నా భర్తను విడిపించండి | please my husband Release Woman complained | Sakshi
Sakshi News home page

నా భర్తను విడిపించండి

Published Wed, Mar 16 2016 2:39 AM | Last Updated on Tue, Aug 21 2018 7:58 PM

please my husband Release Woman complained

టీనగర్: అత్తమామల చెర నుంచి తన భర్తను విడిపించాలని పోలీసు కమిషనర్‌కు ఒక పట్టభద్ర మహిళ ఫిర్యాదు చేశారు. వరకట్నం చిత్రహింసలకు గురిచేస్తున్న భర్త కుటుంబీకులపై చర్యలు గైకొనాలని అందులో కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చెన్నై, కొలత్తూరు తనికాచలం నగర్, నాలుగవ క్రాస్ స్ట్రీట్‌కు చెందిన సుజాత(33) చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఒక ఫిర్యాదు పత్రం అందజేశారు. తనకు 14 సెప్టెంబరు 2008లో వివాహం జరిగిందని, భర్త పేరు మదన్‌గా పేర్కొన్నారు. తాను తల్లిదండ్రులకు ఒకే కుమార్తెనని, డిగ్రీ పూర్తి చేశానన్నారు.
 
  ఇరు కుటుం బాల సమ్మతంతోనే వివాహం జరిగిందని, మొదట వారు వంద సవర్ల బం గారు నగలు కట్నంగా కోరారన్నారు. అందుకు తన తల్లిదండ్రులు అంగీకరించలేదని, అయినప్పటికీ వారు ఇరువురి జాతకాలు బాగా కుదిరాయని తెలిపి, త రచుగా తమ కుటుంబాన్ని సంప్రదించడంతో తల్లిదండ్రులు సమ్మతించినట్లు తెలిపారు. ముందుగా 50 సవర్ల బంగా రు నగలు, సారె వస్తువులతో తల్లిదండ్రులు ఘనంగా తమ వివాహం జరిపిం చారని, ఆ తర్వాత కొన్ని నెలలకే తన తల్లిదండ్రులు వంద సవర్ల నగలు అందజేయకుండా మోసగించినట్లు ఆరోపిస్తూ తనను చిత్రహింసలకు గురిచేసినట్లు పేర్కొన్నారు. తనకు బిడ్డ జన్మించిన తర్వాత తన మామ పేరు పెట్టాలంటూ భర్త కుటుంబీకులు ఒత్తిడి తెచ్చారని తాము జ్యోతిష్కుని సూచనతో పేరుపెట్టామని తెలిపారు.
 
 విడిగా కాపురం:
 ఇలావుండగా తాను ఉద్యోగానికి వెళతానంటూ భర్త కుటుంబీకుల అనుమతి కోరానని, మొదట్లో సమ్మతిర చిన వారు తర్వాత పూర్తి జీతాన్ని తమకు అందజేయాలంటూ షరతు విధించారన్నారు. భర్త కుటుంబీకులతో విసిగిపోయిన తాను విడిగా కాపురం చేసేందుకు నిర్ణయించానని, ప్యారిస్‌లో పనిచేస్తుండడంతో ఇల్లు మారదామని భర్తకు నచ్చజెప్పానని, అందుకు భర్త సమ్మతించాడని పేర్కొన్నారు. కొళత్తూరు ప్రాంతంలో ఒక ఇల్లు చూసుకుని భర్త, బిడ్డతో అక్కడ కాపురం పెట్టానని తెలిపారు. మొదట్లో తనతో సరిగా మాట్లాడని భర్త అనంతరం సరిగా ఇంటికి రావడం మానేశాడన్నారు.
 
  ఆయనకు ఒక మహిళతో సంబంధం ఉన్నట్లు తెలియడంతో దిగ్భ్రాంతి చెందానన్నారు. దీనిపై ఆయనను నిలదీయగా 16 మే, 2015 నుంచి ఇంటికి సరిగా రావడం లేదని, సెల్‌ఫోన్‌లో మాత్రమే మాట్లాడుతున్నారని తెలిపారు. ఆయన పుట్టింటికి మాత్రమే పరిమితమయ్యాడని, తాను అక్కడికి వెళ్లి రమ్మని కోరగా తనను అవమానపరిచి గెంటివేసినట్లు తెలిపారు. తన బిడ్డ కూడా తండ్రిపై బెంగతో ఉన్నట్లు పేర్కొన్నారు. అందుచేత తన చెంతకు భర్తను చేర్చాలని, ఆయన కుటుంబ సభ్యులపై తగిన చర్యలు గైకొనాలని అందులో కోరారు. దీనిపై మాధవరం మహిళా పోలీసులు చర్యలు తీసుకోలంటూ పోలీసు కమిషనర్ టీకే రాజేంద్రన్ ఉత్తర్వులిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement