కౌంట్‌డౌన్
⇒ నేడే జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు
⇒ మధ్యాహ్నం 3 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం
⇒ సాయంత్రం 5 గంటల తర్వాతే ప్రకటన
⇒ మొదటి రెండు గంటల్లో 26 వార్డుల ఫలితాలు
⇒ 4 గంటల్లో పూర్తి చేయాలని యత్నం
⇒ జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి వెల్లడి
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాతకాలు శుక్రవారం తేలనున్నాయి. గెలిచేదెవరో.. ఓడేదెవరో మరికొన్ని గంటల్లో వెల్లడి కానుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. పురానాపూల్ వార్డుకు రీపోలింగ్ జరుగుతున్న దృష్ట్యా నిర్ణీత సమయం ముగిసే వరకు (సాయంత్రం 5 గంటలు) ఫలితాలను వెల్లడించరు. సాయంత్రం 5 గంటల తర్వాతే వార్డుల ఫలితాలు ప్రకటిస్తారు. కౌంటింగ్ ఏర్పాట్లు, ఇతర వివరాలను జీహెచ్‌ంఎసీ కమిషనర్, ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి గురువారం మీడియా సమావేశంలో వివరించారు. ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి లెక్కింపు కౌంటర్లకు చేర్చేటప్పటి నుంచి పూర్తయ్యే వరకు మొత్తం కౌం టింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. కౌం టింగ్ ఏర్పాట్లు చేసిన దాదాపు 25 ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, అడిషనల్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్‌లు ఉంటారు. వీరిని ఎన్నికల పరిశీలకులు, రిట ర్నింగ్ అధికారులు ర్యాండమ్‌గా నియమిస్తారు. ఓట్ల లెక్కిం పు మొత్తం ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో జరుగుతుంది.
ఇంకా..
⇒తొలుత మాక్ కౌంటింగ్ నిర్వహిస్తారు.
⇒మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు.
⇒దీని కోసం రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద ప్రత్యేక టేబుల్ ఉంటుంది.
⇒నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తారు. జనరేటర్లు అందుబాటులో ఉంచుతారు.
⇒కౌంటింగ్ హాళ్లలోకి సెల్‌ఫోన్లు నిషిద్ధం.
⇒ఫలితాల వివరాలు తెలియజేసేందుకు మీడియా కేంద్రా లు ఉంటాయి.
మధ్యాహ్నం 3 గంటల నుంచి లెక్కింపు ప్రారంభిస్తారు. ఫలితాలు తెలిసినప్పటికీ సాయంత్రం 5 గంటల వరకు వెల్లడించరు. కౌంటింగ్ మొదలైన రెండు గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది.
⇒ మొత్తం ఫలితాల వెల్లడికి నాలుగు గంటల సమయం పడుతుందని అంచనా.
⇒ మొత్తం 1,674 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
⇒ కౌంటింగ్ సిబ్బంది 5,626 మంది.
⇒827 రౌండ్లలో మొత్తం లెక్కింపు పూర్తవుతుంది.
⇒ లెక్కింపు కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ మీడియాను అనుమతించరు.
⇒ తొలి రెండు గంటల్లో 26 వార్డుల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
⇒ నాలుగు గంటల్లో అన్ని వార్డుల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
⇒ కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పాసులు ఉన్న వారికే అనుమతి.
⇒ పాసులు లేకుండా ఎవరూ రావద్దని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి.
⇒ పోలీసుల అనుమతి ఉంటేనే విజేతలు ర్యాలీలు నిర్వహించాలి.
3 నుంచి 10 రౌండ్లు
కౌంటింగ్ కేంద్రాల్లోని సదుపాయాలు.. పోలింగ్ కేంద్రాలను బట్టి మూడు నుంచి పది రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. మొత్తం వార్డుల సంఖ్య 150. వీటిలో 99 వార్డుల లె క్కింపు ఒకేసారి (మధ్యాహ్నం 3 గంటలనుంచి) ప్రారంభమవుతుంది. అవి పూర్తయ్యాక మరో రెండు, మూడు దఫాల్లో లెక్కింపు జరుగుతుంది.
తొలి దశలో ఫలితాలు వెలువడే వార్డులు: తొలి రెండు గంటల్లో ఫలితాలు వెలువడనున్న వార్డుల్లో కాప్రా, మీర్‌పేట హెచ్‌బీ కాలనీ, చిలుకానగర్, రామంతాపూర్, అక్బర్‌బాగ్, రెయిన్‌బజార్, లలితాబాగ్, సంతోష్‌నగర్, ఫలక్‌నుమా, నవాబ్‌సాహెబ్‌కుంట, శాలిబండ, జియాగూడ, దత్తాత్రేయనగర్, లంగర్‌హౌస్, టోలిచౌకి, మెహదీపట్నం, హిమాయత్‌నగర్, కాచిగూడ, అడిక్‌మెట్,ముషీరాబాద్, షేక్‌పేట, గచ్చిబౌలి, మాదాపూర్, చింతల్, నేరేడ్‌మెట్ ఉన్నాయి. మూడు గంటల్లో ఫలితాలు వెలువడనున్న వార్డుల్లో సైదాబాద్, సులేమాన్‌నగర్, శాస్త్రిపురం, మైలార్‌దేవ్‌పల్లి, గుడిమల్కాపూర్, ఆసిఫ్‌నగర్, విజయనగర్ కాలనీ, అహ్మద్‌నగర్, రెడ్‌హిల్స్, జాంబాగ్, గన్‌ఫౌండ్రి, గోల్నాక, బాగ్‌అంబర్‌పేట, రామ్‌నగర్, ఖైరతాబాద్, మియాపూర్, భారతీనగర్, ఆర్‌సీపురం, ఓల్డ్‌బోయిన్‌పల్లి, గాజులరామారం, రంగారెడ్డినగర్, వెంకటాపురం, అడ్డగుట్ట, మెట్టుగూడ, బౌద్ధనగర్, రామ్‌గోపాల్‌పేట ఉన్నాయి.