వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో పోలింగ్ సందర్భంగా పోలింగ్ అధికారులు గందరగోళం సృష్టించారు. అధికారికంగా ఓటర్లకు ఇళ్లకు వెళ్లి మరీ స్లిప్పులు ఇచ్చినా, ఫోటో గుర్తింపు కార్డు కావాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పలువురు ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. అలాగే నెల్లూరు 54వ డివిజన్లో పోలింగ్ ఆగిపోయింది. ఓటరు స్లిప్పులకు, అధికారుల వద్ద ఉన్న జాబితాకు పొంత లేకపోవడంతో ఓటర్లు నిరసన వ్యక్తంచేశారు. తమకు ఇళ్లకు వచ్చి అధికారులే స్లిప్పులు ఇచ్చారని, అలాంటప్పుడు ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు.
కృష్ణా జిల్లా నందిగామ 17వ వార్డులో ఏజెంట్లకు ఫారాలు ఇవ్వలేదు. దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావు బైఠాయించారు. నందిగామ 19వ వార్డులో ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకోవడంతో అధికారులు పోలింగ్ నిలిపివేశారు.
పులివెందులలో అధికారుల గందరగోళం
Published Sun, Mar 30 2014 9:02 AM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM
Advertisement
Advertisement