petbasheerabad police station
-
పెళ్లై రెండు నెలలు.. పని నిమిత్తం భర్త, అత్తమామలు బయటకు వెళ్లడంతో..
సాక్షి, హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో ఓ గృహిణి అదృశ్యమైన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మల్లన్న తాండ, నల్లపోచమ్మ ఆలయం సమీపంలో నివాసముండే పోతు నితిన్, సంధ్య(28)లకు రెండు నెలల క్రితం వివాహమైంది. కాగా ఈ నెల 16న ఉదయం 9 గంటలకు నితిన్ ప్లంబింగ్ పని నిమిత్తం బయటకు వెళ్లగా, అతడి తల్లిదండ్రులు సైతం హాస్టల్లో పని చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో నితిన్ ఇంటికి రాగా భార్య సంధ్య కనిపించలేదు. ఆమె మొబైల్‌కు ప్రయత్నించగా ఇంట్లోనే వదిలిపెట్టింది. ఆందోళన చెందిన అతను చుట్టు పక్కల, బంధువుల ఇళ్లల్లో వెతకగా ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం నితిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కీటికిలో నుంచి గుట్టుగా మహిళ ఫొటోలు తీసి.. -
పెళ్లికొడుకు మృతి కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పెళ్లికొడుకు మృతి కేసు మరో మలుపు తిరిగింది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని సందీప్ తండ్రి నక్కెర్తి శ్రీనివాస్‌చారి చెప్పారు. సందీప్‌ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. పెళ్లికి ముందు జరిగిన ఫొటోషూట్‌కు వెళ్లిన తన కుమారుడు ఎలా ఆత్మహత్య చేసుకుంటాడని అనుమానం వ్యక్తం చేశారు. సందీప్ హత్యకు బాబాయ్, పిన్నమ్మలే కారకులని ఆరోపించారు. తన కుమారుడికి తాత ఆస్తిలో వాటా ఇవ్వాల్సివస్తుందనే కారణంగానే హత్య చేశారని ఆరోపించారు. సందీప్ తల్లి చనిపోయిన నాటి నుంచి కుమారుడిని తనకు దూరంగా ఉంచారని, 15 ఏళ్ల క్రితం చనిపోయిన తన భార్య మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. పెళ్లికి రెండు రోజుల ముందు సందీప్‌కు తనకు ఎలాంటి గొడవ జరగలేదని చెప్పారు. సందీప్ కోరినట్టుగానే పెళ్లి, రిసెప్షన్ జరిపిస్తానని కూడా తాను చెప్పినట్టు వివరించారు. పెళ్లికి కొద్ది గంటల ముందు ఆదివారం ఉదయం వివాహ వేదికైన కొంపల్లి టీ-జంక్షన్‌లోని శ్రీకన్వెన్షన్‌లో సందీప్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: పెళ్లి హాలులోనే వరుడి ఆత్మహత్య) -
హనీమూన్ వీసా కోసం వచ్చి..
హైదరాబాద్: హనీమూన్‌కు వెళ్లేందుకు వీసా తీసుకునేందుకు వచ్చిన ఓ నవ వరుడు మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనాథ్ కథనం ప్రకారం గుంటూరు జిల్లా అమరావతికి చెందిన శ్రీకాంత్‌రెడ్డికి (31) 2015 నవంబర్‌లో వివాహం జరిగింది. అతను తన భార్య, బావ అశ్విత్‌రెడ్డి, చెల్లెలు అక్షయతో కలిసి హనీమూన్ ట్రిప్‌కు వెళ్లేందుకు వీసీ కోసం ఈ నెల 16న నగరానికి వచ్చి పేట్ బషీరాబాద్ సమీపంలోని వీఎస్ఎస్ నందదీప్ అపార్టుమెంట్లో దిగారు. గురువారం ఉదయం అపార్టుమెంట్ నుంచి కిందకు దిగుతున్న శ్రీకాంత్‌రెడ్డి ప్రమాదవశాత్తు కాలు జారి ఐదవ అంతస్తు నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.