voter slips
-
Lok Sabha Election 2024: అంతా ఓటర్ స్లిప్‌లోనే
తమ భవిష్యత్‌ను నిర్ణయించే పాలకులను ఎన్నుకోవడంలో కీలకమైన ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో ప్రజల్లో నిర్లిప్లత కనిపిస్తుంటుంది. చాలామంది చిన్న చిన్న ఇబ్బందుల కారణంగా ఓటేసేందుకు ఆసక్తి చూపించరు. ఫలితంగా లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా 70 శాతం ఓటింగ్ కూడా నమోదు కాలేదు! పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో ఓటింగ్ మరీ తక్కువగా నమోదవుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు, మరింత మందిని పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంటోంది. వీటికి తోడు ఓటరు స్లిప్‌లపై క్యూఆర్ కోడ్లు ముద్రిస్తోంది. పోలింగ్ బూత్ ఎక్కడుంది మొదలుకుని ఓటింగ్‌కు సంబంధించిన సమస్త సమాచారాన్నీ కోడ్ సాయంతో ఇట్టే తెలుసుకోవచ్చు. స్కాన్ చేస్తే పూర్తి సమాచారం ఓటర్ స్లిప్‌లపై ఉండే క్యూఆర్ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్ చేస్తే చాలు.. ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో చెబుతుంది. అక్కడికెలా వెళ్లాలో కూడా గూగుల్ మ్యాప్ సాయంతో చూపిస్తుంది. ఇటీవలి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరు పరిధిలో క్యూఆర్‌తో కూడిన ఓటర్ స్లిప్‌ల కారణంగా ఓటింగ్ బాగా పెరిగినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికార మనోజ్‌కుమార్ మీనా వెల్లడించారు. బెంగళూరు టీచర్స్ కాలనీ అసెంబ్లీ స్థానంలో 2020లో 66 శాతం నమోదైన పోలింగ్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 86 శాతానికి పెరిగిందన్నారు. ‘‘చాలామంది ఓటర్లకు పోలింగ్ బూత్ ఎక్కడ ఉందో తెలియడం లేదు. ముఖ్యంగా పట్టణాల్లో ఈ పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ భవనాలెక్కడున్నదీ తెలియకపోవడం ఇందుకు ప్రధాన కారణం. క్యూఆర్ కోడ్ దీనికి పరిష్కారం. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో 80 శాతానికి పైగా ఓటర్లకు క్యూఆర్ కోడ్ ఆధారిత ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేశాం’’ అని ఆయన వివరించారు. డిజిటల్ ఓటర్ స్లిప్ 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ స్లిప్‌లను ‘ఓటర్ హెల్ప్‌లైన్’ యాప్ ద్వారా డిజిటల్‌గా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఎన్నికల సంఘం కలి్పంచడం విశేషం. పోలింగ్ కేంద్రంలో సిబ్బంది డెస్క్ వరకు ఫోన్లను తీసుకెళ్లి ఈ డిజిటల్ ఓటర్ స్లిప్‌ను చూపించేందుకు అనుమతించారు. భవిష్యత్‌లో ఎన్నికలు మరింత డిజిటల్‌గా మారనున్నాయనేందుకు ఇది మరో సంకేతం. ఆకర్షించే ఏర్పాట్లు ఓటర్లను మరింతగా ఆకర్షించేందుకు ఈ విడత చాలా రాష్ట్రాల్లో థీమ్ ఆధారిత పోలింగ్ బూత్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కేవలం మహిళా సిబ్బందితో కూడిన కేంద్రాలు, 30 ఏళ్లలోపు వయసున్న అధికారులతో యూత్ పోలింగ్ కేంద్రాలు, గిరిజన ప్రాంతాల్లో వారి ఇళ్లను పోలిన పోలింగ్ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నారు. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో పోలింగ్ కనాకష్టంగా 50 శాతం దాటుతుండటం తెలిసిందే. ఇలా చాలా తక్కువ ఓటింగ్ నమోదవుతున్న ప్రాంతాలపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా ప్రాంతాలకు బృందాలను పంపించి ఓటర్లలో చైతన్యానికి చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సాయం కూడా తీసుకుంటోంది. బూత్ వద్ద చాంతాడంత క్యూలు చూసి అంతసేపు లైన్లో ఉండాలా అని చాలామంది అనుకుంటారు. దీనికి విరుగుడుగా పోలింగ్ బూత్ వద్ద క్యూను ఇంటి నుంచే మొబైల్లో తెలుసుకునేలా యాప్‌లను ఈసీ అభివృద్ధి చేసింది. ఆ బూత్‌ల సమీపంలో వాహనాల పార్కింగ్ వసతులున్నాయా, లేదంటే సమీపంలో ఎక్కడ పార్క్ చేసుకోవచ్చు వంటి సమాచారం కూడా వాటిలో అందుబాటులోకి తెచి్చంది. నడవలేని వృద్ధుల కోసం ఈ యాప్‌ల నుంచి వీల్‌చైర్ కూడా బుక్ చేసుకోవచ్చు. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి అర్హతలు, అఫిడవిట్లో సమాచారం, వారిపై ఏవైనా క్రిమినల్ కేసులు నమోదయ్యాయా? ఆస్తులు, అప్పులు తదితర పూర్తి సమాచారాన్నీ తెలుసుకోవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
135 కోట్లు సీజ్.. 250 కేసులు నమోదు
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్ కుమార్ తెలిపారు. ఓటరు ఐడీకార్డులేనివారు.. ప్రభుత్వం గుర్తించిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చని పేర్నొన్నారు. ఇప్పటికే వంద శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయిందని పేర్కొన్నారు. గురువారం ఎన్నికల పోలింగ్, బందోబస్తు, పోలింగ్ కేంద్రాలు తదితర అంశాలపై రజత్ కుమార్ మీడియా సమావేశంలో చర్చించారు. మావోయిస్టు ప్రభావిత 13 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ జరుగుతుందని, మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలవరకు పోలింగ్ జరుగుతుందన్నారు. నగదు, మద్యం పంపిణీపై చాలా ఫిర్యాదుల వస్తున్నాయన్నారు. ఇప్పటివరకు 135 కోట్లు సీజ్ చేశామని, 250 కేసులు నమోదు చేశామని తెలిపారు. 446 పోలింగ్ పర్యవేక్షణ బృందాలు సిద్దంగా ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో కొత్తగా 20 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వివరించారు. గుర్తింపు కార్డులు ఇవే.. పాస్‌పోర్ట్, డ్రైౖవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు జారీచేసిన గుర్తింపు కార్డులు, బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోలతో జారీ చేసిన పాస్‌పుస్తకాలు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఎన్ఆర్ఈజీఎస్ జాబ్‌కార్డ్, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, ఫొటోతో ఉన్న పెన్షన్ ధ్రువీకరణ పత్రం, ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫొటో ఓటర్ స్లిప్, ఎంపీ, ఎంఎల్ఏ, ఎంఎల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, ఎన్‌పీఆర్‌కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డ్. -
పోల్ చిట్టీ.. ఓ గూగుల్ మ్యాప్!
సాక్షి, కల్వకుర్తి టౌన్: ఎన్నికల సంఘం పంపిణీ చేసిన ఓటర్ స్లిప్పు గూగుల్ మ్యాప్‌లా ఉపయోగపడనుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సారి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. గతంలో అభ్యర్థులే తమ ఏజెంట్ల ద్వారా ఓటర్లకు జాబితాలో వారి సంఖ్య చూసి పోల్ చిట్టీలు రాసిచ్చేవారు. దాన్ని తీసుకుని వారు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేసేవారు. కానీ ఈ సారి ఎన్నికల సంఘం పోల్ చిట్టీలను ముద్రించి నేరుగా ఓటర్ ఇంటికి వెళ్లి అందజేసే కార్యక్రమాన్ని చేపట్టింది. శుక్రవారం నుంచి జిల్లా వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం మెదలైంది. చిట్టీ మీద ఫొటోతో పాటుగా ఓటరు జాబితాలో ఉన్న ఐడీ నంబర్, వెనక తన ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉంది, ఆ కేంద్రం ఎక్కడ ఉంది, ఏ దారి గుండా, ఏ దిక్కుకు వెళ్లాలి అనే రూట్‌మ్యాప్‌ను ముద్రించింది. చివరి దశలో పంపిణీ జిల్లాలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్‌తో పాటు కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలో 8,23,858మంది ఓటర్లు ఉండగా 1,032పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ప్రతి ఓటరుకు పోల్ చిట్టీలను పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధిత బీఎల్ఓలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం దాదాపు పూర్తి కావచ్చింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 95 శాతం మేర పోల్ చిట్టీలు పంపిణీ చేశారు. గుర్తింపు కార్డులా పోల్ చిట్టీ గతంలో పోల్ చిట్టీ తెల్లకాగితం మీద రాసిచ్చేవారు. ప్రస్తుతం ఓటరు జాబితాలోని ఓటరు ఫొటోతో పాటు వారి పేరు, ఎపిక్ నంబర్, పోలింగ్ కేంద్రం నంబర్ కూడా ఉండడంతో ఇదో గుర్తింపు కార్డు మాదిరిగా అయింది. గతంలో ఓటు వేసేందుకు ఓటర్ ఐడీ కార్డు లేనివారు రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు పాస్‌బుక్.. ఇలా ప్రభుత్వ గుర్తింపుపొంది జారీ చేసి 12 రకాల గుర్తింపు కార్డులు తీసుకెళ్లి చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అవేమీ అవసరం లేకుండా ఒక్క పోల్ చిట్టీ ఉంటే సరిపోతుంది. -
ఓటరు స్లిప్పులు.. తప్పుల తడక..!
సాక్షి, అయిజ: అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. అయితే అధికారుల ఒత్తిడి మేరకు పనులు త్వరగా పూర్తిచేసే క్రమంలో కిందిస్థాయి సిబ్బంది చేసే పనుల్లో ఓటరు స్లిప్పుల తయారీ తప్పుల తడకగా మారింది. అయిజ మండలంలో మొత్తం 60,396 ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు, 30,150 మంది కాగా మహిళలు 30,223, ఇతరులు 23 మంది ఉన్నారు. మొత్తం 73 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేందుకు అధికారులు ఓటర్‌స్లిప్పులు ప్రింట్ చేశారు. బీఎల్ఓలు వాటిని ఇంటింటికి తిరిగి ఓటర్లకు అందజేశారు. నాలుగు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓటర్ స్లిప్పుల్లో సుమారు 2,500 ఓటర్లకు సంబంధించిన చిరునామాల్లో తప్పులు దొర్లాయి. మారిన చిరునామాలు. ఓటర్లు ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్‌లు తయారు చేసారు. అధికారుల తప్పిదంవలన ఓటర్లు ఓటు వేసే పోలింగ్ కేంద్రాల అడ్రస్‌లు తప్పుల తడకగా ప్రింట్ అయింది. వారం రోజుల క్రితం అయిజ మున్సిపాలిటీలో, మండలంలోని అన్ని గ్రామాల్లో బీఎల్ఓలు ఇంటింటికి ఓటరు స్లిప్పులను అందజేశారు. అయితే ఓటరు స్లిప్పుల్లో కొన్ని చోట్ల తప్పులు ఉన్నాయని ఓటర్లు వాపోతున్నారు. ముఖ్యంగా అయిజ మున్సిపాలిటీలోని 78, 79, 80, 81 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓటర్‌స్లిప్పుల్లో పోలింగ్ కేంద్రాల చిరునామా మొత్తం మారిపోయింది. అయిజ పట్టణంలోని కమతంపేట, గుర్రంతోట కాలనీల ఓటర్లకు సంబంధించి అయిజ మున్సిపాలిటీలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటువేయాల్సి ఉండగా.. అయిజ మండలంలోని గుడుదొడ్డిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల చిరునామాను ముద్రించారు. మరికొన్ని ఓటరు స్లిప్పుల్లో అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల చిరునామా ప్రింట్ అయింది. ఆందోళన చెందుతున్న ఓటర్లు.. ఓటరు స్లిప్పుల్లో తప్పులు దొర్లడంతో ఓటర్లు ఆందోళనకు గురయ్యారు. వారం రోజులుగా బీఎల్ఓలకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయిజ పట్టణంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయాల్సి ఉండగా.. వేరే గ్రామాల్లో, ఇతర మండలాల్లోని పోలింగ్ కేంద్రాల చిరునామాలు ఉంటే అక్కడికి వెళ్లి ఓటు ఎలా వేయగలుగుతామని ఓటర్లు మండిపడుతున్నారు. దాంతో వీఆర్ఓలు తప్పులు సరిదిద్దే కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి వారి ఓట రు స్లిప్పులను పరిశీలిస్తున్నారు. ఓటర్‌స్లిప్పులపై తప్పుగా ముద్రించబడిన పోలింగ్ కేంద్రం చిరునామాను సరిదిద్ది వాటిపై సంతకం చేస్తున్నారు. సరిదిద్దుతున్నాం.. అయిజ మున్సిపాలిటీలో ఓటరు స్లిప్పులపై పోలింగ్ స్టేషన్ల అడ్రసులు తప్పుగా ప్రింట్ అయ్యాయని ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే రెవెన్యూ అధికారులను పంపించి ఓటరు స్లిప్పులపై తప్పులను సరిచేసి సంతకాలు చేయాలని ఆదేశించాం. మూడు రోజులుగా ఇంటింటికి తిరిగి ఓటరు స్లిప్పులపై తప్పులు సరిచేసి సంతకాలు చేస్తున్నారు. ఇళ్లు తాళాలు వేసి వెళ్లిన వారివి తప్ప దాదాపు అందరి ఓటరు స్లిప్పుల తప్పులు సరిచేసి వీఆర్ఓలు సంతకాలు చేశారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే బీఎల్ఓలకు సమాచారం ఇవ్వాలి. – కిషన్‌సింగ్, తహసీల్దార్, అయిజ -
‘ప్రవర్తన’ అతిక్రమిస్తే చర్యలు తప్పవు
కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఉచితంగా ఎపిక్ కార్డుల పంపిణీ, మరో వైపు ఇంటింటికి ఓటరు స్లిప్‌ల పంపిణీ జరుగుతోంది. ఇప్పటికే లక్ష ఎపిక్ కార్డులు పంపిణీ చేశాం. మిగతా 1.71 లక్షల మందికి రెండుమూడు రోజుల్లో పంపిణీ చేస్తాం. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఎన్నికల ప్రచారపర్వం ఊపందుకుంది. నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. అభివృద్ధి పథకాల మాటేమోగాని ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలనే ఎక్కువగా ఎక్కుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించి ఎవరు వ్యవహరించినా ఊరుకునే ప్రసక్తే లేదని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ స్పష్టం చేశారు. ప్రవర్తన నియమావళి నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటికే దాదాపు 120 కేసులు నమోదు చేశామన్నారు. వీటిలో నిర్ణీత సమయం ముగిశాక ప్రచారం, ప్రసంగాలు కొనసాగించినవి.. ప్రసంగాల్లో ప్రత్యర్థులపై వ్యతిరేకంగా చేసినవి, నిరాధార ఆరోపణలు వంటివాటితో పాటు అనుమతి లేని పోస్టర్లు తదితరమైనవి ఉన్నాయన్నారు. ఎన్నికలకు సంబంధించి బుధవారం ‘సాక్షి’తో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ.. పెరిగిన అభ్యర్థులు..అదనంగా ఈవీఎంలు.. హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలుండగా, పోటీ చేస్తున్న అభ్యర్థులు 15 మంది కంటే ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో ఒక ఈవీఎం (బ్యాలెట్ యూనిట్) కంటే ఎక్కువ యూనిట్లు అవసరం. ఒక బ్యాలెట్ యూనిట్లో నోటా కాక 15 మంది అభ్యర్థుల వరకు అవకాశం ఉంటుంది. అలా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని దాదాపు 240 పోలింగ్ కేంద్రాల్లో మూడేసి బ్యాలెట్ యూనిట్లు వాడాల్సి ఉంది. సనత్‌నగర్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా మినహా మిగతా 11 నియోజకవర్గాల్లో రెండేసి బ్యాలెట్ యూనిట్లు వాడాలి. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈవీఎంలు కాక అదనంగా దాదాపు 2,500 ఈవీఎంలు కావాల్సి ఉంది. 10 లక్షల గైడ్లు ♦ వెబ్ కెమెరాలతో పోలింగ్ ప్రత్యక్ష ప్రసారానికి దాదాపు 6500 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ♦ దివ్యాంగుల రవాణా సదుపాయానికి150– 170 వాహనాలు వినియోగిస్తాం. ♦ ఎన్నికల విధుల్లోని వివిధ స్థాయిల్లోని వారికి ఒక విడత శిక్షణ పూర్తయింది. రెండో విడత శిక్షణ ఈ నెల 30, డిసెంబర్ 1న నిర్వహిస్తాం. ♦ బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేని దాదాపు 700 కేంద్రాల నుంచి ప్రసారానికి ఇంటర్నెట్ డాంగిల్స్ వినియోగిస్తాం. ♦ ఓటు ఎలా వేయాలో తెలియజేసే 10 లక్షల గైడ్లను త్వరలో పంపిణీ చేస్తాం. గుర్తింపు పత్రంతోనూ ఓటేయొచ్చు కొత్త నిబంధనలు, నిర్దిష్ట కార్యాచరణకనుగుణంగా డిసెంబర్ 2వ తేదీ వరకే ఓటరు స్లిప్‌ల పంపిణీ పూర్తి చేస్తాం. ఓటరు స్లిప్ అందని వారు, తమ ఓటరుకార్డుతో పోలింగ్ కేంద్రానికి వెళ్లవచ్చు. అదీ లేకపోయినా ఓటరు జాబితాలో పేరుంటే ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి తీసుకువెళితే పోలింగ్‌కు అనుమతిస్తారు. ఓటరు కార్డు కావాలనుకునేవారు మీ సేవ కేంద్రాల్లో నిర్ణీత ఫీజు చెల్లించి వీటిని పొందవచ్చు, జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లోనూ ఓటరుకార్డుల జారీని చేపట్టాలనుకున్నప్పటికీ, దాన్ని విరమించుకున్నాం. నిబంధనల ఉల్లంఘనలివీ.. మొత్తం కేసులు: 122 (107 ఎఫ్ఐఆర్, 13 పెట్టీ,మరో రెండింటికి కోర్టు ఉత్తర్వులు రావాల్సి ఉంది)మద్యం పట్టివేత : 14 కేసులు (రూ. 2,91,035 విలువైన1634.91 లీటర్లు.) నగదుకు సంబంధించి: 60 కేసులు (రూ.19,92,89,970 పట్టివేత.)ఇతరత్రా: 4 కేసులు. (సౌండ్స్పీకర్లు, 29 కిలోల వెండి, రూ, 2,90,000 విలువైన గుట్కా/పాన్‌మసాలా పట్టివేత.)తొలగించిన బ్యానర్లు, పోస్టర్లు : 54,370 సీ విజిల్ కేసులు.. మొత్తం ఫిర్యాదులు : 724 రిటర్నింగ్ ఆఫీసర్లు ఉపసంహరించినవి: 207 రిటర్నింగ్ ఆఫీసర్లు చర్యలు తీసుకున్నవి: 418 పురోగతిలో ఉన్నవి: 97 స్పష్టత కోసం పై అధికారులకు పంపించినవి: 2 -
మళ్లీ ‘స్లిప్’
సాక్షి, సిటీబ్యూరో: వచ్చేనెల 7వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనేందుకు మహానగర ప్రజలకు ఇంటింటికీ ఓటరు స్లిప్‌లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభించనున్నారు. వాస్తవానికి సోమవారమే ఈ ప్రక్రియ ప్రారంభమై డిసెంబర్ ఒకటో తేదీ నాటికి పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ నిర్ణయించారు. ఒకరోజు ఆలస్యంగా ప్రారంభిస్తున్నందున డిసెంబర్ 2 నాటికి పూర్తి చేస్తామంటున్నారు. కానీ నగరంలో ఇప్పటి దాకా జరిగిన ఓటర్ల జాబితా సర్వే, కొత్త ఓటర్ల నమోదు తదితర అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే నిర్ణీత వ్యవధిలోగా ఈ పంపిణీ ప్రక్రియ పూర్తి చేయగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా కార్యక్రమాల సందర్భాల్లో బూత్ లెవల్ అధికారులు(బీఎల్ఓ) ఇంటింటికీ వెళ్లకుండా ఎక్కడోచోట కూర్చొని ఇష్టానుసారం చేయడం శారు. దీనివల్లే ఓటరు జాబితా తప్పులకుప్పగా మారిందనే ఆరోపణలున్నాయి. ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో ఓట్లు, ఒక్కరికే ఐదారు ప్రాంతాల్లో ఓట్లు నమోదు ఇందుకు నిదర్శనంగా విమర్శకులు చెబుతున్నారు. రోజుకు 180 స్లిప్‌ల పంపిణీ జీహెచ్ఎంసీలోని బీఎల్ఓలు, నగరంలోని ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే రోజుకు ఒక్కో బీఎల్ఓ 180 ఓటరు స్లిప్‌లను పంపిణీ చేయాలి. ఒక్కో ఇంట్లో సగటున నలుగురు ఓటర్లు ఉన్నా రోజుకు కనీసం 45 ఇళ్లు తిరగాలి. సగటున గంటకు ఐదు ఇళ్లు తిరగ్గలరనుకున్నా రోజుకు 9 గంటల పాటు వారు ఇదే పనిలో ఉండాలి. ఇది సాధ్యమేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అపార్ట్మెంట్లలో ఉండే ఫ్లాట్లలో పంపిణీ కంటే ఇండిపెండెంట్ ఇళ్లకు వెళ్లేందుకు సమయం పడుతుంది. ఒక ఇంటికి, ఇంకో ఇంటికీ మధ్య దూరం ఉంటుంది. అంతేకాకుండా వెళ్లగానే హడావుడిగా పంపిణీ చేయడం సాధ్యం కాదు. జాబితా మేరకు సదరు ఇళ్లలో ఉన్న ఓటర్లలో కనీసం ఒక్కరైనా ఉన్నట్లు నిర్థారించుకున్నాకే వాటిని ఇవ్వాలి. పంపిణీ చేసినట్లు సంతకం తీసుకోవాలి. ఈ తతంగమంతా నిర్ణీత వ్యవధిలో చేయడం సాధ్యం కాదు. ప్రస్తుతం ఉన్న బీఎల్ఓలకు తోడు అదనంగా మరింత మందిని నియమిస్తేనే ఇది సాధ్యమన్న అభిప్రాయాలున్నాయి. పోలింగ్ శాతం పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, సక్రమంగా పోల్‌స్లిప్‌లు పంపిణీ కాకపోతే ఎన్నికల విభాగానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదముంది. ఓటర్లు ఇళ్లలో లేకుంటే.. సిబ్బంది ఇళ్లకు వెళ్లిన సమయంలో లేనివారి పోల్ స్లిప్‌లు పోలింగ్ రోజున సంబంధిత పోలింగ్ కేంద్రం వద్ద అందుబాటులో ఉంచుతారు. వారితోపాటు చిరునామాలో లేనివారివి, డూప్లికేట్లుగా భావించివారివి అందుబాటులో ఉంచుతారు. అక్కడ తగిన ఆధారం చూపి పోల్‌స్లిప్ పొందవచ్చు. పోల్‌స్లిప్ లేకపోయినా ఎన్నికల సంఘం పేర్కొన్న 12 రకాల్లో ఏదైనా గుర్తింపు పత్రం చూపినా ఓటరు జాబితాలో పేరుంటే ఓటు వేయవచ్చు. ఒక్కో స్లిప్‌కు 99 పైసలు పోల్‌స్లిప్‌ల ముద్రణకు ఒక్కోదానికి 99 పైసలు ధర ఖరారు చేశారు. స్లిప్పై ఓటరు ఫొటోతో పాటు వెనుకవైపు పోలింగ్ కేంద్రం దారి తెలిపే మ్యాప్ ఉంటుంది. మేడ్చల్ జిల్లాలో ఓటర్లు 22.14 లక్షలు సాక్షి,మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలల్లో మంగళవారం నుంచి ఓటర్లకు స్లిప్స్ పంపిణీ చేసేందుకు జిల్లా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఆదివారం నుంచే పంపిణీ చేయాలని భావించినా సాఫ్ట్వేర్ సాంకేతిక లోపంతో స్లిççప్స్ డౌన్లోడ్ కాలేదు. జిల్లాలో మొత్తం 22,14,754 మంది ఓటర్లు ఉండగా ఓటు నమోదు కోసం 2,194 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఓటర్ల స్లిప్‌లు కూడా బూత్ లెవల్లో బీఎల్ఓ అధ్వర్యంలో నలుగురు సభ్యుల బృందం పంపిణీ చేసే« విధంగా జిల్లా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. పంపిణీ సక్రమంగా సాగేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ ఎంవీరెడ్డి నోడల్ అధికారిని నియమించారు. ఎన్నికల విభాగానికి చెందిన అధికారులు కూడా పంపిణీపై తగిన చర్యలు తీసుకునేలా జిల్లా ఎన్నికల సంఘం కార్యాచరణ రూపొందించింది. ఇంటింటికీ పంపిణీ చేస్తాం: దానకిశోర్ డిసెంబర్ 2వ తేదీలోగా ఓటర్లందరికీ పోల్‌స్లిప్‌లు పంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని గ్రేటర్ ఎన్నికల అధికారి దానకిశోర్ తెలిపారు. వారం రోజులుగా సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని, రాజకీయ పార్టీల వారికి బూత్ లెవల్ ఏజెంట్లను ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పామన్నారు. పోల్‌స్లిప్‌ల పంపిణీని ఏరోజుకారోజు పర్యవేక్షించేందుకు అధికారులను నియమించామన్నారు. పరిస్థితిని సమీక్షిస్తూ తగిన చర్యలు చేపట్టేందుకు హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధుల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఇద్దరు నోడల్ అధికారులును నియమించామని, వారితోపాటు జిల్లా మొత్తం పరిస్థితిని అడిషనల్ కమిషనర్ (ఎన్నికలు) పర్యవేక్షిస్తారన్నారు. -
ఇక ‘పోల్ చీటి’
ఆదిలాబాద్‌అర్బన్: డిసెంబర్లో జరిగే సాధారణ ఎన్నికల నిర్వహణకు ఇటు ఎన్నికల అధికార యంత్రాంగం, అటు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో అవసరమైన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు పోలింగ్ సిబ్బంది, ఎన్నికల అధికారుల నియామకం, పోస్టల్ బ్యాలెట్ల సరఫరా, ఓటర్ల తుది జాబితాను ఇది వరకే ప్రకటించింది. తాజాగా బుధవారం ఎన్నికలకు ముందు ఓటర్లకు పంపిణీ చేసే ఓటరు స్లిప్(పోల్ చీటి)లను కూడా నాలుగు జిల్లాలకు సరఫరా చేసింది. ఈ నెల 21 నుంచి 23 వరకు ఓటర్లకు అందజేసే పోల్ చీటిలను తీసుకెళ్లాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఈసీ సర్క్యూలర్ ద్వారా సమాచారం అందించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నాలుగు జిల్లాల అధికారులు స్లిప్పులను ఈ నెల 21న జిల్లాల వారీగా తీసుకెళ్లాలని సర్క్యూలర్‌లో పేర్కొనడంతో ఆయా జిల్లాల అధికారులు సరఫరా చేసుకున్నారు. ఇందులో భాగంగా నాలుగు జిల్లాల ఎన్నికల సిబ్బంది బుధవారం హైదరాబాద్‌లో ఈసీ అధికారులు స్లిప్పులు భద్రపర్చిన గోదాముకు వెళ్లి 21.75 లక్షల పోలింగ్ చీటిలను తీసుకొచ్చారు. ఆదిలాబాద్‌కు సంబంధించిన పోల్చీటిలను ఆదిలాబాద్‌లోని ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయంలో భద్రపర్చారు. రెండ్రోజుల్లో పంపిణీ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా జిల్లాల వారీగా సరఫరా చేసిన ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయనున్నారు. పోల్ చిటీల పంపిణీ బాధ్యతను ఎన్నికల సంఘం ఆయా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న బూత్ స్థాయి అధికారుల(బీఎల్వో)కు అప్పగించింది. మరో రెండ్రోజుల్లో పంపిణీ ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు బీఎల్వో స్వయంగా ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్పులను అందజేస్తారు. ఈ ఓటర్ స్లిప్పులను కుటుంబ సభ్యులకు మాత్రమే అందజేయాలనే ఆదేశాలు ఉండడంతో బీఎల్వోలు చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రం పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు.. మనకు ఎన్ని ఓటర్ స్లిప్పులు దిగుమతి చేసుకోవాలి.. వాటిని ఈ నెలాఖరులోగా ఓటర్లకు ఏలా పంపిణీ చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నారు. ఓటర్ స్లిప్పులను బల్క్‌గా పంపిణీ చేస్తే సంబంధిత బీఎల్వోలపై కఠిన చర్యలు తీసుకుంటామని, డూప్లికేట్ ఓటర్ స్లిప్పులు తయారు చేసి పంపిణీ చేపడితే కేసులు పెడతామని సీఈవో రజత్ కుమార్ ఇదివరకే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లకు సకాలంలో పోల్ చిటీలు సరఫరా చేసే విధంగా బీఎల్వోలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఓటర్లకు స్లిప్పులు సకాలంలో పంపిణీ కాకపోతే అంగన్వాడీ, ఆయాల సహకారం తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాకు 21.75 లక్షల చిటీలు... ప్రతీ ఓటరుకు ఎన్నికల సంఘం అందజేసే ఓటర్ స్లిప్పు(పోల్ చీటి) ఓటరు ఫొటో, పేరు.. చిరునామా.. వయస్సు, గ్రామం, నియోజకవర్గం, జిల్లా తదితర వివరాలు ఉంటాయి. పది నియోజకవర్గాల్లో మొత్తం 18,88,958 మంది ఓటర్లు ఉండగా, 21,72,302 ఓటర్ స్లిప్పులు కావాలని ఉమ్మడి జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈసీకి ప్రతిపాదనలు పంపింది. ఈ నెల 19న విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా ప్రకారం ఎక్కువగా అవసరం ఉంటుందని గ్రహించిన ఈసీ అధిక సంఖ్యలో కేటాయింపు చేసింది. ఉమ్మడి జిల్లాకు మొత్తం 21.75 లక్షల స్లిప్పులు వచ్చాయి. వీటిని పది నియోజకవర్గాల వారీగా పంపిణీ చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. అధికారులు ప్రతిపాదించిన వాటికంటే ఎన్నికల సంఘం ఎక్కువ ఓటర్ స్లిప్పులను పంపించడంతో కొరత రాకుండా ఉంది. ఉమ్మడి జిల్లాకు వచ్చిన 21.75 లక్షల చీటిలలో ఆసిఫాబాద్‌లోని రెండు నియోజకవర్గాలకు 4.28 లక్షలు, మంచిర్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలకు 6.11 లక్షలు, ఆదిలాబాద్‌లోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లకు 4.35 లక్షలు, నిర్మల్ జిల్లాలోని మూడు స్థానాలకు అవసరమైన 7.01 లక్షల ఓటర్ స్లిప్‌లు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వారీగా సరఫరా చేసిన అనంతరం ఓటర్లకు అందజేయనున్నారు. -
ఓటుకు రశీదు
► గ్రేటర్ వరంగల్, ఖమ్మం, అచ్చంపేట ఎన్నికల్లో అమలుకు యోచన సాక్షి, హైదరాబాద్: ఇకపై ఓటేస్తే వేలికి ఇంకే కాదు... చేతికి రశీదు అందుతుంది. ఇకపై రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లకు రశీదు ఇచ్చేందుకు ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ సిస్టమ్ (వీవీపీఏటీ)ను అమలు చేయాలని రాష్ట్ర ఎన్నిక సంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వచ్చే నెల 6న జరగనున్న గ్రేటర్ వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో దీన్ని అమలు చేసేందుకు అనుమతి కోరుతూ శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖరాసింది. ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికల్లో వీవీపీఏటీ అమలు చేయాలని దేశ సర్వోన్నత న్యాయ స్థానం 2013లో తీర్పు జారీ చేసింది. ఓటరు ఈవీఎం బ్యాలెట్‌పై ఉండే మీటను నొక్కగానే విజయవంతంగా ఓటేసినట్లు తెలుపుతూ.. అప్పటికప్పుడు ప్రింటై రశీదు జారీ అవుతుంది. ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ ఆమోదిస్తే తదుపరిగా న్యాయ శాఖ పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పోలింగ్‌కు వారం రోజులు మాత్రమే ఉండడంతో శరవేగంగా అనుమతులు వస్తేనే ఈ ఎన్నికల్లో అమలుకు అవకాశం ఉండనుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జీహెచ్ఎంసీ ఫలితాల నేపథ్యంలో... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సునామీ సృష్టించడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఘోరపరాజయాన్ని చవిచూశాయి. అధికార పార్టీ ఈవీఎంల టాంపరింగ్‌కు పాల్పడడంతోనే ఇలా ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో వరంగల్, ఖమ్మం, అచ్చంపేట ఎన్నికల్లో ఓటర్లకు రశీదు ఇచ్చే విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. -
ఓటరు స్లిప్ పొందండిలా..
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మంగళవారం జరుగనుంది. ఇప్పటికే చాలామంది ఇళ్లకు పోలింగ్ సిబ్బంది వెళ్లి వారి పోలింగ్‌కేంద్రం, ఓటరు క్రమసంఖ్య వివరాలు తెలిపే ఓటరుస్లిప్‌లు అందజేశారు. నాలుగు లక్షలమందికి పైగా వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నారు. దాదాపు రెండు లక్షల మంది మొబైల్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా ఇవి పొందని వారు పలు విధాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అటు ఎన్నికల సంఘం, ఇటు జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేశాయి. ఇందులో భాగంగా వెబ్సైట్ నుంచి, మొబైల్ యాప్ ద్వారా కూడా ఓటరు స్లిప్‌లను డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ (్టట్ఛఛి.జౌఠి.జీ)లోకి వెళ్లాలి. అందులో ... ► ‘డౌన్లోడ్ ఓటర్ స్లిప్’పై క్లిక్ చేయాలి. ► డౌన్లోడ్ జీహెచ్ఎంసీ ఓటరుస్లిప్ అని వస్తుంది. ► సర్కిల్, వార్డు, డోర్‌నెంబరు, పేరు, ఎపిక్ నెంబరు తెలపాల్సిందిగా సూచిస్తుంది. ఎపిక్నెంబరు(ఓటరు గుర్తింపుకార్డునెంబరు) నమోదు చేయగానే ఓటరు వివరాలతో కూడిన స్లిప్వస్తుంది. దాన్ని సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ► ఎపిక్ కార్డులేని పక్షంలో సర్కిల్, వార్డులను ఆయా కాలమ్‌లలో భర్తీచేశాక డోర్ నెంబరు, పేరు వివరాల్లో ఏ ఆప్షన్‌ను పేర్కొన్నా సరిపోతుంది. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు తెలిస్తే ఇంకా మంచిది. ► ఓటరు జాబితాలో కచ్చితంగా ఏపేరు ఉందో తెలిస్తే సదరు ఆప్షన్‌పై టిక్ చేసినా ఓటర్లు స్లిప్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవాలి. లేని పక్షంలో పేరులోని తొలి అక్షరాలు కొన్ని టైప్ చేసినా సదరు అక్షరాలతో ప్రారంభమయ్యే ఓటర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిల్లో కావాల్సిన వారి పేరు, వివరాలు చూసుకోవాలి. ► ఎవరి ఓటరు స్లిప్ కావాలో ఆపేరు వరుసలో ఉన్న ‘ప్రింట్ ఓటరు స్లిప్’పై క్లిక్ చేస్తే వార్డునెంబరు, పోలింగ్‌స్టేషన్ నెంబరు, లొకేషన్, ఓటరు జాబితాలో సీరియల్ నెంబరు, పేరు, తండ్రి/ భర్త పేరు, వయసు, లింగం, ఎపిక్ నెంబరు వివరాలతో కూడిన స్లిప్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. ► మొబైల్ యాప్ ద్వారా ఆండ్రాయిడ్ సదుపాయం ఉన్నవారు గూగుల్ ప్లేస్టోర్‌నుంచి టీఎస్ఎలక్షన్ కమిషన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని, అందులో ఎపిక్ నెంబరును ఎంట్రీ చేస్తే వివరాలు వస్తాయి. ► నగర ప్రజలు, ముఖ్యంగా విద్యావంతులు ఈసదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. యాప్ ద్వారా ఇలా.. ఆండ్రాయిడ్ సదుపాయం కలిగిన స్మార్ట్ఫోన్ల ద్వారా దిగువ పేర్కొన్న విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లాలి. ► సెర్చ్‌లో టీఎస్ఈ సీ ఓటర్ అని టైపు చేస్తే ‘ టీఎస్ ఎలెక్షన్ ఓటరు స్లిప్’ అనే యాప్ వస్తుంది. దాన్ని ఇన్‌స్టల్ చేసుకోవాలి ► సదరు యాప్‌ను ఓపెన్ చేస్తే ఎపిక్ / ఓటరు ఐడీ స్క్రీన్ వస్తుంది. దాన్లో ఎపిక్ నెంబరు ఎంట్రీ చేస్తే ఓటరుస్లిప్ వస్తుంది. ► సదరు వివరాలను సేవ్ చేసుకోవచ్చు. ► ఎన్నికల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఇప్పటికే దాదాపు 45 లక్షల మందికి ఓటరుస్లిప్‌లు పంపిణీ చేశారని అధికారులు తెలిపారు. అంకెల్లో ఓటరు స్లిప్పులు వెబ్సైట్ ద్వారా ఆదివారం ఒక్క రోజు ఓటరు స్లిప్పులు డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య 54,701 ఇప్పటి వరకు వెబ్ ద్వారా ఓటరు స్లిప్పులు డౌన్లోడ్ చేసుకున్న మొత్తం ఓటర్లు 4,63,127 మొబైల్ యాప్ ద్వారా ఆదివారం ఒక్క రోజు ఓటరు స్లిప్పులు డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య 89,813 ఇప్పటి వరకు మొబైల్ యాప్ ద్వారా ఓటరు స్లిప్పులు డౌన్లోడ్ చేసుకున్న మొత్తం ఓటర్లు 2,75,163 -
నేడు ఈవీఎంల పంపిణీ
గచ్చిబౌలి: గ్రేటర్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, సోమవారం ఈవీఎంలు పంపిణీ చేయనున్నట్లు ఎన్నికల అధికారి, కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సర్కిల్-11, 12 డివిజన్ల ఎన్నికల ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈవీఎంలు, ఇతర మెటీరియల్ పంపిణీ చేస్తామన్నారు. పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఆయా రూట్ల వారీగా పంపిణీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 6.30 లక్షల మంది ఓటర్ స్లిప్పులు డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు. ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పేందుకు ఇది సంకేతమన్నారు. ఇప్పటికే 80 శాతం ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశామని, నేడు, రేపు వార్డు కార్యాలయాల్లో స్లిప్పులు అందిస్తారని తెలిపారు. ఓటర్ స్లిప్పులు తప్పనిసరేం కాద ని చెప్పారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. శేరిలింగంపల్లి ఆర్ఓ మనోహర్ మెటీరియల్ పంపిణీ గురించి కమిషనర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ, వెస్ట్ జోన్ కమిషనర్ బి.వి.గంగాధర్‌రెడ్డి, సర్కిల్-12 డిప్యూటీ కమిషనర్ మమత తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్లూ ఇవి గమనించండి...
మొబైల్ (సెల్‌ఫోన్) యాప్ ద్వారా లక్షకు పైగా ఓటర్లు తమ ఓటరు స్లిప్‌ను సెల్ఫోన్లో సేవ్ చేసుకున్నారు. ఇక వేరే స్లిప్ అవసరం లేదు.. ఫోన్లోని వివరాలే పోలింగ్ కేంద్రంలో చూపిస్తే సరిపోతుందని భావిస్తున్నారు. కానీ..అది కుదరదు. పోలింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లను అనుమతించరు. పోలింగ్‌స్టేషన్ వివరాలు తెలుసు కనుక ఎలాగూ పోలింగ్ కేంద్రం వరకు వెళతారు. అక్కడ త్వరితంగా మీ వివరాల్ని పోలింగ్ అధికారులు గుర్తించాలంటే పోలింగ్స్టేషన్లో ఓటరుజాబితాలో మీ వరుస నెంబరు ఎంతో రాసుకొని వెళ్లి చెప్పినా ఫరవాలేదు. గుర్తుంచుకొని చెప్పినా ఫరవాలేదు. అంతే కానీ.. సెల్ఫోన్లోనే చూపిస్తామనుకుంటే మాత్రం కుదరదని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్(ఎన్నికలు) సురేంద్రమోహన్ తెలిపారు. - సాక్షి, సిటీబ్యూరో ఓటరు స్లిప్ ఉంది కదా అని దానిని మాత్రమే తీసుకువెళ్లినా ఓటు వేసేందుకు అనుమతించరు. ఓటరు గుర్తింపుకార్డు(ఎపిక్ కార్డు) తీసుకువెళ్లాలి. అది లేని పక్షంలో దిగువ పేర్కొన్న పత్రాల్లో దేన్నయినా వెంట తీసుకువెళ్లాలి. 1. ఆధార్ కార్డు, 2. పాస్‌పోర్టు, 3.డ్రైవింగ్ లెసైన్స్, 4.పాన్ కార్డు, 5. ఉద్యోగుల గుర్తింపుకార్డు(రాష్ట్ర/కేంద్ర/ప్రభుత్వరంగ/స్థానికసంస్థ/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ), 6. బ్యాంక్/పోస్టాఫీసు/కిసాన్ పాస్‌బుక్‌లు. 7.పట్టా , రిజిస్టర్డ్ డీడ్స్, 8. రేషన్‌కార్డు, 9. ఎస్సీ/ ఎస్టీ /బీసీ సర్టిఫికెట్లు 10.పెన్షన్పత్రాలు(ఎక్స్‌సర్వీస్‌మెన్ పెన్షన్ బుక్ /పెన్షన్ పేమెంట్ ఆర్డర్ / ఎక్స్ సర్వీస్మన్ల వితంతు / ఆధారపడ్డ వారి సర్టిఫికెట్స్/ వృద్ధాప్య , వితంతు పెన్షన్ ఉత్తర్వులు, 11.స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపుకార్డు 12.ఆయుధ లెసైన్సు, 13. వికలాంగుల సర్టిఫికెట్, 14. ఏటీఎం కార్డులు 15. బార్ కౌన్సిల్ గుర్తింపు కార్డు, 16. పార్లమెంటు సభ్యుల గుర్తింపు కార్డు. 17.శాసనసభ, శాసనమండలి సభ్యుల గుర్తింపుకార్డు. 18.ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డు, 19.కార్మిక మంత్రిత్వ శాఖ స్కీమ్ ద్వారా జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కార్డు, 20. నేషనల్ పాపులేషన్ స్కీమ్ ద్వారా ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డు, 21. పట్టాదారు పాసు పుస్తకాలు. ( పైన పేర్కొన్నవాటిపై ఓటరు ఫొటో కలిగి ఉండాలి. ఎన్నికల నోటిఫికేషన్కన్నా ముందు తెరచిన ఖాతాలు / జారీ అయిన కార్డులు అయి ఉండాలి) -
'స్వేఛ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి'
-
స్లిప్పుల్లేకున్నా ఓటేయెచ్చు.. అయితే..
-
25లోగా తెలంగాణలో ఓటరు స్లిప్పులు పంచండి
కలెక్టర్లకు భన్వర్‌లాల్ ఆదేశం హైదరాబాద్: రాష్ట్రంలో తొలిదశ పోలింగ్ జరిగే తెలంగాణ ప్రాంతం లో ఓటరు స్లిప్పుల పంపిణీని ఈనెల 25లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు.లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్ స్లిప్పుల పంపిణీ, తెలంగాణ జిల్లాల్లో పోలింగ్ ఏర్పాట్లుపై ఆయన మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ సందర్భంగా ఎవరైనా ఇం ట్లో లేకపోయినా, లేదా మృతిచెందినా, మరో చోటకు తరలిపోయిన ఓ టర్ల పేర్లతో విడిగా జాబితా రూపొందించాలని సూచించారు. పోలింగ్ రోజు ఈ జాబితాలోని వారు ఓటింగ్‌కు వస్తే ఒకటికి రెండుసార్లు ఆ వ్యక్తిని నిర్ధారించుకున్న తరువాతే ఓటింగ్‌కు అనుమతించాలన్నారు. రెండో దశలో పోలింగ్ జరిగే సీమాంధ్రలో ఓటర్ స్లిప్పులను బుధవారం నుంచి పం పిణీ చేయాలని ఆదేశించారు. సీమాంధ్రలో బుధవారం నామినేషన్ల గడువు ముగిశాక పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా ఏ జిల్లాకు ఎన్ని అదనపు ఈవీఎంలు అవసరమో నివేదిక పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. -
పులివెందులలో అధికారుల గందరగోళం
వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో పోలింగ్ సందర్భంగా పోలింగ్ అధికారులు గందరగోళం సృష్టించారు. అధికారికంగా ఓటర్లకు ఇళ్లకు వెళ్లి మరీ స్లిప్పులు ఇచ్చినా, ఫోటో గుర్తింపు కార్డు కావాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పలువురు ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. అలాగే నెల్లూరు 54వ డివిజన్లో పోలింగ్ ఆగిపోయింది. ఓటరు స్లిప్పులకు, అధికారుల వద్ద ఉన్న జాబితాకు పొంత లేకపోవడంతో ఓటర్లు నిరసన వ్యక్తంచేశారు. తమకు ఇళ్లకు వచ్చి అధికారులే స్లిప్పులు ఇచ్చారని, అలాంటప్పుడు ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా నందిగామ 17వ వార్డులో ఏజెంట్లకు ఫారాలు ఇవ్వలేదు. దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావు బైఠాయించారు. నందిగామ 19వ వార్డులో ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకోవడంతో అధికారులు పోలింగ్ నిలిపివేశారు.