9 లోపు సమాధానం ఇవ్వండి | Big blow to Rajinikanth, film distributors ask for returns after Lingaa's failure | Sakshi
Sakshi News home page

9 లోపు సమాధానం ఇవ్వండి

Published Thu, Jan 8 2015 3:11 AM | Last Updated on Tue, Aug 21 2018 7:58 PM

9 లోపు సమాధానం ఇవ్వండి - Sakshi

9 లోపు సమాధానం ఇవ్వండి

 లింగా చిత్రం వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల నిరాహార దీక్షకు అనుమతి విషయమై 9వ తేదీ 11 గంటల్లోపు పోలీసు కమిషనర్ సమాధానం ఇవ్వాలని చెన్నై ప్రధాన న్యాయస్థానం ఆదేశించింది. వివరాల్లో కెళితే... లింగా చిత్రానికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఈనెల 10న నగరంలో నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుమతి కోరుతూ చెన్నైకి చెందిన మెరీనా ఫిలింస్ సంస్థ నిర్వాహకుల్లో ఒకరైన ఆర్.సింగార వడివేలన్ చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించగా పోలీసులు దీన్ని స్వీకరించడానికి నిరాకరించారంటూ ఆయన చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
 ఈ పిటిషన్ మంగళవారం విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానం బుధవారం తగిన బదులివ్వాలని పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున న్యాయవాది జయప్రకాష్ నారాయణన్ హాజరైన ఈ కేసులో తగిన నిర్ణయం తీసుకోవడానికి పోలీసు కమిషనర్‌కు మరింత కాల వ్యవధి కావాలంటూ కోరారు. దీంతో న్యాయమూర్తి ఈ నెల 9వ తేదీ 11 గంటల్లోపు పిటీషన్‌దారుడి పిటిషన్‌ను సమగ్రంగా పరిశీలించి కోర్టుకు సరైన సమాధానం చె ప్పాలని ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement