ప్యూర్టో రికోలో ఇన్ఫోసిస్ బ్యాక్ ఆఫీస్ | infosys back office at puerto rico | Sakshi
Sakshi News home page

ప్యూర్టో రికోలో ఇన్ఫోసిస్ బ్యాక్ ఆఫీస్

Published Wed, Mar 11 2015 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM

ప్యూర్టో రికోలో ఇన్ఫోసిస్ బ్యాక్ ఆఫీస్

ప్యూర్టో రికోలో ఇన్ఫోసిస్ బ్యాక్ ఆఫీస్

బెంగళూరు: బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ (బీపీఓ) ద్వారా అంతర్జాతీయ కస్టమర్లకు సేవలందించటానికి సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ యూఎస్‌లోని ప్యూర్టోరికోలో బ్యాక్ ఆఫీస్‌ను ఏర్పాటు చేయనుంది. తొలిగా అక్కడి నుంచి విమానయాన రంగ కస్టమర్లకు సేవలందించనున్నామని , తర్వాత హెల్త్‌కేర్ తదితర రంగాలకు సేవలను విస్తరిస్తామని కంపెనీ వెల్లడించింది.

ప్యూర్టోరికో ప్రభుత్వం, ప్యూర్టోరికో ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ కంపెనీ (ప్రిడ్కో)ల సహకారం వల్లే ఈ బ్యాక్ ఆఫీస్‌ను ఏర్పాటు చేస్తున్నామని, స్థానికులకే ఉద్యోగాలిచ్చినట్లు తెలిపింది.   హెల్త్‌కేర్‌తోపాటు తదితర రంగాలలోని తమ కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందించటానికే ఈ బ్యాక్ ఆఫీస్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ బీపీఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనూప్ ఉప్పధయాయ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement