188 ఏళ్ల తర్వాత
లండన్: దాదాపు 188 సంవత్సరాల తర్వాత తొలిసారి ఓ మహిళ లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు కమిషనర్‌గా నియమితులయ్యారు. స్కాట్‌లాండ్ యార్డ్ కమిషనర్‌గా ఉన్న బెర్నాడ్ హోగన్‌హోవ్ వచ్చే వారం పదవివిరమణ చేయనున్నారు. ఇదే డిపార్ట్‌మెంట్‌లో గతంలో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన క్రెసిడా డిక్‌ను కమిషనర్‌గా నియమించారు. 2015లో డిక్ విదేశాంగ శాఖలో విధులకు వెళ్లారు. తాజాగా ఓ మహిళను ప్రతిష్టాత్మకమైన పోస్టుకు ఎంపిక చేయడంపై బ్రిటన్ హోంశాఖ కార్యదర్శి మాట్లాడారు.
డిక్‌కు డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ఓ సుదీర్ఘ అవగాహన ఉందని చెప్పారు. అది భవిష్యత్తులో డిపార్ట్‌మెంట్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లోని అతిపెద్ద పోలీస్ ఫోర్స్ లండన్ మెట్రోపాలిటనే. దీన్నే స్కాట్‌లాండ్ యార్డ్ డిపార్ట్‌మెంట్ అని కూడా పిలుస్తారు.