బెంగళూరు: నటుడు దునియా విజయ్ తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డికి ప్రముఖ కన్నడ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ జయణ్ణ సోమవారం ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే... గాంధీనగరలోని కపాలి చిత్రమందిరం (సినిమా థియేర్)ను జయణ్ణ లీజ్‌కు తీసుకున్నారు. ఈ థియేటర్‌లో ప్రస్తుతం ఉపేంద్ర హీరోగా నటించిన శివం చిత్రం ప్రదర్శిస్తున్నారు. దునియా విజయ్ హీరోగా నటించిన జాక్సన్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. నాలుగు రోజుల క్రితం దునియా విజయ్ తనకు ఫోన్ చేసి జాక్సన్ సినిమాను కపాలి థియేటర్‌లో విడుదల చేయాలని, లేకుంటే అంతు చూస్తానని బెదిరించాడని జయణ్ణ ఆరోపించారు.
శివం సిని మా ఇటీవలే విడుదలైందని, ఆ సినిమాను ఎలా తీసివేస్తామని చెబితే దునియా విజయ్ బెదిరింపులకు ది గుతున్నాడని ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తును సీసీబీ పోలీసు అధికారులకు సీపీ అప్పగించారు. సీసీబీ పోలీసు అధికారులు దునియా విజయ్, జయణ్ణలను పిలిపించి వివరాలు సేకరించారు. జయణ్ణ తన మీద ఫిర్యాదు చేయడం బాధ కలిగించిందని, తాను ఎవ్వరినీ బెదిరించలేదని సోమవారం మీడియా ఎదుట దునియా విజయ్ చెప్పారు.
విజయ్ బెదిరించాడు... డిస్ట్రిబ్యూటర్ జయణ్ణ
Published Tue, Jan 6 2015 2:10 AM | Last Updated on Tue, Aug 21 2018 7:58 PM
Advertisement
Advertisement