ఆఫ్రీన్ బేగం, కూతురు అయాత్
సాక్షి, హైదరాబాద్: బంధువుల ఇంటికి వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన తల్లీకూతుళ్లు అదృశ్యమైన ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సురేష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లాలాపేటలోని గవర్న్‌మెంట్ స్కూల్ సమీపంలో నివాసముంటున్న సయ్యద్ అసీమ్, ఆఫ్రీన్ బేగం దంపతులు. వీరికి 8 నెలల అయాత్ అనే కూతురు సంతానం.
ఈ నెల 6న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆఫ్రీన్ బంధువుల ఇంటికి వెళ్లొస్తానని చెప్పి తన కూతురు అయాత్‌ను తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రైనా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆఫ్రీన్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. బంధువులను, తెలిసిన వారిని వాకబు చేసినా ఫలితం కనిపించకపోవడంతో లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
లాలాపేట: బాలుడు అదృశ్యమైన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌కు చెందిన వరుణ్(10) ఈ నెల 5న మాణికేశ్వర్‌నగర్‌లో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి తల్లిదండ్రులతో కలిసి వచ్చాడు. తిరిగి వెళ్తామని అనుకుంటున్న సమయంలో ఈ నెల 6న మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటున్న వరుణ్ కనిపించకుండా పోయాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికిననా ఫలితం లేదు. దీంతో తండ్రి యశ్వంత్ ఓయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిరాద్యు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment