Hyderabad: నగరంలో ఇద్దరు మహిళల అదృశ్యం..  ఫోన్‌ చేస్తే.. | Two People and Three Childrens Missing in Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: నగరంలో ఇద్దరు మహిళల అదృశ్యం..  ఫోన్‌ చేస్తే..

Published Mon, Jan 17 2022 6:41 AM | Last Updated on Mon, Jan 17 2022 7:14 AM

Two People and Three Childrens Missing in Hyderabad - Sakshi

సాక్షి, జగద్గిరిగుట్ట: ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో అదృశ్యమైన ఘటన జగిద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన ఫాస్ట్‌పుడ్‌ సెంటర్‌ నిర్వాహకులు మున్నరాజు, పుల్కయా(26)లు భార్యాభర్తలు. కాగా వీరికి బిరాజ్‌(9), నిఖిల్‌ (7), బివీత(4) పిల్లలు ఉన్నారు. కాగా ఈ నెల 12న ఉదయం 9 గంటల ప్రాంతంలో మున్నరాజు చంద్రగిరినగర్‌లోని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి ఓనర్‌ ఫోన్‌ చేసి మీ ఇంట్లో ఎవరూ లేరని చెప్పాడు. దీంతో అతను వెంటనే ఇంటికి వెళ్లి చూడగా భార్యా పిల్లలు కనిపించలేదు. ఆమె సెల్‌ఫోన్‌కు డయల్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. మున్నరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: (ఫాస్ట్‌ఫుడ్‌ లేదన్నాడని.. కత్తితో తెగబడ్డాడు)

భర్తతో గొడవపడి.. 
భర్తతో గొడవపడిన ఓ ఇల్లాలు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన జగద్గిరిగుట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట రావినారాయణరెడ్డి నగర్‌కు చెందిన పెయింటర్‌ సనపల శ్రీనివాస్‌రావు, స్రవంతి(33) భార్యాభర్తలు. కాగా ఈ నెల 15న స్రవంతి వేరే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుండటంతో ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇంట్లో చెప్పా పెట్టకుండా ఆమె వెళ్లిపోయింది. చుట్ట పక్కల, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఆమె సెల్‌ఫోన్‌కు డయల్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: (Chicken Sales: అయ్య బాబోయ్‌.. రికార్డు స్థాయిలో చికెన్‌ లాగించేశారు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement