​HYD: నేను ఆరోగ్యంగానే ఉన్నా: సీపీ సందీప్‌ శాండిల్య | Hyderabad Police Commissioner Released Video on His Health | Sakshi
Sakshi News home page

HYD: నేను ఆరోగ్యంగానే ఉన్నా: సీపీ సందీప్‌ శాండిల్య

Nov 20 2023 6:40 PM | Updated on Nov 20 2023 7:58 PM

Hyderabad Police Commissioner Released Video on His Health - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తాను ఆరోగ్యంగానే ఉన్నానని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్య తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఆరోగ్యం గురించి స్వయంగా వివరాలు వెల్లడిస్తున్న ఒక వీడియోను విడుదల చేశారు. తనను ఒకరోజు పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. మంగళవారం యథావిధిగా విధులకు హాజరవుతానని శాండిల్య వెల్లడించారు.

కాగా, సీపీ సందీప్ శాండిల్య సోమవారం మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బషీర్‌బాగ్‌ పాత కమిషనరేట్‌లో ఉండగా సందీప్‌ చాతి నొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయనను అధికారులు హుటాహుటిన హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శాండిల్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో సందీప్‌ శాండిల్యను సీఐడీ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌, ఇతర సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు పరామర్శించారు.

ఇదీ చదవండి..ఐదేళ్ల చిన్నారి హత్య.. తల్లి మీద పగతో పొరుగింటి మహిళ ఘాతుకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement