ఒక మహిళ 30 ఏళ్ల క్రితం కనిపిచకుండా పోయింది. ఇక కనిపించదు, ఈ మిస్సిగ్ కేసు వీడదు అనుకుని కేసు క్లోజ్ చేసి మరీ.. ఆమె చనిపోయిందని ప్రకటించారు అధికారులు. ఆ తర్వాత అనుహ్యంగా ఝలక్ ఇస్తూ.. ఆ మహిళ బతికి ఉన్నానంటూ ఓ నర్సింగ్ హోంలో ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న పోలీసులు ఆమె గురించి పూర్తి స్థాయిలో విచారించడం ప్రారంభించారు. విచారణలో.. ప్యాటిసియా కోప్టా అనే మహిళ చివరిసారిగా 1992లో పెన్సిల్వేనియాలోని పీటర్స్‌బర్గ్‌లో కనిపిపించింది. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించకుండా పోయింది.
దీంతో పోలీసులు సదరు మహిళ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఐతే ఆమె 1999లో ఉత్తర ప్యూర్టోరికో వీధుల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. ఇక ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకి మిస్టరీగా ఉండిపోయింది. కట్ చేస్తే ప్రస్తుతం ఆమె కరేబియన్ ద్వీపంలోని నర్సింగ్ హోంలో నివశిస్తోందని ఒక సామాజిక కార్యకర్త ద్వారా తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోతారు. వాస్తవానికి ఆమె తన ఊరిలో వీధుల్లో పాఠాలు చెప్పే ఒక టీచర్‌గా మంచి పేరుంది. మరి ఆమె ప్యూర్టో రికోకి ఎలా వెళ్లిందో తెలియదు గానీ అక్కడ ఆమె తన గతాన్ని రహస్యంగా ఉంచింది. ఆ తర్వాత ఆమె క్రమంగా డిమోన్షియా అనే మతిస్థిమితంకి సంబంధించిన మానసిక వ్యాధి బారిన పడింది.
ఐతే ఆమెకు సడెన్‌గా తన గతం గుర్తుకొచ్చి తన వివరాలను వెల్లడించడం ప్రారంభించింది. ఇంతలో ఆ సామాజికి కార్యకర్త సాయంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు నర్సింగ్‌హోమ్‌ని సంప్రదించారు. ఆమెకు డీఎన్‌ఏ టెస్ట్‌లు నిర్వహించి 30 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన మహిళగా నిర్థారించారు. ఐతే ఆమహిళకు ప్రసత్తు 80 ఏళ్లు. వైద్యులు ఆమె కొన్ని మానసిక రుగ్మతలతో వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆమె ఒకనొక దశలో దేశం విడిచి పారిపోవాలనుకుందని కూడా చెప్పారు. ఐతే సదరు మహిళ తప్పిపోవడానికి ముందు ఆమెకు వివాహమైందని, ఆమె భర్త బాబ్ కోప్టా అని అధికారులు తెలిపారు.
పాపాం ఆయన ఆమె కోసం ఎదురు చూస్తూ మరో పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయారు. ఇన్నేళ్ల తర్వాత ఆమె సజీవంగా ఉందని చెప్పడం చాలా రిలీఫ్‌్‌గా ఉందని కోప్టా చెబుతున్నారు. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక కవల చెల్లెలు ఉన్నారు. అయితే వారంతా చనిపోగా ప్రస్తుతం ఆమెకు ఇప్పుడూ ఒక చిన్న చెల్లెలు మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. సదరు మహిళ చెల్లెలు మాట్లాడుతూ.. 80 ఏళ్ల వయసులో ఆమె మా వద్దకు చేరుకోవడం చాలా షాకింగ్‌గా, ఆనందంగా ఉందని చెబుతోంది. విచిత్రమేమిటంటే పెళ్లికి ముందుగానీ, ఆతర్వాత గానీ ఎప్పుడూ కూడా ఆమె పూర్టో రికో నగరానికి వెళ్లిందే లేదు.
(చదవండి: ఢిల్లీలోని ఆటో రిక్షాలో యూఎస్ సెక్రటరీ)
Comments
Please login to add a commentAdd a comment