షిప్‌ 11వ అంతస్తునుంచి పడిపోయిన పాప..! | Toddler Held Out From 11th Floor Of Cruise Ship In Puerto Rico | Sakshi
Sakshi News home page

షిప్‌ 11వ అంతస్తునుంచి పడిపోయిన పాప..!

Published Tue, Jul 9 2019 9:29 PM | Last Updated on Tue, Jul 9 2019 9:29 PM

Toddler Held Out From 11th Floor Of Cruise Ship In Puerto Rico - Sakshi

ప్యూర్టో రికో : హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్‌ చేద్దామనుకున్న ఓ కుటుంబంలో విషాదం నిండింది. షిప్‌లో ప్రయాణం చేస్తుండగా.. అనూహ్యంగా ఏడాది వయసున్నవారి గారాలపట్టి ప్రాణాలు కోల్పోయింది. వివరాలు.. వారంరోజుల పర్యటనలో భాగంగా అలన్‌ వేగండ్‌ తన కుటుంబంతో కలిసి సముద్రయానం చేద్దామనుకున్నాడు. ఆ క్రమంలో కుటుంబ సభ్యులందరూ ‘ఫ్రీడమ్‌ ఆఫ్‌ సీస్‌’ ఓడలో గత ఆదివారం ప్యూర్టో రికోలోని పాన్‌అమెరికా నౌకశ్రయం మీదుగా ప్రయాణిస్తున్నారు. భోజనం చేసేందుకు ఓడ 11వ అంతస్తుకు చేరుకున్నారు. లంచ్‌ చేసేందుకు అందరూ సిద్దమయ్యారు. ఆ సమయంలో వేగండ్‌ ఏడాది కూతురు అతని తండ్రి సాల్వటోర్‌ అనెల్లో చేతుల్లో ఉంది. అతను కిటీకీ పక్కనే కూర్చుని ఉన్నాడు. అయితే, అలల ఉధృతికి ఓడ కొద్దిగా కుదుపులకు లోనైంది. అందరూ చూస్తుండానే అనెల్లో చేతుల్లోంచి చిన్నారి కిటికీలోంచి బయటపడి ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement