పెళ్లై రెండు నెలలు.. పని నిమిత్తం భర్త, అత్తమామలు బయటకు వెళ్లడంతో.. | HYD: Woman Goes Missing After 2 Months Of Marriage At Pet Basheerabad | Sakshi
Sakshi News home page

రెండు నెలల క్రితమే పెళ్లి.. పని నిమిత్తం భర్త, అత్తమామలు బయటకు వెళ్లడంతో..

Published Sun, Jun 19 2022 2:02 PM | Last Updated on Sun, Jun 19 2022 2:06 PM

HYD: Woman Goes Missing After 2 Months Of Marriage At Pet Basheerabad - Sakshi

సంధ్య

సాక్షి, హైదరాబాద్‌: అనుమానాస్పద స్థితిలో ఓ గృహిణి అదృశ్యమైన ఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మల్లన్న తాండ, నల్లపోచమ్మ ఆలయం సమీపంలో నివాసముండే పోతు నితిన్, సంధ్య(28)లకు రెండు నెలల క్రితం వివాహమైంది. కాగా ఈ నెల 16న ఉదయం 9 గంటలకు నితిన్‌ ప్లంబింగ్‌ పని నిమిత్తం బయటకు వెళ్లగా, అతడి తల్లిదండ్రులు సైతం హాస్టల్‌లో పని చేసేందుకు వెళ్లారు.

ఈ క్రమంలో మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో నితిన్‌ ఇంటికి రాగా భార్య సంధ్య కనిపించలేదు. ఆమె మొబైల్‌కు ప్రయత్నించగా ఇంట్లోనే వదిలిపెట్టింది. ఆందోళన చెందిన అతను చుట్టు పక్కల, బంధువుల ఇళ్లల్లో వెతకగా ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం నితిన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: కీటికిలో నుంచి గుట్టుగా మహిళ  ఫొటోలు తీసి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement