హైదరాబాద్‌ సీపీ కీలక ప్రకటన | CP Anjani Kumar Says 2019 Crime Report At Hyderabad | Sakshi
Sakshi News home page

‘మూడు శాతం తగ్గిన క్రైం రేటు’

Published Thu, Dec 26 2019 2:04 PM | Last Updated on Thu, Dec 26 2019 6:01 PM

CP Anjani Kumar Says 2019 Crime Report At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ పోలీస్‌కు బెస్ట్ క్వాలిటీలో దేశంలోనే మొదటి స్థానం దక్కించుకుందని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2019లో తగ్గిన క్రైంరేటు, కేసుల వివరాలు, పోలీసులు శాంతిభద్రతలను కాపాడటంలో నిర్వహించిన కార్యక్రమాలను తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో జరిగిన వివిధ సంస్కృత కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించామని సీపీ అంజనీ కుమార్‌ పేర్కొన్నారు. హైదరాబాద్ షీ టీం బ్రాండ్ అంబాసిడర్‌గా రాష్ట్రంలో నిలిచిందని పేర్కొన్నారు. 14వేల మంది పోలీసులు ఈ ఏడాది(2019)లో పలు విధుల్లో పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. 2019 మొత్తంగా మూడు శాతం క్రైం రేటు తగ్గిందని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. అందులో భాగంగా ఐపీసీ కేసులు 15, 598 నమోదు చేశామని అయన చెప్పారు.

శారీరక నేరాలు తొమ్మిది శాతం, ప్రాపర్టీ క్రైం రెండు శాతం, చైన్ స్నాచింగ్ దొంగతనాలులు 30 శాతం తగ్గాయని ఆయన వెల్లడించారు. అదేవిధంగా 2019లో కోర్టుల్లో 42 శాతం క్రైం కేసుల్లో శిక్ష పడిందని తెలిపారు. రూ. 26 కోట్లకుపైగా నగదు, ప్రాపర్టీ సీజ్ చేసి ప్రపంచ రికార్డ్ నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. నాలుగు వందలకుపైగా చిన్న పిల్లలను పోలీసులు రక్షించారని ఆయన చెప్పారు. 2019 ఏడాదిలో ఆటో మొబైల్ కేసులు 17 శాతం పెరిగాయని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు.

వరకట్నం కేసులు పదకొండు శాతం ఎక్కువగా నమోదు అయ్యాయని సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. హైదరాబాద్ పరిధిలో అత్యాచార కేసులు తగ్గాయని.. 2018లో 178 కేసులు నమోదైతే, 2019లో 150 కేసులు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. సుమారు 16 శాతం అత్యాచార కేసులు తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు. 2019లో 17 కేసుల్లో 25 మందికి జీవిత ఖైదు పడిందని సీపీ అంజనీ కుమార్‌ వెల్లడించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 27, 737 కేసులు నమోదైనట్టు అంజనీకుమార్‌ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసుల్లో కోర్టు ద్వారా ఎనిమిది కోట్ల 32 లక్షలు వసూళ్లు అయినట్టు ఆయన వెల్లడించారు. 2019లో హైదరాబాద్ సిటీలో ఆక్సిడెంట్ కేసులు 2, 377 నమోదైతే, 261 మంది మరణించారని ఆయన వివరించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో 135 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్‌ నగరంలో 122 పెట్రోలింగ్‌ వాహనాలు, మూడు లక్షల 40 వేల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. షీ టీమ్‌, భరోసా కేంద్రాలతో హైదరాబాద్‌ నగర పోలీస్‌కు మంచి ఫలితాలు వస్తున్నాయని నగర పోలీసు కమిషనర్‌ సీపీ అంజనీ కుమార్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement