చిత్తూరు అర్బన్: కూతురు తప్పిపోయిన ఆర్నెళ్లకు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా సరే చట్టం తన పనిచేయాల్సిందే అన్నట్లు పోలీసులు కూడా గురువారం కేసు నమోదుచేశారు. శ్రీకాళహస్తిలోని బీపీ అగ్రహారానికి చెందిన పల్లవి (22) గుడిపాల ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గిరింపేటలోని ఓ వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌లో ఉంటూ విధులకు హాజరువుతున్నారు. ఈ ఏడాది జనవరి 31వ తేదీ నుంచి ఈమె విధులకు వెళ్లకుండా అదృశ్యమయ్యింది. పల్లవి కోసం చాలా చోట్ల వెతికిన కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కనుక్కోలేకపోయారు. దీంతో ఆమె తల్లి వెంకటరత్నమ్మ టూటౌన్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయడంతో సీఐ యుగంధర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment