Imagery
-
అతడు ఊహాచిత్రాలు గీయడంలో దిట్ట
సాక్షి, సిటీబ్యూరో:నగరంలో జరిగిన జంట పేలుళ్ల కేసు దర్యాప్తు ఊహాచిత్రాలతో మొదలైంది. లుంబినీపార్క్‌లో బాంబు పెట్టిన వ్యక్తి (ఆ తర్వాత ఇతడు అనీఖ్ అని తేలింది) ముఖ కవళికల్ని అక్కడున్న నాసిక్‌కు చెందిన ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు చెప్పారు. వీటి ఆధారంగా స్కెచ్ రూపొందించడానికి ఎవరిని సంప్రదించాలా? అని నగర పోలీసులు ఆలోచిస్తున్న తరుణంలో వీరికి స్ఫురించిన పేరు నరేష్ కోడె. దేశవ్యాప్తంగా ఉగ్రవాద సంబంధ కేసులు దర్యాప్తు చేసే అన్ని విభాగాలు, అధికారులకు ఈ పేరు సుపరిచితమే. ముంబైకి చెందిన నరేష్ 14ఏళ్ల వయసులో ఈ వృత్తిని స్వీకరించి.. ఇప్పటి వరకు 12వేల మంది అనుమానితులకు సంబంధించిన ఊహా చిత్రాలు రూపొందించాడు. వీటిలో అత్యధికం నిందితులను పోలి ఉండగా... సిటీతో సహా మరికొన్ని చోట్ల మాత్రం పోలికలు సరిపోలేదు. 90శాతం సక్సెస్... 2007 ఆగస్టు 25న రాజధానిలో జంట పేలుళ్లు చోటుచేసుకున్న తర్వాత ప్రాథమికంగా దర్యాప్తు చేసిన నగర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) కోడెను సంప్రదించింది. హుటాహుటిన ముంబై నుంచి మరుసటి రోజే నగరానికి వచ్చిన నరేష్ లుంబినీపార్క్‌లో క్షతగాత్రులైన బాధితులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా ఊహా చిత్రాన్ని రూపొందించి అందించాడు. దీని ఆధారంగానే నగర పోలీసులు నిందితులను పట్టించిన వారికి అప్పట్లో రివార్డు ప్రకటించారు. 2009లో ముంబైలోని కుర్లా ప్రాంతంలో చోటుచేసుకున్న తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి ఊహాచిత్రం రూపొందించి నిందితుడిని పట్టుకోవడానికి మహారాష్ట్ర పోలీసులకు ఎంతో సహకరించాడు. ముంబైలో జరిగిన 7/11 బ్లాస్ట్, పుణెలోని జర్మన్ బేకరీ పేలుడు, ఘట్కోపర్ బ్లాస్ట్, అయోధ్య, వారణాసి పేలుళ్లతో సహా అనేక కీలక ఉగ్రవాద సంబంధ కేసుల్లో ఊహాచిత్రాలు గీసి అందించాడు. 90 శాతం కేసుల్లో ఈయన గీసిన చిత్రాలు నిందితులను పోలి ఉంటాయి. అయితే లుంబినీపార్క్ విషయంలో మాత్రం అలా కాలేదు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అనీఖ్ షఫీద్ సయ్యద్‌కు... కోడె గీసిన ఊహా చిత్రానికీ పొంతనే లేదని అతడు అరెస్టు అయిన తర్వాత వెలుగులోకి వచ్చింది. -
‘నకిలీ’ వెనుక అసలు ఎవరు?
నకిలీ పోలీసుల ముసుగులో ఉన్న అసలు వ్యక్తుల కోసం సీసీఎస్ పోలీసులు వేట ప్రారంభించారు. పెదపులిపాక ఘటన నేపథ్యంలో బాధితురాలు చెప్పిన ఆనవాళ్ల మేరకు పోలీసులు నిందితుల ఊహాచిత్రాలు విడుదల చేశారు. విజయవాడ : నగరంలో మళ్లీ నకిలీ పోలీసుల హడావిడి మొదలైంది. నకిలీ పోలీసుల ముసుగులో ఉన్న అసలు వ్యక్తుల కోసం సీసీఎస్ పోలీసులు వేట ప్రారంభించారు. మూడేళ్ల క్రితం నకిలీ పోలీసులు రకరకాల దొంగతనాలు, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. కొద్ది రోజుల క్రితం నగరంలో నకిలీ పోలీసులు భవానీపురం ఏరియాలో తాము ఎస్‌ఐలమని బెదిరించి పట్టుపడ్డారు. వీరిద్దరూ స్థానికంగా ఉండే యువకులు. తాజాగా పెనమలూరు పోలీస్ స్టేషన్ ఏరియాలో పెదపులిపాకలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న ముసునూరు సుజాతమ్మ (70) అనే వృద్ధురాలిని పోలీసులమని బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం ఇద్దరు అగంతకులు ఖాకీ యూనిఫాంతో ఆమె ఇంట్లో ప్రవేశించి సేవ పేరుతో ఆమెను పొగుడుతూ మాటల్లో పెట్టి దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాధితురాలు ఇచ్చిన ఆనవాళ్ల ప్రకారం ఇద్దరి నిందితులలో ఒకరి ఊహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. ఈ ఊహాచిత్రంతో పోలీసులు పాత రికార్డులు తిరగేస్తున్నారు. ఇద్దరు పాత నేరస్తులు జైలు నుంచి విడుదలై ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన కొందరు పాత నేరస్తులు ఈ తరహా నేరాలకు పాల్పడుతుంటారని వారు అనుమానిస్తున్నారు. కాగా ఊహాచిత్రంతో పోలి ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే, వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పోలీస్ కంట్రోల్ రూం డయల్ – 100, పెనమలూరు ఇన్స్పెక్టర్ 9490619468, సెంట్రల్ జోన్ ఏసీపీ 9440627035కు సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు కోరారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనర్ డి. గౌతం సవాంగ్ హెచ్చరించారు. తమ ప్రాంతాల్లో అనుమానితులు, అపరిచితుల సంచారం గమనించిన వెంటనే పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. -
ఊహాచిత్రాలు రెడీ
సాక్షి, బెంగళూరు: నగరంలోని చర్చ్‌స్ట్రీట్‌లో ఆదివారం రాత్రి జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి విచారణ ప్రాధమిక స్థాయిలో ఉందని నగర పోలీస్ కమీషనర్ ఎంఎన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...బాంబు పేలుడు ఘటనకు సంబంధించి విచారణ ప్రాథమిక స్థాయిలో ఉన్నందున ఇప్పుడే ఏ వివరాలు వెల్లడించలేమని తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది ఏ ఉగ్రవాద సంస్థ అనే విషయంపై కూడా ఇప్పటికీ ఓ స్పష్టమైన నిర్థారణకు రాలేదని తెలిపారు. ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లోనూ వేగవంతంగా విచారణ కొనసాగుతోందని, ఇప్పటికే వివిధ విచారృ బందాలను ఇతర రాష్ట్రాలకు పంపామని చెప్పారు. అయితే ఏయే రాష్ట్రాలకు విచారృ బందాలను పంపామనే విషయాన్ని ఇప్పుడు చెప్పలేనని అన్నారు. చర్చ్‌స్ట్రీట్‌లో జరిగిన బాంబు పేలుడు సందర్భంలో అక్కడి సీసీటీవీ కెమెరాల్లో లభించినృదశ్యాలు, కొంత మంది వ్యక్తులు చెప్పిన పోలికల ఆధారంగా అనుమానిత నిందితుల రేఖాచిత్రాలు రూపొందించామని, అయితే వీరు కేవలం అనుమానిత వ్యక్తులే కావడం వల్ల వాటిని మీడియాకు విడుదల చేయలేమని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికి ఎవరినీ అరెస్ట్ చేయలేదని, కేవలం కొంతమందిని విచారణ మాత్రమే జరిపి తిరిగి పంపించేశామని తెలిపారు. మారు పేరుతో ట్వీట్ పంపాడు నగరంలోని చర్చ్‌స్ట్రీట్‌లో ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లకు తానే కారణమంటూ అబ్దుల్ పేరుతో ట్వీట్ పంపిన 17ఏళ్ల మైనర్‌ను తాము అదుపులోకి తీసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి వెల్లడించారు. అతను నగరానికి చెందిన వ్యక్తేనని, నగరంలోనే విద్యాభ్యాసం చేస్తున్నాడని తెలిపారు. మైనర్ కావడం వల్ల ఇంతకు మించి వివరాలను వెల్లడించలేమని తెలిపారు. కాగా ట్వీట్ పంపిన నిందితుడు ప్ర స్తుతం విచారృ బందం అదుపులోనే ఉన్నాడని, అతని వేరే మతానికి చెందిన మారుపేరు పెట్టుకొని ట్వీట్ పంపినట్లు తమ విచారణలో వెల్లడైందని కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి పేర్కొన్నారు. విచారణలో భాగంగా అత ని తల్లిదండ్రులను సైతం విచారించామని తెలిపారు. చర్చ్‌స్ట్రీట్‌లో సంచారం యధాతథం ఆదివారం చర్చ్‌స్ట్రీట్‌లో బాంబు పేలుడు ఘటనతో రెండు రోజులుగా జన సంచారం లేక వెలవెలపోయిన చర్చ్‌స్ట్రీట్‌లో తిరిగి మంగళవారం జనసంచారం ప్రా రంభమైంది. ఘటనా స్థలంలో సాక్షాధారాల సేకరణకు గాను ఘటన జరిగినప్పటి నుంచి మంగళవారం ఉదయం వరకు ఆ ప్రాంతంలో జనసంచారాన్ని పోలీ సు అధికారులు నిషేధించారు. కాగా మంగళవారానికి సాక్ష్యాల సేకరణ పూర్తి కావడంతో తిరిగి ఈ ప్రాం తంలో జనసంచారాన్ని పోలీసులు అనుమతించారు. రెస్టారెంట్లో ‘ఎన్ఐఏ’ అధికారులు ఇక బాంబు పేలుడు జరిగిన కోకోనట్ గ్రోవ్ రెస్టారెంట్‌కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ*(ఎన్ఐఏ) అధికారులు మంగళవారం చేరుకున్నారు. ఎన్ఐఏ స్పెషల్ డీజీపీ నవనీత్ వాసన్ నేృతత్వంలోని అధికారృల బందం కోకోనట్ గ్రోవ్ రెస్టారెంట్‌కు చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. -
భూమిపై నీరు.. సూర్యుడికన్నా పురాతనం!
భగీరథుడి తపస్సు ఫలించి... గంగాదేవి దివి నుంచి భువికి దిగివస్తుండగా.. ఫొటో తీసినట్లు ఉంది కదూ ఈ చిత్రం! అయితే.. ఇది గంగా ప్రవాహమే అయినా.. కైలాస గంగ కాదు. నక్షత్రాలు, గ్రహాలను ఏర్పరిచే నక్షత్రధూళి మేఘాల నుంచి అంతరిక్షంలోని సౌరవ్యవస్థలకు నీరు చేరుతున్నట్లు రూపొందించిన ఊహాచిత్రం. ప్రస్తుతం భూమిపై సముద్రాల్లో ఉన్న నీరు సూర్యుడి కన్నా అతి పురాతనమైనదట. మంచు తోకచుక్కలు, ఉల్కల్లో ఉన్న నీటి అణువులను, సముద్రాల్లోని నీటి అణువులను పోల్చిచూడగా.. ఈ సంగతి వెల్లడైందని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ శాస్త్రవేత్త టిమ్ హ్యారిస్ వెల్లడించారు. సూర్యుడి వయసు 460 కోట్ల ఏళ్లు, భూమి వయసు 454 కోట్ల ఏళ్లు అని అంచనా. అయితే సముద్రాల్లోని నీటిలో, తోకచుక్కల్లో ఉన్న భార హైడ్రోజన్ అణువులు సూర్యుడు, భూమి కన్నా ఎంతో పురాతనమైనవని, నక్షత్రధూళి మేఘాల నుంచి రోదసిలో తోకచుక్కల ద్వారా ప్రయాణిస్తూ.. కాలక్రమంలో అవి భూమిని చేరాయని హ్యారిస్ చెబుతున్నారు.