హనీమూన్ వీసా కోసం వచ్చి.. | man dies after fall down from fifth floor in hyderabad | Sakshi
Sakshi News home page

హనీమూన్ వీసా కోసం వచ్చి..

Published Fri, Feb 19 2016 5:31 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హనీమూన్ వీసా కోసం వచ్చి.. - Sakshi

హనీమూన్ వీసా కోసం వచ్చి..

హైదరాబాద్: హనీమూన్‌కు వెళ్లేందుకు వీసా తీసుకునేందుకు వచ్చిన ఓ నవ వరుడు మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనాథ్ కథనం ప్రకారం గుంటూరు జిల్లా అమరావతికి చెందిన శ్రీకాంత్‌రెడ్డికి (31) 2015 నవంబర్‌లో వివాహం జరిగింది.

అతను తన భార్య, బావ అశ్విత్‌రెడ్డి, చెల్లెలు అక్షయతో కలిసి హనీమూన్ ట్రిప్‌కు వెళ్లేందుకు వీసీ కోసం ఈ నెల 16న నగరానికి వచ్చి పేట్ బషీరాబాద్ సమీపంలోని వీఎస్‌ఎస్ నందదీప్ అపార్టుమెంట్‌లో దిగారు. గురువారం ఉదయం అపార్టుమెంట్ నుంచి కిందకు దిగుతున్న శ్రీకాంత్‌రెడ్డి ప్రమాదవశాత్తు కాలు జారి ఐదవ అంతస్తు నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement