బుల్లెట్ గాయాలతో పోలీసుస్టేషన్‌కు యాదగిరి! | yadagiri went to police station with bullet injuries, says police commissioner | Sakshi
Sakshi News home page

బుల్లెట్ గాయాలతో పోలీసుస్టేషన్‌కు యాదగిరి!

Published Sat, Aug 13 2016 2:01 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

బుల్లెట్ గాయాలతో పోలీసుస్టేషన్‌కు యాదగిరి! - Sakshi

బుల్లెట్ గాయాలతో పోలీసుస్టేషన్‌కు యాదగిరి!

ఓల్డ్ బోయిన్ పల్లి సమీపంలో శనివారం ఉదయం జరిగిన కాల్పులకు భూ వివాదాలే కారణమని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిందని, ఈ పెనుగులాటలోనే కాల్పులు జరిగాయని ఆయన వివరించారు. కాల్పులు జరిగిన తర్వాత బుల్లెట్ గాయాలతోనే యాదగిరి పోలీసు స్టేషన్‌కు వచ్చారని చెప్పారు. అయితే ఈ ఘటనలో ఉపయోగించిన తుపాకి ఎవరిదనే విషయమై ఇంకా స్పష్టత లేదన్నారు.

సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని సీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం యాదగిరి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని, ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. అల్వాల్‌లో ఓ భూ వివాదానికి సంబంధించి యాదగిరికి, మరో వ్యక్తికి మధ్య గొడవలు ఉన్నాయని, వాటి నేపథ్యంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement