్‌ ప్రస్తుతం సీఐడీ కస్టడీలో ఉన్నాడు. మూడు కేసుల్లో ప్రజ్వల్‌కు మూడుసార్లు పరీక్షలు చేశారు. ఇదేం బాగాలేదని అతడు కోర్టులో ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు సూరజ్‌ ఆప్తుడు శివకుమార్‌ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతన్ని అరెస్టు చేస్తే కేసులో మరిన్ని అంశాలు బయటకు వస్తాయంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement