ఓటరు స్లిప్ పొందండిలా..
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ మంగళవారం జరుగనుంది. ఇప్పటికే చాలామంది ఇళ్లకు పోలింగ్ సిబ్బంది వెళ్లి వారి పోలింగ్‌కేంద్రం, ఓటరు క్రమసంఖ్య వివరాలు తెలిపే ఓటరుస్లిప్‌లు అందజేశారు. నాలుగు లక్షలమందికి పైగా వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్నారు. దాదాపు రెండు లక్షల మంది మొబైల్ యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంకా ఇవి పొందని వారు పలు విధాలుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అటు ఎన్నికల సంఘం, ఇటు జీహెచ్‌ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేశాయి. ఇందులో భాగంగా వెబ్‌సైట్ నుంచి, మొబైల్ యాప్ ద్వారా కూడా ఓటరు స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ (్టట్ఛఛి.జౌఠి.జీ)లోకి వెళ్లాలి.
అందులో ...
► ‘డౌన్‌లోడ్ ఓటర్ స్లిప్’పై క్లిక్ చేయాలి.
► డౌన్‌లోడ్ జీహెచ్‌ఎంసీ ఓటరుస్లిప్ అని వస్తుంది.
► సర్కిల్, వార్డు, డోర్‌నెంబరు, పేరు, ఎపిక్ నెంబరు తెలపాల్సిందిగా సూచిస్తుంది. ఎపిక్‌నెంబరు(ఓటరు గుర్తింపుకార్డునెంబరు) నమోదు చేయగానే ఓటరు వివరాలతో కూడిన స్లిప్‌వస్తుంది. దాన్ని సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు.
► ఎపిక్ కార్డులేని పక్షంలో సర్కిల్, వార్డులను ఆయా కాలమ్‌లలో భర్తీచేశాక డోర్ నెంబరు, పేరు వివరాల్లో ఏ ఆప్షన్‌ను పేర్కొన్నా సరిపోతుంది. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు తెలిస్తే ఇంకా మంచిది.
► ఓటరు జాబితాలో కచ్చితంగా ఏపేరు ఉందో తెలిస్తే సదరు ఆప్షన్‌పై టిక్ చేసినా ఓటర్లు స్లిప్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవాలి. లేని పక్షంలో పేరులోని తొలి అక్షరాలు కొన్ని టైప్ చేసినా సదరు అక్షరాలతో ప్రారంభమయ్యే ఓటర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిల్లో కావాల్సిన వారి పేరు, వివరాలు చూసుకోవాలి.
► ఎవరి ఓటరు స్లిప్ కావాలో ఆపేరు వరుసలో ఉన్న ‘ప్రింట్ ఓటరు స్లిప్’పై క్లిక్ చేస్తే వార్డునెంబరు, పోలింగ్‌స్టేషన్ నెంబరు, లొకేషన్, ఓటరు జాబితాలో సీరియల్ నెంబరు, పేరు, తండ్రి/ భర్త పేరు, వయసు, లింగం, ఎపిక్ నెంబరు వివరాలతో కూడిన స్లిప్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు.
► మొబైల్ యాప్ ద్వారా ఆండ్రాయిడ్ సదుపాయం ఉన్నవారు గూగుల్ ప్లేస్టోర్‌నుంచి టీఎస్‌ఎలక్షన్ కమిషన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, అందులో ఎపిక్ నెంబరును ఎంట్రీ చేస్తే వివరాలు వస్తాయి.
► నగర ప్రజలు, ముఖ్యంగా విద్యావంతులు ఈసదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు.
యాప్ ద్వారా ఇలా..
ఆండ్రాయిడ్ సదుపాయం కలిగిన స్మార్ట్‌ఫోన్ల ద్వారా దిగువ పేర్కొన్న విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
► స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లాలి.
► సెర్చ్‌లో టీఎస్‌ఈ సీ ఓటర్ అని టైపు చేస్తే ‘ టీఎస్ ఎలెక్షన్ ఓటరు స్లిప్’ అనే యాప్ వస్తుంది. దాన్ని ఇన్‌స్టల్ చేసుకోవాలి
► సదరు యాప్‌ను ఓపెన్ చేస్తే ఎపిక్ / ఓటరు ఐడీ స్క్రీన్ వస్తుంది. దాన్లో ఎపిక్ నెంబరు ఎంట్రీ చేస్తే ఓటరుస్లిప్ వస్తుంది.
► సదరు వివరాలను సేవ్ చేసుకోవచ్చు.
► ఎన్నికల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఇప్పటికే దాదాపు 45 లక్షల మందికి ఓటరుస్లిప్‌లు పంపిణీ చేశారని అధికారులు తెలిపారు.
అంకెల్లో ఓటరు స్లిప్పులు
వెబ్‌సైట్ ద్వారా ఆదివారం ఒక్క రోజు ఓటరు స్లిప్పులు డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 54,701
ఇప్పటి వరకు వెబ్ ద్వారా ఓటరు స్లిప్పులు డౌన్‌లోడ్ చేసుకున్న మొత్తం ఓటర్లు 4,63,127
మొబైల్ యాప్ ద్వారా ఆదివారం ఒక్క రోజు ఓటరు స్లిప్పులు డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 89,813
ఇప్పటి వరకు మొబైల్ యాప్ ద్వారా ఓటరు స్లిప్పులు డౌన్‌లోడ్ చేసుకున్న మొత్తం ఓటర్లు 2,75,163