
సాక్షి, హైదరాబాద్: భర్తతో కలిసి సినిమాకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ సాయులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాకు చెందిన భాస్కర్ రెడ్డి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 21న సాయంత్రం భార్య శైలజతో కలిసి కొత్తగూడలోని ఏఎంబీ మాల్‌లో సినిమాకు వచ్చాడు. సినిమా చూస్తుండగా శైలజ వాష్‌రూమ్‌కు వెళుతున్నట్లు చెప్పి బయటికి వెళ్లి తిరిగి రాలేదు.
దీంతో అతను మహిళా సిబ్బందితో వాష్ రూమ్‌లో వెతికించినా జాడ తెలియలేదు. పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. శైలజతో గత మే నెలలో భాస్కర్ రెడ్డికి వివాహం జరిగింది. తన భార్య వద్ద సెల్‌ఫోన్ కూడా లేదని, జాడ తెలియడం లేదని ఆదివారం ఆమె భర్త గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఏఎంబీ మాల్‌లో సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.
చదవండి: రైళ్లలో ప్రీమియం తత్కాల్ దోపిడీ..రూ.450 టికెట్ రూ.1000పైనే
Comments
Please login to add a commentAdd a comment