ఇద్దరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపు
సాక్షి, హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అదృష్టం వరించింది. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఓట్లు సమంగా రావడంతో లాటరీ వేయగా అదృష్టం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకే దక్కింది. ధర్మపురంలోని 6వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆర్.కె.రెహమాన్, టీడీపీ అభ్యర్థి డి.ఇ.రమేష్‌కుమార్ ఇద్దరికీ 786 ఓట్లు వచ్చాయి. దీంతో అభ్యర్థులిద్దరి అంగీకారంతో పోలింగ్ అధికారులు లాటరీ (పేర్లు రాసి చీటీలు వేశారు) వేశారు. లాటరీలో ఆర్.కె.రెహమాన్‌ను అదృష్టం వరించింది. ఇదే తరహాలో ముద్దిరెడ్డిపల్లిలోని 38వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాధమ్మ, టీడీపీ అభ్యర్థి విమలమ్మలకు 1,026 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా అదే రీతిలో లాటరీ వేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాధమ్మకు అదృష్టం వరించింది.
లాటరీలో వరించిన అదృష్టం
Published Tue, May 13 2014 4:13 AM | Last Updated on Fri, Jun 1 2018 8:59 PM
Advertisement
Advertisement