పోలీస్ కమిషనర్‌ను కలిసిన నటుడు | Police Commissioner meets with actor Vivek | Sakshi
Sakshi News home page

పోలీస్ కమిషనర్‌ను కలిసిన నటుడు

Published Thu, Aug 27 2015 3:39 AM | Last Updated on Wed, Apr 3 2019 8:57 PM

పోలీస్ కమిషనర్‌ను కలిసిన నటుడు - Sakshi

పోలీస్ కమిషనర్‌ను కలిసిన నటుడు

తమిళసినిమా: ప్రముఖ హాస్య నటుడు వివేక్ బుధవారం ఉదయం నగర పోలీస్ కమిషనర్ జార్జ్‌ను కలిశారు. వివేక్ పూర్వ దేశాధ్యక్షుడు, వైజ్ఞానికవేత్త అబ్దుల్ కలామ్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఆయన స్ఫూర్తితో తమిళనాట కోటి మొక్కల్ని నాటాలనే బృహత్తర నిర్ణయాన్ని తీసుకుని, ఆ దిశగా ఇప్పటికే 27 లక్షల మొక్కల్ని నాటారు. కాగా అబ్దుల్ కలామ్ జయంతి అక్టోబర్ 15న విద్యార్థులతో కలిసి చెన్నై మెరీనా తీరంలో ర్యాలీ నిర్వహించి మొక్కల నాటే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టారు. ఇందులో పాల్గోనేవారికి ఒక్కో మొక్కను అందించనున్నారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి అనుమతి కోరడానికి నటుడు వివేక్ పోలీస్ అధికారిణి కలిశానని అనంతరం విలేకరులకు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement