సర్వం సిద్ధం!
గ్రేటర్ ఎన్నికలకు పక్కా బందోబస్తు భద్రతకు పెద్దపీట
సమస్యాత్మక ప్రాంతాలపై {పత్యేక దృష్టి
పోలింగ్ విధుల్లో 25 వేల మంది సిబ్బంది
చెక్‌పోస్ట్‌లు, స్ట్రైకింగ్-షాడో పార్టీలు
కొత్వాల్ మహేందర్‌రెడ్డి వెల్లడి
సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికలను అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని వెల్లడిం చారు. మొత్తం 25 వేల మంది సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నామని తెలిపారు. నగర పోలీసులు, ప్రత్యే క విభాగాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారూ ఇందులో ఉన్నారు. అత్యంత సమస్యాత్మ క ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని కమిషనర్ చెప్పా రు. అదనపు కమిషనర్లు స్వాతి లక్రా, అంజనీకుమార్, జితేందర్, వై.నాగిరెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాలివీ...
పోలింగ్ నేపథ్యంలో ప్రతి ఘట్టాన్నీ కెమెరాల్లో రికార్డు చేస్తారు. సమస్యాత్మకంగా భావించిన 3,200 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సంఘం వెబ్ కాస్టింగ్ చేస్తోంది. ఈ కెమెరాలను కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రో ల్ సెంటర్‌తో అనుసంధానించారు. కమ్యూనిటీ సీసీ కెమెరాల ద్వారానూ పర్యవేక్షిస్తారు. {పతి పోలింగ్ బూత్‌లోనూ కనీసం ఇద్దరు చొప్పున యూనిఫాంలో పోలీసు సిబ్బంది ఉంటారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో నేరచరితుల కట్టడికి, సమస్యాత్మకంగా భావించే వారి కదలికలు కనిపెట్టడానికి ప్రత్యేక షాడో పార్టీలు ఏర్పాటు చేశారు.
ఎన్నికల ఘట్టం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు నగరంలో 17 కేసులు నమోదు చేసిన పోలీసులు రూ.80 లక్షల నగదు స్వాధీ నం చేసుకున్నారు. పోలిం గ్ మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఆ తరువాత కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిబ్బంది విధుల్లో ఉంటారు.
బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లకు గార్డ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా పికె ట్లు కొనసాగుతాయి. 2-3 పోలింగ్ స్టేషన్లకు ఓ రూట్ గా విభజించారు. రూట్ పార్టీలకు ఎస్‌ఐ నేతృత్వం వహిస్తారు. 2-3 రూట్లకు కలిపి ఏసీపీ నేతృత్వం లో స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. డీసీపీలకు స్పెషల్ పార్టీ లు కేటాయించారు. ఇవి కాకుండా కమిషనర్, డీసీపీ, ఏసీ పీ, ఎస్‌హెచ్‌ఓల ఆధీనంలో రిజర్వ్ ఫోర్స్ ఉంటుంది.
పోలింగ్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్
పోలింగ్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించా రు. వీటికి 200 మీటర్ల పరిధిలో నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషిద్ధం. మం గళవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయి. వీటిని అతిక్రమిం చిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటా రు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ప్రచారం, గుర్తు లు, బ్యానర్లు ప్రదర్శించడం, సైగలు చేయడం నిషిద్ధం.
నాలుగు కేటగిరీలకే అనుమతి
పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోకి విధుల్లో ఉండే వారితో పాటు కేవలం నాలుగు కేటగిరీల వారినే అనుమతిస్తారు. ఓటర్లు, ఆ డివిజన్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థి, ఎలక్షన్ ఏజెంట్, పోలింగ్ ఏజెంట్లకు మాత్రమే
అనుమతి ఉంటుంది. వీరు మినహా ప్రజాప్రతినిధులను
సైతం అనుమతించరు. సోమవారం రాత్రి నుంచి సిబ్బంది విధుల్లో ఉంటారు.
బందోబస్తు ఏర్పాట్లివే...
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు: 14
పోలింగ్ సెంటర్లు: 1397
పోలింగ్ స్టేషన్లు: 4163
అత్యంత సమస్యాత్మక
ప్రాంతాలు: 232
సమస్యాత్మక ప్రాంతాలు: 545
మొబైల్ పార్టీలు: 418
ట్రాఫిక్ వింగ్ చెక్‌పోస్టులు: 29
పికెట్స్: అవసరానికి
అనుగుణంగా
షాడో టీమ్స్: 80
స్ట్రైకింగ్ ఫోర్స్: 12 బృందాలు
ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్: 12
అందుబాటులో ఉండే మొత్తం
సిబ్బంది: 25,624
సివిల్: 16,364
ఆర్మ్‌డ్ రిజర్వ్: 4860
ఎన్‌ఎస్‌ఎస్ క్యాడెట్లు: 3000
ఎన్‌సీసీ క్యాడెట్లు: 1400