Lingua movie
-
రజనీ ఇమేజ్‌కు భంగం
ప్రఖ్యాత నటుడు రజనీకాంత్ ఇమేజ్‌కు భంగం కలిగించారని, లింగా చిత్రాన్ని నష్టపరిచారని ఆ చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ డిస్ట్రిబ్యూటర్లపై ఆరోపణలు గుప్పించారు. వివరాల్లో కెళితే లింగా చిత్రం తీవ్ర నష్టాన్ని కలిగించిందని ఆ చిత్ర హీరో రజనీకాంత్ జోక్యం చేసుకుని పరిహారం ఇప్పించాలని ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు కొందరు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. దానికి పరాకాష్టగా శనివారం చెన్నైలో ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టి కలకలం సృష్టించారు. దీనికి స్పం దించిన ఆ చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ శనివారం సాయంత్రం చెన్నైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను నిర్మించిన లింగా చిత్రం విడుదల హక్కులను ఇరాస ఎంటర్ టైన్మెంట్ సంస్థకు విక్రయించానని వారి నుంచి ఆ హక్కులను వేందర్‌మూవీస్ పొందిందని వివరించారు. ఆ సంస్థ నిర్వాహకులు వారికి తెలిసిన డిస్ట్రిబ్యూటర్లకు విక్రయించుకున్నారన్నారు. అయినా లింగా చిత్రంతో నష్టాలకు గురైన వారికి న్యాయం చేయాలని భావించానని రజనీకాంత్ ఇదే విషయం చెప్పారని అన్నారు. చిత్రం విడుదలైన ఐదువారాల తరువాత నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు తనను గానీ, రజనీకాంత్‌ను గానీ కలిసి పరిస్థితి వివరిస్తే వారికి తప్పక న్యాయం చేసేవాళ్లం అన్నారు. అలా కాకుండా కర్ణాటక నుంచి వచ్చారు220 కోట్లు దండుకుపోయారు అంటూ తిరుచ్చి ఏరియా డిస్ట్రిబ్యూటర్ సింగారవేలన్, ఇతర డిస్ట్రిబ్యూటర్లను రెచ్చగొడుతున్నారన్నారు. తాను 220 కోట్లు దోచుకున్నట్లు నిరూపిస్తే వారి నష్టాన్ని ఇప్పుడే సెటిల్ చేస్తానని లేదంటే సింగారవేలన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
'రజనీకాంత్ జోక్యం చేసుకోవాలి'
లింగా చిత్రం డిస్ట్రిబ్యూటర్లు బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. స్వయంగా రజనీకాంత్ వచ్చి జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు: లింగా చిత్రానికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఈనెల 10న నగరంలో నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుమతి కోరుతూ చెన్నైకి చెందిన మెరీనా ఫిలింస్ సంస్థ నిర్వాహకుల్లో ఒకరైన ఆర్.సింగార వడివేలన్ చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించగా పోలీసులు దీన్ని స్వీకరించడానికి నిరాకరించారంటూ ఆయన చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం బుధవారం తగిన బదులివ్వాలని పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున న్యాయవాది జయప్రకాష్ నారాయణన్ హాజరైన ఈ కేసులో తగిన నిర్ణయం తీసుకోవడానికి పోలీసు కమిషనర్‌కు మరింత కాల వ్యవధి కావాలంటూ కోరారు. అయితే ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లు మాత్రం హీరో రజనీకాంత్ వచ్చి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
రజనీకాంత్ పరిష్కరించాలి
లింగా చిత్రం నష్టపరిహారం వ్యవహారంలో రజనీ కాంత్ కల్పించుకుని పరిష్కరించాలని ఆ చిత్ర కొనుగోలుదారులు విజ్ఞప్తి చేశారు. లింగా చిత్రం ఆశించిన వసూళ్లు సాధించలేదని దీంతో చాలా నష్టపోయినట్లు ఆ చిత్రాన్ని కొనుగోలు చేసిన పలువురు బయ్యర్లు ఈ నెల 10న నిరాహార దీక్షకు సిద్ధమవుతూ అనుమతి కోసం కోర్టును కూడా ఆశ్రయించారు. గురువారం తిరుచ్చి, తంజావూరు ఏరియా డిస్ట్రిబ్యూటర్ సింగారవడివేలన్, ఉత్తర ఆర్కాడు దక్షిణ ఆర్కాడు ఏరియా డిస్ట్రిబ్యూటర్ సాయ్, తిరునెల్వేలి కన్యాకుమారి జిల్లాల డిస్ట్రిబ్యూటర్ రూపన్ తదితరులు సమావేశంలో మాట్లాడుతూ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన లింగా చిత్రం ఆశించిన వసూళ్లు సాధించలేదన్నారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. లింగాచిత్ర హీరో రజనీకాంత్ ఈ వ్యవహారంలో కల్పించుకుని డిస్ట్రిబ్యూటర్లు నష్టాన్ని భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. లింగా చిత్రాన్ని 100 కోట్ల ఖర్చుతో నిర్మించి 90 కోట్లకు విక్రయిస్తే తాము నష్టపరిహారం కోరేవారం కాదన్నారు. అలాంటి రూ.45 కోట్ల ఖర్చుతో లింగా చిత్రాన్ని రూపొందించి 220 కోట్లకు వ్యాపారం చేశారని ఆరోపించారు. లింగా చిత్రాన్ని సెంగల్పట్టు ఏరియాకు రూ.14 కోట్లు, కోవై ఏరియాకు రూ.13 కోట్లకు, మదురై ఏరియా రూ.8 కోట్లకు తిరుచ్చి, తంజావూరు ఏరియాలోకి రూ.8 కోట్లకు, దక్షిణ, ఉత్తర ఆర్కాడు ఏరియాలకు రూ.8 కోట్లకు తిరునెల్వేలి, కన్యాకుమారిలో 4.20 కోట్లకు విక్రయించారని వివరించారు. మొత్తం 55 కోట్లకు కొనుగోలు చేయగా 35 కోట్లు నష్టం వాటిల్లిందని తెలిపారు. రజనీ కాంత్ సమస్యను పరిష్కరించకుంటే ఈ నెల10న నిరాహార దీక్షకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. -
9 లోపు సమాధానం ఇవ్వండి
లింగా చిత్రం వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల నిరాహార దీక్షకు అనుమతి విషయమై 9వ తేదీ 11 గంటల్లోపు పోలీసు కమిషనర్ సమాధానం ఇవ్వాలని చెన్నై ప్రధాన న్యాయస్థానం ఆదేశించింది. వివరాల్లో కెళితే... లింగా చిత్రానికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఈనెల 10న నగరంలో నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుమతి కోరుతూ చెన్నైకి చెందిన మెరీనా ఫిలింస్ సంస్థ నిర్వాహకుల్లో ఒకరైన ఆర్.సింగార వడివేలన్ చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించగా పోలీసులు దీన్ని స్వీకరించడానికి నిరాకరించారంటూ ఆయన చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానం బుధవారం తగిన బదులివ్వాలని పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున న్యాయవాది జయప్రకాష్ నారాయణన్ హాజరైన ఈ కేసులో తగిన నిర్ణయం తీసుకోవడానికి పోలీసు కమిషనర్‌కు మరింత కాల వ్యవధి కావాలంటూ కోరారు. దీంతో న్యాయమూర్తి ఈ నెల 9వ తేదీ 11 గంటల్లోపు పిటీషన్‌దారుడి పిటిషన్‌ను సమగ్రంగా పరిశీలించి కోర్టుకు సరైన సమాధానం చె ప్పాలని ఆదేశించారు.