
సాక్షి, కల్వకుర్తి (మహబూబ్‌నగర్): పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన సురేశ్ కొన్ని రోజులుగా కనిపించడం లేదని తండ్రి శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహేందర్ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. అచ్చంపేటకు చెందిన శిల్పతో సురేశ్‌కు వివాహం జరిగింది. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో నెల క్రితం శిల్ప పుట్టింటికి వెళ్లిపోయింది.
పలుమార్లు రమ్మని పిలిచినా రాకపోవడంతో మనస్తాపానికి గురైన సురేశ్ ఇంట్లోనే సెల్‌ఫోన్‌ను ఉంచి ఓ రాత పుస్తకంలో ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని రాసిపెట్టి రెండ్రోజుల క్రితం వెళ్లిపోయాడు.బంధువులను ఆరా తీసినా ఫలితం లేకపోవటంతో పోలీసులను ఆశ్రయించారు. ఆచూకీ లభిస్తే సెల్: 9440795715కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ వివరించారు.
చదవండి: విషాదం: కవల పిల్లల అనుమానాస్పద మృతి..
Comments
Please login to add a commentAdd a comment