Puerto Rico
-
US Elections 2024: చెత్త చుట్టూ అమెరికా ఎన్నికల సమరం
హోరాహోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం చివరి ఘట్టంలో ‘చెత్త’ చుట్టూ తిరుగుతోంది. గత ఆదివారం రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ బహిరంగ సభలో స్టాండప్ కమేడియన్ టోనీ హించ్‌క్లిఫ్ మాట్లాడుతూ ప్యూర్టోరీకోను నీటిపై తేలుతున్న చెత్తకుప్పగా అభివరి్ణంచడం తెలిసిందే. దానిపై అమెరికావ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా ఉన్న ప్యూర్టోరీకో ఓటర్లలో ఆ వ్యాఖ్యలు ఆగ్రహం రగిల్చాయి. వారంతా నవంబర్ 5 నాటి పోలింగ్‌లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేయవచ్చని, ఫలితంగా డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ విజయాన్ని నల్లేరుపై నడకగా మారనుందని విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ట్రంప్ అభిమానులనే ‘అసలైన చెత్త’గా అభివరి్ణస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దాంతో పరిస్థితి తారుమారైందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తన ఉద్దేశం అది కాదంటూ సోషల్ మీడియా సాక్షిగా బైడెన్ వివరణ ఇచ్చినా అప్పటికే హారిస్‌కు భారీ నష్టం జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అనుకోని అవకాశాన్ని గట్టి ఆయుధంగా వాడుకునేందుకు ట్రంప్‌తో పాటు ఆయన ప్రచార శిబిరం కూడా శాయశక్తులా ప్రయతి్నస్తోంది. అమెరికన్లను అవమానించడం డెమొక్రాట్లకు కొత్తేమీ కాదంటూ ఊరూవాడా హోరెత్తిస్తోంది...! ఎన్నికల ఘట్టం చివరి అంకంలో సొంత పార్టీ అభ్యర్థి హారిస్‌ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ గట్టి చిక్కుల్లోనే పడేశారు. ప్యూర్టోరీకోపై టోనీ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిస్పానిక్ గ్రూప్ వోటో లాటినో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. ప్యూర్టోరీకాపై ట్రంప్ సమక్షంలోనే టోనీ చేసిన దిగజారుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్యూర్టోరీకన్ల పట్ల పూర్తి సంఘీభావం ప్రకటించారు. ‘‘వారు చాలా మంచివాళ్లు. ఆత్మగౌరవమున్న వ్యక్తులు. అమెరికా అభివృద్ధిలో వారికి కీలక పాత్ర’’ అంటూ కొనియాడారు. ‘‘లాటిన్ అమెరికన్లను రాక్షసులుగా చిత్రించేందుకు ట్రంప్, ఆయన శిబిరం చేస్తున్న ప్రయత్నాలు దారుణం. ఇతర దేశాలను కించపరచడం అమరికా విధానమే కాదు. అమెరికా పాటించే విలువలకు అవి పూర్తిగా విరుద్ధం’’ అంటూ విమర్శించారు. అక్కడిదాకా బాగానే ఉన్నా, ‘‘నాకు తెలిసిన అసలైన చెత్త ఆయన (ట్రంప్) మద్దతుదారులు మాత్రమే. వారి రూపంలోనే అసలైన చెత్తాచెదారం కనిపిస్తోంది’’ అంటూ నోరుజారారు. వాటిపై అమెరికా అంతటా విమర్శలు చెలరేగుతున్నాయి. బైడెన్ అంగీకారయోగ్యం కాని వ్యాఖ్యలు చేశారని విమర్శకులు కూడా భావిస్తున్నారు. ప్యూర్టోరీకాపై టోనీ తలతిక్క వ్యాఖ్యలతో తలపట్టుకున్న రిపబ్లికన్ పార్టీ నెత్తిన బైడెన్ పాలు పోశారంటున్నారు. ఆయన వ్యాఖ్యలను రిపబ్లికన్లు రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ చేసిన వ్యాఖ్యలతో ముడిపెట్టి మరీ, ‘అమెరికన్లను దారుణంగా అవమానించడం డెమొక్రాట్లకు అలవాటే’నంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ట్రంప్ మద్దతుదారులైన కోట్లాది మంది అమెరికన్లను బైడెన్, హారిస్ దారుణంగా అవమానించారంటూ ట్రంప్ ప్రచార బృందం జాతీయ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ దుయ్యబట్టారు. వివరణ ఇచి్చనా... వ్యవహారం చేయి దాటుతోందని గ్రహించిన బైడెన్ వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగారు. తాను చెత్త అన్నది ప్యూర్టోరీకోపై అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ మద్దతుదారును ఉద్దేశించి మాత్రమేనంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అలాంటి వారిని దిగజారుడుతనాన్ని వర్ణించేందుకు అదే సరైన పదమని చెప్పుకొచ్చారు. కానీ బైడెన్ వ్యాఖ్యలపై దుమారం చల్లారడం లేదు. వాటిపై డెమొక్రాట్ నేతలను అమెరికా అంతటా ప్రజలు నిలదీస్తున్నారు. హారిస మద్దతుదారైన పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరోకు కూడా మంగళవారం సాయంత్రం ఒక ఇంటర్వ్యూలో దీనిపై వరుసబెట్టి ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంతో, ‘ప్రత్యర్థి నేతలకు మద్దతిచి్చనా నేనైతే అమెరికన్లెవరినీ ఎప్పటికీ అవమానించబోను’’ అంటూ ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచి్చంది. నాడు హిల్లరీ ఏమన్నారంటే... 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కూడా ట్రంప్ మద్దతుదారులపై ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘ట్రంప్ మద్దతుదారుల్లో సగానికి సగం మంది ఎందుకూ పనికిమాలినవాళ్లే. వాళ్లంతా జాత్యహంకారులు. స్త్రీలు, ముస్లింలు, విదేశీయులతో పాటు స్వలింగ సంపర్కుల పట్ల విద్వేషం వెలిగక్కేవాళ్లు’’ అంటూ దుయ్యబట్టారు. ఆ వ్యాఖ్యల ద్వారా అమెరికన్లందరినీ హిల్లరీ తీవ్రంగా అవమానించారంటూ రిపబ్లికన్లు అప్పట్లో జోరుగా ప్రచారం చేశారు.డెమొక్రాట్లకు అలవాటేబైడెన్ తాజా వ్యాఖ్యలపై ట్రంప్ కూడా స్పందించారు. పెన్సిల్వేనియాలో ర్యాలీలో ఉండగా బైడెన్ వ్యాఖ్యలను ట్రంప్ ప్రచార బృందం ఆయన చెవిన వేసింది. దాంతో, ‘‘వావ్! ఇది దారుణం. కానీ వాళ్లకు (డెమొక్రాట్లకు) ఇది అలవాటే’’ అంటూ ట్రంప్ స్పందించారు. ‘‘2016లో నాతో తలపడ్డ హిల్లరీ కూడా నా మద్దతుదారులపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలే చేశారు. కానీ అవి ఫలించలేదు. ‘చెత్త’ వ్యాఖ్యలు వాటికంటే దారుణమైనవి. కాదంటారా?’’ అంటూ వివాదాన్ని మరింత పెద్దది చేసే ప్రయత్నం చేశారు. అమెరికన్లపై ఎవరూ క్రూర పరిహాసం చేయొద్దన్నదే తన అభిప్రాయమని చెప్పుకొచ్చారు. అమెరికన్లపై ప్రేమాభిమానాలు లేని డెమొక్రాట్లకు దేశానికి నాయకత్వం వహించే హక్కే లేదన్నారు. పనిలో పనిగా అంతేగాక టోనీ ‘ప్యూర్టోరీకో’ వ్యాఖ్యలకు దూరం జరిగేందుకు కూడా ట్రంప్ ప్రయతి్నంచారు. వాటితో తనకు ఏ సంబంధమూ లేదని చెప్పుకొచ్చారు. ‘‘ఎవరో కమేడియన్ ప్యూర్టోరీకోపై ఏదో అభ్యంతరకరమైన జోకు పేలి్చనట్టు నాకెవరో చెప్పారు. అతనెవరో నాకస్సలు తెలియదు. అతన్ని నేనెన్నడూ కనీసం చూడను కూడా లేదు’’ అని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి ట్రంప్ ర్యాలీ వేదికపై ఎందుకున్నట్టన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వలేదు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ పుట్టిని ప్యూర్టోరీకో ముంచుతుందా?
విశాలమైన రహదారిపై ప్రయాణం సాఫీగా సాగుతున్న వేళ జరిగే ఓ చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చిట్టచివరి భారీ బహిరంగ సభ అనూహ్యంగా పెద్ద వివాదానికి, జాత్యహంకార వ్యాఖ్యలు వేదికగా మారింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగిన ప్రచార కార్యక్రమం చివరకు లాటిన్ అమెరికన్లు, యూదులు, ఆఫ్రో అమెరికన్లపై జాత్యహంకార వ్యాఖ్యలతో వివాదాస్పదంగా ముగిసింది.దీంతో రిపబ్లికన్ పార్టీ పట్ల ఆయా వర్గాల ఓటర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుందని కథనాలు వెలువడుతున్నాయి. వివాదం చిలికిచిలికి గాలివానగా వ్యతిరేక ఓట్ల దుమారంగా మారితే ట్రంప్ విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదముంది. కరేబియన్ దీవుల్లో ఒకటైన ప్యూర్టోరీకో అమెరికా అ«దీనంలో ఉంది. ఇక్కడి ద్వీపవాసులకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేయకపోయినా పెద్దసంఖ్యలో ప్యూర్టోరికో వారసులు అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఓటర్లుగా నివసిస్తున్నారు. తమ ద్వీపాన్ని అవహేళన చేయడంతో వాళ్లంతా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేసే అవకాశముంది.అసలేం జరిగింది?ఆదివారం జరిగిన ఈ సభలో ట్రంప్, భార్య మెలానియా ప్రసంగించారు. వీరితోపాటు ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ సైతం పాల్గొన్నారు. కార్యక్రమానికి ఊపు తెచ్చేందుకు ప్రచారానికి మరింత పాపులారిటీ వచ్చేందుకు స్టాండప్ కమేడియన్ టోనీ హించ్క్లిఫ్తో మాట్లాడించారు. నవ్వించాల్సిన ఆయన పలు వర్గాల ఓటర్లలో ఆగ్రహజ్వాలలు రగిల్చారు. ‘‘సముద్రం మధ్యలో కదిలే చెత్త కుప్ప ఒకటుంది. అదేంటో తెలుసా?. అదే ప్యూర్టోరీకో’’ అని హించ్‌క్లిఫ్ చేసిన వ్యాఖ్యలతో అమెరికాలోని ప్యూర్టోరికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.లక్షలాది మంది ప్యూర్టోరీకన్లకు అమెరికా పౌరసత్వం ఉంది. దశాబ్దాలుగా పోలింగ్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. 2022 గణాంకాల ప్రకారం ప్యూర్టోరికో మూలాలున్న అమెరికా ఓటర్లు ఏకంగా 60 లక్షల మంది ఉన్నారని తెలుస్తోంది. 1898లో స్పానిష్–అమెరికా యుద్ధం తర్వాత స్పెయిన్ వలసరాజ్యమైన ఫ్యూర్టోరీకోను అమెరికా తన వశం చేసుకుంది. 1917లో తొలిసారిగా అక్కడి వారికి అమెరికా పౌరసత్వం ఇచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్యూర్టోరికన్లు అమెరికాకు లక్షలాదిగా వలసవచ్చారు. అమెరికా ఓటర్లలో మెక్సికన్ల తర్వాత హిస్పానియన్ మూలాలున్న ఓటర్లలో రెండో అతిపెద్ద వర్గంగా ప్యూర్టోరికన్లు నిలిచారు. సొంత ద్వీపం కంటే అమెరికా గడ్డపై నివసించే వాళ్లే ఎక్కువ. కీలక రాష్ట్రాల్లో వీరి ప్రభావమెంత?ఏ పార్టీ కీ మద్దతు తెలపని తటస్థ ఓటర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలనే స్వింగ్ స్టేట్స్ అంటారు. మద్దతు పలికే రాష్ట్రాలను ఆయా పార్టీ లు ఎలాగూ గెల్చుకుంటాయి. కానీ స్వింగ్ రాష్ట్రాల ఓటర్లు ఎవరికి ఓటేస్తారో తెలీదుకాబట్టి వీళ్లను ప్రసన్నం చేసుకోవడమే ట్రంప్, హారిస్‌కు ముఖ్యం. పెన్సిల్వేనియా స్వింగ్ రాష్ట్రంలో 3.7 శాతం రాష్ట్రజనాభాకు సమానమైన 4.86 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రాన్ని గెల్చుకోవడం తప్పనిసరి. ఇక్కడ హారిస్‌పై ట్రంప్ కేవలం 0.2 శాతం ఆధిక్యతతో కొనసాగుతున్నారు. తాజా ఉదంతంలో ఈ ఆధిక్యత మటుమాయమై ట్రంప్ వెనుకంజ వేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. జార్జియాలోనూ 1.31 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. ఇక్కడ కూడా హారిస్‌పై ట్రంప్ ఆధిక్యత స్వల్పంగా ఉంది. వీళ్ల కోపంతో ఆ ఆధిక్యత పోవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. నార్త్ కరోలినా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. స్వింగ్యేతర రాష్ట్రాల పరిస్థితి ఏంటి ? ఏదో ఒక పార్టీ కే మద్దతు పలికే రాష్ట్రాల్లోనూ ప్యూర్టోరికన్ల ప్రభావం ఉండొచ్చని తెలుస్తోంది. ఫ్లోరిడా రాష్ట్రంలో వీళ్లు ఏకంగా 12 లక్షల మంది ఉన్నారు. కనెక్టికల్ రాష్ట్ర జనాభాలో 8 శాతానికి సమానంగా 3 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. మసాచుసెట్స్లోనూ 3.26 లక్షల మంది వీళ్లే ఉన్నారు. న్యూయార్క్ రాష్ట్రంలో ఏకంగా పది లక్షల మంది వీళ్లే ఉన్నారు. ఇన్నేసి లక్షల మంది ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేస్తే హారిస్ విజయం నల్లేరుపై నడకేనని కథనాలు వెలువడుతున్నాయి. గతంలో జాత్యహంకార వ్యాఖ్యలుట్రంప్ జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. 2018లో ఎల్‌సాల్విడార్, హైతీ, ఆఫ్రికా ఖండ దేశాలను దారుణంగా కించపరుస్తూ ట్రంప్ మాట్లాడారు. గత వారం సైతం వలసలపై ప్రసంగంలో ‘‘అమెరికా చెత్తకుప్పనా ఏంటి?. వ్యర్థాలు(వలసలు) అన్నీ అమెరికాకే వస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించడం తెల్సిందే. తాను అధికారంలోకి వచ్చాక దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో అనధికార వలసదారుల బహిష్కరణ కార్యక్రమం చేపడతానని ట్రంప్ అన్నారు. దీనికితోడు ఆదివారం హించ్‌క్లిఫ్ చేసిన వ్యాఖ్యలు ప్యూర్టోరీకో మూలాలున్న ప్రముఖుల్లో ఆగ్రహజ్వాలలను ఎగసేలా చేసింది. జెన్నీఫర్ లోపేజ్, రికీ మార్టిన్, బ్యాడ్ బన్నీ ఇలా పలువురు ప్యూర్టోరికో సంగీత దిగ్గజాలూ తమ నిరసన వ్యక్తంచేశారు. ‘‘ ట్రంప్ సంగతి తెల్సిందే. గెలిస్తే తానెంత ప్రమాదకరమో, దేశ ప్రజల మధ్య ఎంతగా విభజన తీసుకురాగలరో మరో సారి నిరూపించుకున్నారు’’ అని కమలా హారిస్ విమర్శించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
30 ఏళ్ల క్రితం అదృశ్యమైన మహిళ బామ్మగా ప్రత్యక్షమై..
ఒక మహిళ 30 ఏళ్ల క్రితం కనిపిచకుండా పోయింది. ఇక కనిపించదు, ఈ మిస్సిగ్ కేసు వీడదు అనుకుని కేసు క్లోజ్ చేసి మరీ.. ఆమె చనిపోయిందని ప్రకటించారు అధికారులు. ఆ తర్వాత అనుహ్యంగా ఝలక్ ఇస్తూ.. ఆ మహిళ బతికి ఉన్నానంటూ ఓ నర్సింగ్ హోంలో ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న పోలీసులు ఆమె గురించి పూర్తి స్థాయిలో విచారించడం ప్రారంభించారు. విచారణలో.. ప్యాటిసియా కోప్టా అనే మహిళ చివరిసారిగా 1992లో పెన్సిల్వేనియాలోని పీటర్స్‌బర్గ్‌లో కనిపిపించింది. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులు సదరు మహిళ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఐతే ఆమె 1999లో ఉత్తర ప్యూర్టోరికో వీధుల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. ఇక ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకి మిస్టరీగా ఉండిపోయింది. కట్ చేస్తే ప్రస్తుతం ఆమె కరేబియన్ ద్వీపంలోని నర్సింగ్ హోంలో నివశిస్తోందని ఒక సామాజిక కార్యకర్త ద్వారా తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోతారు. వాస్తవానికి ఆమె తన ఊరిలో వీధుల్లో పాఠాలు చెప్పే ఒక టీచర్‌గా మంచి పేరుంది. మరి ఆమె ప్యూర్టో రికోకి ఎలా వెళ్లిందో తెలియదు గానీ అక్కడ ఆమె తన గతాన్ని రహస్యంగా ఉంచింది. ఆ తర్వాత ఆమె క్రమంగా డిమోన్షియా అనే మతిస్థిమితంకి సంబంధించిన మానసిక వ్యాధి బారిన పడింది. ఐతే ఆమెకు సడెన్‌గా తన గతం గుర్తుకొచ్చి తన వివరాలను వెల్లడించడం ప్రారంభించింది. ఇంతలో ఆ సామాజికి కార్యకర్త సాయంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు నర్సింగ్హోమ్ని సంప్రదించారు. ఆమెకు డీఎన్ఏ టెస్ట్‌లు నిర్వహించి 30 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన మహిళగా నిర్థారించారు. ఐతే ఆమహిళకు ప్రసత్తు 80 ఏళ్లు. వైద్యులు ఆమె కొన్ని మానసిక రుగ్మతలతో వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆమె ఒకనొక దశలో దేశం విడిచి పారిపోవాలనుకుందని కూడా చెప్పారు. ఐతే సదరు మహిళ తప్పిపోవడానికి ముందు ఆమెకు వివాహమైందని, ఆమె భర్త బాబ్ కోప్టా అని అధికారులు తెలిపారు. పాపాం ఆయన ఆమె కోసం ఎదురు చూస్తూ మరో పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయారు. ఇన్నేళ్ల తర్వాత ఆమె సజీవంగా ఉందని చెప్పడం చాలా రిలీఫ్్గా ఉందని కోప్టా చెబుతున్నారు. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక కవల చెల్లెలు ఉన్నారు. అయితే వారంతా చనిపోగా ప్రస్తుతం ఆమెకు ఇప్పుడూ ఒక చిన్న చెల్లెలు మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. సదరు మహిళ చెల్లెలు మాట్లాడుతూ.. 80 ఏళ్ల వయసులో ఆమె మా వద్దకు చేరుకోవడం చాలా షాకింగ్‌గా, ఆనందంగా ఉందని చెబుతోంది. విచిత్రమేమిటంటే పెళ్లికి ముందుగానీ, ఆతర్వాత గానీ ఎప్పుడూ కూడా ఆమె పూర్టో రికో నగరానికి వెళ్లిందే లేదు. (చదవండి: ఢిల్లీలోని ఆటో రిక్షాలో యూఎస్ సెక్రటరీ) -
షైనింగ్ సైనీ: విధిని ఎదిరించింది అందాల పోటీలో నిలిచింది
ఆమెకు డ్యాన్స్ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి మిస్ వరల్డ్ కిరీటం ధరించాలన్న ఆశ. కానీ గుండె సరిగా కొట్టుకోదు, ఓ యాక్సిడెంట్లో ముఖం మొత్తం కాలిపోయింది. అయినా ఏమాత్రం దిగులు పడలేదు. ఒక్కో సమస్యను అధిగమిస్తూ మిస్ వరల్డ్ రన్నరప్‌గా నిలిచింది శ్రీసైనీ. అమెరికాలోని ప్యూర్టోరికోలో జరిగిన మిస్‌వరల్డ్–2021 కాంపిటీషన్లో పోలాండ్‌కు చెందిన కరోలినా బిల్వస్కా మిస్‌వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. భారత్ తరపున పోటీపడిన మానస వారణాసి టాప్–6లోకి కూడా చేరుకోలేకపోయింది. కానీ భారత సంతతికి చెందిన 26 ఏళ్ల శ్రీసైనీ అమెరికా తరపున మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడి, మొదటి రన్నరప్‌గా నిలవడం విశేషం. పంజాబ్‌కు చెందిన సంజయ్ సైనీ, ఏక్తా సైనీ దంపతులకు 1996 జనవరి 6న లుథియాణలో శ్రీసైనీ పుట్టింది. ఈమెకు షహరోజ్ సైనీ అనే తమ్ముడు ఉన్నాడు. సంజయ్‌కు వాషింగ్టన్లో గ్యాస్ స్టేషన్ ఉండడంతో ఆమె కుటుంబం మొత్తం అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో ఐదేళ్ల వయసులో శ్రీసైనీ భారత్ వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అక్కడే ఇండో అమెరికన్‌గా పెరిగింది. పన్నెండేళ్ల వరకు శ్రీ గుండె స్పందనలు సరిగా లేవు. నిమిషానికి డెభ్బై సార్లు కొట్టుకోవాల్సిన గుండె కేవలం ఇరవై సార్లు మాత్రమే కొట్టుకునేది. శ్రీని పరీక్షించిన డాక్టర్లు ఆమె గుండెలో పూడిక ఏర్పడిందని నిర్ధారించారు. ఇందుకోసం శాశ్వత పేస్‌మేకర్‌ను అమర్చి ఆమె గుండెను సాధారణంగా పనిచేసేలా చేశారు. మూడేళ్ల వయసు నుంచే డ్యాన్స్‌ను ఎంతో ఇష్టంగా చేసే శ్రీకి పేస్‌మేకర్ అమర్చిన తరువాత డ్యాన్స్ చేయకూడదని డాక్టర్లు సూచించారు. అయినా వెనక్కు తగ్గలేదు. తన బలాన్ని మరింత పెంచుకునేందుకు ప్రారంభంలో చిన్నగా డ్యాన్స్ ప్రారంభించి, తరువాత రోజుకి ఆరుగంటలపాటు డ్యాన్స్ చేసేది. ఇలా ఏళ్లపాటు డాన్స్ సాధన చేస్తూ తనలోని ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంది.బ్యాలే, జాజ్ డ్యాన్స్‌లు నేర్చుకుంది.అంతేగాక కాలేజీ హిప్అప్ టీమ్‌తో కలిసి డ్యాన్స్ చేసేది. ముఖం కాలిపోయినా.. చిన్నప్పటి నుంచి మిస్‌వరల్డ్ అవ్వాలనుకునే శ్రీసైనీ, ఆరేళ్లున్నప్పుడే మిస్ వరల్డ్‌గా తయారై బాగా మురిసిపోయేది. అప్పట్లో ఆమెకు మిస్‌వరల్డ్ అంటే సూపర్ హీరోలా కనిపించేది. దీంతో స్కూలు చదువు పూర్తయ్యాక.. వాషింగ్టన్ యూనివర్సిటీలో జర్నలిజం డిగ్రీ చేసింది. తరువాత మోడలింగ్‌లోకి అడుగు పెట్టింది. హార్వర్డ్ యూనివర్సిటీ, యాలే స్కూల్ ఆఫ్ డ్రామా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మోడలింగ్ కోర్సులు చేసింది. యూనివర్సిటీలో చదువుతోన్న రోజుల్లో అప్పుడు శ్రీకి పంతొమ్మిదేళ్లు ఉంటాయి. ఒకరోజు అనుకోకుండా కారు ప్రమాదం జరిగి ముఖం బాగా కాలిపోయింది. తన ముఖం తనే గుర్తుపట్టలేనంతగా మారింది. అయినా ఏమాత్రం దిగులుపడలేదు. ఎలాగైనా అందాల పోటీల్లో పాల్గొనాలన్న సంకల్పంతో ఏడాదిలోపే కోలుకుని, తన ముఖాన్ని పూర్వంలా అందంగా మార్చుకుంది. అనేక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ తొలిసారి 2017లో మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకుంది. మరుసటి ఏడాది మిస్‌వరల్డ్ ఇండియా వరల్డ్‌వైడ్ కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తరువాత 2019లో మిస్ వరల్డ్ అమెరికా కాంపిటీషన్లో పాల్గొన్నప్పటికీ తన హృదయ సంబంధ సమస్యతో మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ట్రీట్మెంట్ తరువాత 2020లో మిస్ వరల్డ్ అమెరికా కాంపిటీషన్లో పాల్గొని టాప్ ఇన్ఫ్లుయెన్సర్ నేషనల్ విన్నర్, ఏ పర్పస్ నేషనల్ అంబాసిడర్, పీపుల్స్ ఛాయిస్ నేషనల్ విన్నర్, టాలెంట్ ఆడియెన్స్ చాయిస్ నేషనల్ అవార్డు, బ్యూటీ విత్ పర్పస్ విన్నర్ అవార్డులను గెలుచుకుంది. 2021లో మిస్‌వరల్డ్ అమెరికా కిరీటాన్ని గెలుచుకుని ఈ కిరీటం గెలుచుకున్న తొలి భారతసంతతి వ్యక్తిగా పేరు పొందింది. ఇటీవల నిర్వహించిన 2021 మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొని టాప్–6 కంటెస్టెంట్స్‌లో ఒకటిగా నిలిచింది. కానీ వెంట్రుకవాసిలో కిరీటం తప్పిపోయి మొదటి రన్నరప్‌గా నిలిచింది. మోటివేషనల్ స్పీకర్‌గానూ.. పన్నెండేళ్ల వయసు నుంచి మానసిక భావోద్వేగాలపై ఆర్టికల్స్ రాసే అలవాటు ఉంది శ్రీకి. తను రాసిన చాలా ఆర్టికల్స్ అమెరికన్ మీడియాలో పబ్లిష్ అయ్యాయి. చిన్నప్పటి నుంచి ఆమె చేస్తోన్న సామాజిక సేవాకార్యక్రమాలను ప్రముఖులు ప్రశంసించేవారు. ఎనిమిది దేశాల్లోని వందకుపైగా నగరాల్లో తను ఎదుర్కొన్న అనేక మానసిక సంఘర్షణలను వివరిస్తూ ఎంతోమంది యువతీ యువకుల్లో స్ఫూర్తిని నింపుతోంది. అందాల రాణిగానేగాక మెంటల్, ఎమోషనల్ హెల్త్ యాక్టివిస్ట్‌గా, మోటివేషనల్ స్పీకర్‌గా పనిచేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది శ్రీసైనీ. -
పన్ను పోటు లేని ప్రదేశం.. క్యూ కడుతున్న కోటీశ్వరులు
ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలు చాలా దేశాల్లో కఠినతరంగా అమలు అవుతున్నాయి. ఒకరకంగా చూసుకుంటే అభివృద్ధి చెందిన దేశాల కంటే.. భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే చట్టపు మినహాయింపులతో కొంచెం ఊరట లభిస్తోంది. ఈ తరుణంలో అమెరికా, ఇతర దేశాల నుంచి పన్ను పోటును తప్పించుకునేందుకు ఓ చిన్న కరేబియన్ ద్వీపానికి క్యూ కడుతున్నారు క్రిప్టో కుబేరులు. ప్యూర్టో రికా.. మూడున్నర వేల చదరపు మైళ్ల విస్తీర్ణం, 32 లక్షలకు పైగా జనాభా ఉన్న చిన్న కరేబియన్ టెర్రిటరీ. కార్యనిర్వాహణ, కరెన్సీ మొత్తం వ్యవహారాలన్నీ అమెరికా దేశ పరిధిలోనే నడుస్తోంది. ఈ దీవిలోని సెయింట్ రెగిస్ బహియా బీచ్ రిసార్ట్ ఇప్పుడు తెర మీద చర్చనీయాంశంగా మారింది. 483 ఎకరాల ప్రకృతి రిజర్వ్‌లో గోల్ఫ్ కోర్స్, సముద్ర ముఖ నివాసాలు ఉంటాయి ఈ రిసార్ట్‌లో. కానీ ఇప్పుడు ఈ ప్రాపర్టీకి హాట్ డిమాండ్ ఏర్పడింది. పన్ను మినహాయింపులతో కూడిన ఆ రిసార్ట్ వెబ్సైట్ చూసి.. అక్కడికి క్యూ కడుతున్నారు క్రిప్టో కోటీశ్వరులు. ఒకరి తర్వాత ఒకరు.. ఐకిగాయ్ అసిస్టెంట్ మేనేజర్ ఆంటోనీ ఎమ్ట్మ్యాన్.. ఈ ఏడాది మార్చ్‌లో లాస్ ఏంజెల్స్‌ను వీడి ఈ దీవిని కొనుగోలు చేసి సెటిల్ అయ్యాడు. క్రిప్టో కమ్యూనిటీ మొత్తం ప్యూర్టో రికా క్యూ కట్టడానికి మూల కారణం ఇతగాడే. ఇక ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు చేసిన మాజీ ఉద్యోగిణి, విజిల్‌బ్లోయర్ ఫ్రాన్సిస్ హ్యూగెన్ కూడా.. ప్యూర్టో రికోలో తన క్రిప్టో స్నేహితులతో కలిసి జీవించనున్నట్లు ఈ మధ్యే ప్రకటించారు. మరోవైపు న్యూయార్క్ మేయర్-ఎలెక్ట్ ఎరిక్ ఆడమ్స్ కిందటి నెలలో క్రిప్టో బిలియనీర్ బ్రాక్ పియర్స్‌తో కలిసి ప్యూర్టో రికా గవర్నర్పెడ్రోతో కలిసి ఏకంగా డిన్నర్ చేశాడు. ఇలా అమెరికా కుబేరులు.. ప్రత్యేకించి డిజిటల్ కరెన్సీతో సంబంధం ఉన్నవాళ్లంతా ఇప్పుడు ఈ దీవి పట్ల ఆసక్తికనబరుస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ నామమాత్రమే! క్రిప్టో కుబేరులంతా ప్యూర్టో రికాకు క్యూ కట్టడానికి కారణం.. ఇక్కడ పన్ను మినహాయింపులు ఉండడం. అవును కొత్తగా వస్తున్న నివాసితులంతా.. తాము సంపాదించే దాని మీద నామమాత్రపు పన్ను ఇక్కడ చెల్లించాల్సి ఉంటుంది. పైగా క్రిప్టో కరెన్సీ విషయంలో ఆ మినహాయింపు ఇంకా ఎక్కువే ఉంది. అదెందుకో చెప్పే ముందు.. అసలు వాళ్లు అమెరికాను ఎందుకు వీడుతున్నారో చూద్దాం.. అమెరికా ఫెడరల్ చట్టాల ప్రకారం.. అమెరికాలో ఇన్వెస్టర్లు 37 శాతం తక్కువ రాబడి వచ్చినా సరే 20 శాతం దాకా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. దీనికితోడు కుబేరుల నుంచి మరింత పన్నులు వసూలు చేయాలంటూ బైడెన్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు డెమొక్రట్లు. ఈ ప్రయత్నాలతో పాటు కొత్తగా రాబోతున్న చట్టాలతో మిలీయనీర్లకు, బిలీయనీర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. ఈ క్రమంలోనే తమకు ‘మినిమమ్’ ట్యాక్స్ వెసులుబాటు అందిస్తున్న కరేబియన్ ద్వీపం ప్యూర్టో రికాకు తరలిపోతున్నారు. లోకల్ కంటే నాన్-లోకల్‌కే.. ప్యూర్టో రికా చట్టాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఇక్కడి శాశ్వత నివాసితులు ఫెడరల్ ట్యాక్సులు కట్టాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల మీద వాళ్లకొచ్చే ఆదాయం ఆధారంగా చెల్లించాల్సి ఉంటుంది. నాన్ రెసిడెంట్స్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. అదే అమెరికా, ఇతర దేశాల నుంచి వచ్చే ‘బోనా ఫైడ్ రెసిడెన్స్’ నామినల్ ట్యాక్సుల కింద 4 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్యూర్టో రికా ట్యాక్స్ చట్టం.. స్థానికుల కంటే పొరుగు వాళ్లకే ఎక్కువ లాభం చేకూరుస్తోందన్నమాట. అందుకే ఇప్పుడు ప్రతీ కుబేరుడి చూపు అటువైపు ఉంటోంది. ఇది తట్టుకోలేకే ప్యూర్టో రికా ప్రజలు.. యూఎస్ఏలో 51వ దేశంగా ప్యూర్టో రికాను గుర్తించాలని పోరాటాలు చేస్తున్నారు. తద్వారా తమకు దక్కని మినహాయింపులు.. ఇతరులకు దక్కడంపై వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్నారు. మినహాయింపు కారణం.. కరెన్సీ కొరత, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు 2012 లో ప్యూర్టో రికన్ ప్రభుత్వం ట్యాక్స్ చట్టానికి సవరణ చేసి.. మినహాయింపులు ఇచ్చింది. ఈ కారణంతోనే రియల్ ఎస్టేట్ ధరలు ఈ నేలపై ఎప్పుడో ఆకాశాన్ని అంటాయి. నిజానికి 2017లోనే క్రిప్టో కరెన్సీ రన్ కొనసాగుతున్నప్పుడు.. ఎంతో మంది ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ, ఆ టైంలో ఆ ఐడియా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ ఏడాది క్రిప్టో బూమ్ కొనసాగుతుండడంతో ఏకంగా 1,200 అప్లికేషన్లు ‘ఇన్వెస్టర్స్ యాక్ట్’ ప్రకారం దాఖలు అయ్యాయట. దీంతో క్యాపిటల్ గెయిన్(సంపాదన) మీద పైసా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక అమెరికా నుంచి వస్తున్న ఈ అప్లికేషన్ల సంఖ్య గతంలో పోలిస్తే మూడు రెట్లు పెరిగిందని రిపోర్టులు చెప్తున్నాయి. ఇదే తొలి కాదు.. చివరా కాదు క్రిప్టో మార్కెట్స్ పెరుగుదల, రిమోట్ వర్క్ కారణంగా చాలా మంది ప్యూర్టో రికాలో సెటిల్ అయ్యేందుకు, బిజినెస్ లావాదేవీల కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం రిసార్ట్ కమ్యూనిటీలో రియల్ ఎస్టేట్ బూమ్ నడుస్తోంది. పంటేరా క్యాపిటల్, రెడ్‌వుడ్ సిటీ వెంచర్స్.. కార్యాలయాలు నెలకొల్పి జోరుగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ప్యూర్టో రికా రాజధాని శాన్ జువాన్‌కి 26 మైళ్ల దూరంలోని బహియా, డోరాడో బీచ్ రీసార్ట్, కొండాడో (శాన్ జువాన్లోని సిటీ).. డిమాండ్ ఊపందుకుంటోంది. మినీ మియామీగా కొండాడోను అభివర్ణిస్తున్నారు. ట్యాక్స్ బచాయించడానికి ఇక్కడికి చేరుకుంటున్న క్రిప్టో కుబేరులు.. డిసెంబర్ 6న ఏకంగా బ్లాక్‌చెయిన్ వీక్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఒకరకంగా ‘బ్లాక్‌చెయిన్ క్యాపిటల్’గా గుర్తింపు దక్కిందని చెప్తున్నారు బిట్యాంగిల్స్ ఫౌండర్ మైకేల్ టర్పిన్. అయితే ఇలా డిజిటల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న ప్రాంతంగా ప్యూర్టో రికా మొదటిదేం కాదు. చివరిది కూడా కాదు. చిన్న దేశం ఎల్ సాల్వడర్ ఇందులో(బిట్ కాయిన్‌కి అధికారికత కట్టబెట్టడం..తయారీ) ఎప్పటి నుంచో ముందంజలో ఉంది. ఇక పోర్చుగల్ కూడా క్రిప్టోకరెన్సీ క్రయవిక్రయాల మీద ట్యాక్స్‌లు విధించకుండా(ప్రధాన ఆదాయ వనరు కానంత వరకే).. డిజిటల్ మార్కెట్‌ను ఆకట్టుకుంటోంది. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
ప్రాణం తీసిన పంచ్
మాస్కో: రింగ్‌లో ప్రత్యర్థి పిడిగుద్దులు ఓ యువ బాక్సర్ ఉసురు తీశాయి. ప్రొఫెషనల్ ఆటలో భౌతిక దాడి స్థాయిలో విసిరిన పంచ్‌లు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఈ విషాద ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాలు... మేరీలాండ్ పరిధి అక్సన్ హిల్‌లో గత శుక్రవారం రాత్రి మాక్సిమ్ డడ్‌షెవ్ (రష్యా), సుబ్రియెల్ మటియాస్ (ప్యూర్టోరికో) మధ్య ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (ఐబీఎఫ్) సూపర్ లైట్ వెయిట్ విభాగంలో బౌట్ జరిగింది. ఇందులో మటియాస్ వరుసగా విసిరిన పంచ్‌ల ధాటికి 28 ఏళ్ల డడ్‌షెవ్ దిమ్మతిరిగింది. డ్రెస్సింగ్ రూమ్ వరకు సైతం నడవలేని పరిస్థితుల్లో ఉన్న అతడిని హుటాహుటిన వాషింగ్టన్‌లోని ఆస్పత్రిలో చేర్చారు. మెదడులో అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం కావడంతో చిక్సిత పొందుతూ మంగళవారం మృతి చెందాడు. డడ్‌షెవ్ తాను తలపడిన గత 13 బౌట్లలో అజేయంగా నిలిచాడు. శుక్రవారం నాటి పోరులో మాత్రం మటియాస్ ముందు నిలవలేకపోయాడు. ఆరంభం నుంచే దూకుడు చూపిన మటియాస్... ప్రత్యర్థి తప్పించుకోలేనంతగా బలమైన పంచ్‌లు విసిరాడు. వీటికి డడ్‌షెవ్ తాళలేకపోయాడు. 11వ రౌండ్ తర్వాత కుప్పకూలిన అతడు గ్లోవ్స్ చాటున తలదాచుకుంటూ ‘ఇక ఆపదల్చుకున్నాను’ అని సంకేతాలిచ్చాడు. కానీ, అప్పటికే నష్టం జరిగిపోయింది. ఆస్పత్రిలో అత్యవసర వార్డులో చేర్చి చికిత్స చేసినా ప్రాణం దక్కలేదు. దీనిపై కార్నర్మన్ మెక్గ్రిట్ మాట్లాడుతూ... బౌట్‌ను ఆపేలా డడ్షెవ్ను ఒప్పించలేకపోయానని అంటున్నాడు. మరోవైపు రష్యా బాక్సింగ్ సమాఖ్య ఈ బౌట్‌పై విచారణ జరుపుతోంది. ఈ బౌట్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఉమర్ క్రెమ్లెవ్ ఆరోపించాడు. డడ్షెవ్కు భార్య, కుమారుడు ఉన్నారు. అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని ఉమర్ ప్రకటించారు. -
షిప్ 11వ అంతస్తునుంచి పడిపోయిన పాప..!
ప్యూర్టో రికో : హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేద్దామనుకున్న ఓ కుటుంబంలో విషాదం నిండింది. షిప్లో ప్రయాణం చేస్తుండగా.. అనూహ్యంగా ఏడాది వయసున్నవారి గారాలపట్టి ప్రాణాలు కోల్పోయింది. వివరాలు.. వారంరోజుల పర్యటనలో భాగంగా అలన్ వేగండ్ తన కుటుంబంతో కలిసి సముద్రయానం చేద్దామనుకున్నాడు. ఆ క్రమంలో కుటుంబ సభ్యులందరూ ‘ఫ్రీడమ్ ఆఫ్ సీస్’ ఓడలో గత ఆదివారం ప్యూర్టో రికోలోని పాన్అమెరికా నౌకశ్రయం మీదుగా ప్రయాణిస్తున్నారు. భోజనం చేసేందుకు ఓడ 11వ అంతస్తుకు చేరుకున్నారు. లంచ్ చేసేందుకు అందరూ సిద్దమయ్యారు. ఆ సమయంలో వేగండ్ ఏడాది కూతురు అతని తండ్రి సాల్వటోర్ అనెల్లో చేతుల్లో ఉంది. అతను కిటీకీ పక్కనే కూర్చుని ఉన్నాడు. అయితే, అలల ఉధృతికి ఓడ కొద్దిగా కుదుపులకు లోనైంది. అందరూ చూస్తుండానే అనెల్లో చేతుల్లోంచి చిన్నారి కిటికీలోంచి బయటపడి ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
మరియా.. ఇక మహా ప్రళయమేనా?
సాక్షి, ఫ్యూర్టో రికో: సరిగ్గా రెండు వారాల క్రితం ఇర్మా హరికేన్ భీభత్సం కరేబియన్ దీవులను కకావికలం చేసేసి అక్కడి నుంచి అమెరికాపై తన ప్రతాపాన్ని చూపించేసింది. విలయతాండవ ఉధృతి త్వరగానే తగ్గినప్పటికీ.. నష్టం నుంచి బయటపడేందుకు మరికొన్ని రోజలు సమయం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో పెను తుఫాన్ విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరియా తుఫాన్ ఈ ఉదయం తీరం దాటినట్లు అధికారులు ప్రకటించారు. గంటకు 165 మైళ్ల (215 కిలోమీటర్ల) వేగంతో కూడిన గాలులు వీయటం ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో కేటగరీ 5 కింద తీర ప్రాంతంలో హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ ఆగ్నేయ సఫిర్ సింప్సన్ ప్రాంతం నుంచి మొదలైన ఈ తుఫాన్ బుధవారం ఉదయంలోగా ఫ్యూర్టో రికో తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలుస్తోంది. డొమినికాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అక్కడ ఉన్న 72,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. నార్త్ కరోలినాకు నుంచి లీవార్డ్ మార్టినిక్, పోర్టారికో, యూఎస్, బ్రిటీష్ వర్జీన్ ఐల్యాండ్స్ పై మరియా ప్రభావం చూపనుంది. గత 85 ఏళ్లలో అతి శక్తివంతమైన తుఫాన్ ఫ్యూర్టో రికోను తాకబోతున్నట్లు వారంటున్నారు. మరోవైపు హరికేన్ జోస్ కూడా ప్రచండ గాలులతో అమెరికాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, మరియా అట్లాంటిక్ సముద్రానికి నాలుగో అతి భయంకరమైన హరికేన్‌గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ యేడాది 13 తుఫాన్లు అట్లాంటిక్ నుంచి ప్రారంభమై వివిధ దేశాలపై తమ ప్రభావం చూపాయి. -
భారత్ ఘనవిజయం
4-1తో ప్యూర్టోరికో చిత్తు ముంబై: ‘ఫిఫా’ ర్యాంకింగ్‌సలో తమకన్నా ఎంతో మెరుగైన ప్యూర్టోరికోపై భారత ఫుట్‌బాల్ జట్టు అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకుంది. అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపుతూ శనివారం స్థానిక అంధేరి స్పోర్ట్స కాంప్లెక్స్‌లో జరిగిన ఈ స్నేహపూర్వక మ్యాచ్‌లో భారత్ 4-1తో నెగ్గింది. చివరి 11 మ్యాచ్‌ల్లో భారత్‌కు ఇది తొమ్మిదో విజయం కావడం విశేషం. నారాయణ్ దాస్ (18వ ని.లో), సునీల్ చెత్రి (26వ ని.లో), జేజే లాల్పేఖులా (34వ ని.లో), జాకీచంద్ సింగ్ (58వ ని.లో) ఆతిథ్య జట్టు తరఫున గోల్స్ చేయగా... ప్రత్యర్థి జట్టుకు ఎమ్మాన్యుయల్ సాంచెజ్ (8వ ని.లో) ఏకై క గోల్ చేశాడు. ఆరు దశాబ్దాల అనంతరం ముంబైలో జరిగిన ఈ అంతర్జాతీయ మ్యాచ్‌లో... ప్రారంభంలోనే గోల్ సమర్పించుకున్నా భారత్ ఏ దశలోనూ ఒత్తిడికి లోను కాలేదు. 15వ నిమిషంలో జట్టు నుంచి గోల్ వైపు తొలి షాట్ వెళ్లింది. ఆ తర్వాత మూడు నిమిషాలకే భారత్ ఖాతా తెరిచింది. సునీల్ చెత్రి ఫ్రీ కిక్ గోల్ పోస్టును తాకి బయటికి రాగా నారాయణ్ దాస్ తిరిగి గోల్‌గా మలిచాడు. ఇక అక్కడి నుంచి భారత్ దూకుడు కొనసాగి ప్రథమార్ధంలోనే మరో రెండు గోల్స్ చేసింది. చెత్రి, జేజే చెరో గోల్ చేశారు. ద్వితీయార్ధంలోనూ భారత్ ఆటతీరులో జోరు తగ్గలేదు. 58వ నిమిషంలో జాకీచంద్ సింగ్ జట్టుకు నాలుగో గోల్ అందించడంతో భారత్ తిరుగులేని విజయాన్ని సాధించింది. -
ప్యూర్టో రికోలో ఇన్ఫోసిస్ బ్యాక్ ఆఫీస్
బెంగళూరు: బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (బీపీఓ) ద్వారా అంతర్జాతీయ కస్టమర్లకు సేవలందించటానికి సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ యూఎస్‌లోని ప్యూర్టోరికోలో బ్యాక్ ఆఫీస్‌ను ఏర్పాటు చేయనుంది. తొలిగా అక్కడి నుంచి విమానయాన రంగ కస్టమర్లకు సేవలందించనున్నామని , తర్వాత హెల్త్‌కేర్ తదితర రంగాలకు సేవలను విస్తరిస్తామని కంపెనీ వెల్లడించింది. ప్యూర్టోరికో ప్రభుత్వం, ప్యూర్టోరికో ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ కంపెనీ (ప్రిడ్కో)ల సహకారం వల్లే ఈ బ్యాక్ ఆఫీస్‌ను ఏర్పాటు చేస్తున్నామని, స్థానికులకే ఉద్యోగాలిచ్చినట్లు తెలిపింది. హెల్త్‌కేర్‌తోపాటు తదితర రంగాలలోని తమ కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందించటానికే ఈ బ్యాక్ ఆఫీస్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ బీపీఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనూప్ ఉప్పధయాయ్ తెలిపారు.