విజయవాడ పోలీస్ కమీషనర్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి బలవన్మరణానికి యత్నించాడు.
విజయవాడ (కృష్ణా జిల్లా) : విజయవాడ పోలీస్ కమీషనర్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి బలవన్మరణానికి యత్నించాడు. విజయవాడలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని కొత్తపేటకు చెందిన సుబ్బారావు(39) ఓ ప్రైవేట్ సంస్థలో కొంతకాలం పనిచేశాడు. అయితే ఆ సంస్థ తనకు జీతం చెల్లించలేదని ఆరోపిస్తూ సదరు వ్యక్తి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా పోలీసులు ఫిర్యాదుపై సరిగా స్పందించకపోవడంతో మనస్తాపం చెందిన బాధితుడు ఈ రోజు మధ్యాహ్నం కమీషనర్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు.