డ్రెస్‌ కొనుక్కుంటానని చెప్పి బయటకు వెళ్లి.. | Woman Goes Missing With Two Childrens Near Dundigal Police station | Sakshi
Sakshi News home page

డ్రెస్‌ కొనుక్కుంటానని చెప్పి బయటకు వెళ్లి..

Published Tue, Mar 22 2022 9:04 AM | Last Updated on Tue, Mar 22 2022 3:40 PM

Woman Goes Missing With Two Childrens Near Dundigal Police station - Sakshi

చాందినిదేవి, యువరాజ్‌

సాక్షి, దుండిగల్‌: ఓ మహిళ కుమారుడితో సహా అదృశ్యమైన ఘటన దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌ రాష్ట్రం సంస్తాన్‌పూర్‌కు చెందిన చంచల్‌ పాశ్వాన్, చాందిని దేవిలు భార్యాభర్తలు. కాగా వీరికి ముగ్గుకు సంతానం. బతుకు దెరువు కోసం వీరు నగరానికి వలస వచ్చి దుండిగల్‌ మున్సిపాలిటీ గండిమైసమ్మలోని 120 గజాల్లో నివాసముంటున్నారు. చంచల్‌ పాశ్వాన్‌ కూలీ పనులు చేస్తుండగా, అతడి భార్య ఇంటి వద్దనే ఉంటోంది.

కాగా ఈ నెల 20న మధ్యాహ్నం 2 గంటల సమయంలో చాందినిదేవి తన చిన్నకుమారుడు యువరాజ్‌(3)ను వెంట బెట్టుకుని డ్రెస్‌ కొనుక్కుంటానని చెప్పి బయటకు వెళ్లింది. రాత్రైనా ఆమె ఇంటికి రాకపోవడంతో భర్త వారి కోసం చుట్టు పక్కల వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సోమవారం దుండిగల్‌ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement