ID cards
-
నేటి నుంచి పుస్తక ప్రదర్శన
కవాడిగూడ: హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ఆధ్వర్యంలో 37వ జాతీయ పుస్తక ప్రదర్శన గురువారం సాయంత్రం ఎనీ్టఆర్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ నెల 29 వరకు ఇది కొనసాగనుంది. బుధవారం హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్, కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ విలేకరులతో ఇక్కడ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికి పైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్లు పుస్తకాలను ప్రదర్శించనున్నారని తెలిపారు. ప్రతి ఇంటిలో పుస్తకం ఉండే లక్ష్యంతో బుక్ ఫెయిర్‌ను ముందుకు తీసుకువెళ్తామన్నారు. 36 ఏళ్ల క్రితం 30 స్టాళ్లతో ప్రారంభమై పుస్తక ప్రదర్శన ప్రస్తుతం 350 స్టాళ్లతో సాహితీ అభిమానులను, పుస్తక ప్రేమికులను ఆకట్టుకోనుందని తెలిపారు. బాల సాహిత్యానికి ప్రాధాన్యమిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రవేశం ఉచితం.. పుస్తక ప్రదర్శనలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు వారి ఐడీ కార్డులు చూపించి ఉచిత ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ఉచిత ఆరోగ్య శిబిరం.. నోరూరించే వంటకం తెలంగాణ రుచులతో ప్రత్యేక ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుక్‌ఫెయిర్ సందర్శకుల కోసం ఈ ఏడాది ఉచిత ఆరోగ్య శిబిరంతో పాటు రెండు వీల్ చైర్లను అందుబాటులో ఉంచుతామన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు.. ప్రతిరోజూ సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. సమావేశంలో తెలుగు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, బుక్‌ఫెయిర్ ఉపాధ్యక్షులు శోభన్‌బాబు, బాల్‌రెడ్డి, ట్రెజరర్ నారాయణరెడ్డి, జాయింట్ సెక్రటరీ సూరిబాబు, కె.సురేష్ పాల్గొన్నారు. -
ఏపీలో కళాకారులకు గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
నకిలీ రైతుల యాత్ర గుట్టు రట్టు
సాక్షి, రామచంద్రపురం: అమరావతి రైతుల ముసుగులో చేస్తున్న పాదయాత్ర గుట్టు రట్టయ్యింది. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్న పోలీసులకు ఐడీ కార్డులు చూపించటంలో పాదయాత్ర చేస్తున్న వారు విఫలమయ్యారు. దీంతో చేసేది లేక యాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ప్రకటించారు. స్థానిక బైపాస్ రోడ్డులోని విజయ ఫంక్షన్ హాలులో బస చేసిన వారు శనివారం పాదయాత్రను ప్రారంభించేందుకు ఉదయం 9 గంటలకు గేటు బయటకు వచ్చారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని, వారి ఐడీ కార్డులు చూపించాలని అమలాపురం, రామచంద్రపురం డీఎస్పీలు మాధవరెడ్డి, బాలచంద్రారెడ్డిల నేతృత్వంలో పోలీసులు కోరారు. అయితే పాదయాత్రలో పాల్గొంటున్న వారిలో కనీసం వంద మందికి కూడా ఐడీ కార్డులు లేవు. ఎవ్వరూ ఐడీ కార్డులు చూపలేదు. దీంతో గత్యంతరం లేక వారందరూ ఫంక్షన్ హాలులోనే ఉండిపోయారు. గుర్తింపు కార్డులు లేకుండా పాదయాత్రలో పాల్గొనేందుకు వీలు లేదని పోలీసులు స్పష్టం చేశారు. పాదయాత్ర చేస్తున్న వారికి సంఘీభావం తెలిపేందుకు టీడీపీ, జనసేన, ఇతర పార్టీల నేతలు అక్కడకు చేరుకోవటంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై ఏం చేయాలనే దానిపై పాదయాత్ర చేస్తున్న వారు టీడీపీ నాయకులతో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మంతనాలు సాగించారు. చివరకు పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని, ఐడీ కార్డుల విషయంలో కోర్టును ఆశ్రయించి, తిరిగి ప్రారంభిస్తామని మీడియాకు చెప్పారు. ఇదిలా ఉండగా టీడీపీకి చెందిన మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సంఘీభావం పేరుతో అక్కడకు చేరుకుని, వైఎస్సార్సీపీ నాయకులు కుట్ర పన్ని పాదయాత్రను ఆపేయించారని ఆరోపించారు. దొంగ రైతులు పలాయనం హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు.. పాదయాత్ర చేస్తున్న వారి ఐడీ కార్డులు చూపించాలని అడగ్గానే 600 మందికి గాను కనీసం 100 మంది కూడా చూపించలేదు. ఆ సమయంలో ఐడీ కార్డులు లేని వారు వెనుక వైపు నుంచి జారుకున్నారు. వీరి తీరుపై మొదటి నుంచీ అనుమానం వ్యక్తమవుతూనే ఉంది. గుడివాడలో, ఇతర ప్రాంతాల్లో వారి రెచ్చగొట్టే ప్రవర్తన వారిపై మరింతగా అనుమానం పెంచింది. నిజమైన రైతులెవ్వరూ ఇలా ప్రవర్తించరని, తొడలుకొడుతూ, మీసాలు తిప్పుతూ ఉద్రిక్తతలు పెంచాలని చూడరని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. శనివారం నాటి ఘటనతో ఆ యాత్రలో రైతులు లేరని, చంద్రబాబు అనుచరులు, టీడీపీ కార్యకర్తలే ఉన్నారని ఆధారాలతో స్పష్టమైంది. దీంతో ఏం మాట్లాడాలో తెలియక పచ్చ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయిందని ప్రజలు చెబుతున్నారు. చంద్రబాబు అండ్ గ్యాంగ్ తప్ప ప్రజలంతా వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపుతుండగా, కేవలం వారి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాత్రమే చంద్రబాబు రైతుల ముసుగులో పాదయాత్ర చేయిస్తున్నారనేది అందరికీ తెలిసి వచ్చింది. -
గుర్తింపు కార్డుల్లో అమ్మ పేరు కోసం...
‘అమ్మ పేరు’ కోసం ఓ కొడుకు చేసిన పోరాటం వ్యవస్థలోని లొసుగులను బయటపెట్టింది. చట్టబద్దమైన గుర్తింపు పత్రాల్లో అమ్మ పేరు చేర్చడానికి ఏడేళ్లుగా అతడు అలుపెరగని ఫైట్ చేశాడు. ఎట్టకేలకు విజయం సాధించి ‘అమ్మ పేరు’ను సార్థకం చేశాడు. అతడి పేరు సువామ్ సిన్హా. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో లింగ్విస్టిక్ చదువుకుంటూ పనిచేస్తున్న 23 ఏళ్ల సువామ్ పోరాట పటిమను ‘హిందూ’ వెలుగులోకి తెచ్చింది. సుదీర్ఘ పోరాటం సువామ్ సిన్హా తల్లిదండ్రులు అతడి రెండేళ్ల వయసులో విడిపోయారు. అతని తండ్రి నేపాల్‌కు చెందినవాడు, తల్లి బీహార్‌లోని భాగల్పూర్ ప్రాంతవాసి. కోల్‌కతాలో హైస్కూల్ పూర్తి చేసిన తర్వాత, సువామ్ తన తండ్రి పేరు లేకుండా స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (SLC) కోసం తన స్కూల్ ప్రిన్సిపాల్‌ని సంప్రదించినప్పుడు.. బహుశా అతడు అనుకుని ఉండడు ఈ పోరాటం చాలా కాలం సాగుతుందని. అతడు ఊహించనట్టుగానే జరిగింది. భారత పౌరుడిగా తనకు అర్హత ఉన్న తన ప్రాథమిక గుర్తింపు కార్డులన్నింటిలో చట్టబద్ధమైన సంరక్షురాలిగా తన తల్లి పేరును చేర్చేందుకు అతడు సుదీర్ఘ పోరాటం చేశాడు. చాలా చర్చల తర్వాత సువామ్.. తన తల్లి మొదటి పేరుతో తొలిసారిగా స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ పొందాడు. అయితే, 2015 -2017 మధ్య కాలంలో ఆధార్ కార్డ్.. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసినప్పుడు అడ్డంకులు తలెత్తాయి. ఫిబ్రవరి 11న పాన్‌కార్డు అందుకోవడంతో అతడి పోరాటం ముగిసింది. పాన్‌కార్డులో తన తల్లి పేరు చూసి ఆనందంతో అల్లంత దూరన ఉన్న అమ్మతో సంతోషాన్ని పంచుకున్నాడు. సిన్హా తల్లి నేపాల్‌లోని ఖాట్మండులోని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో కంట్రీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తాను కోరుకున్న విధంగా తన తండ్రి పేరు లేకుండా అన్ని గుర్తింపు కార్డులు పొందడానికి ఎన్ని అవమానాలు ఎదురైనా అతడు వెనుకడుగు వేయలేదు. తండ్రి పేరే కొలమానమా? ‘తండ్రి పేరు మాత్రమే గుర్తింపు కొలమానంగా ఎందుకు ఉండాలి. మా నాన్న నా జీవితంలో ఎప్పుడూ లేడు, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని చెప్పే సువామ్ సిన్హా... తన గుర్తింపు పత్రాలన్నిటిలోనూ తల్లి పేరే ఉండాలని కోరుకున్నాడు. తల్లితో కలిసి దరఖాస్తులు పట్టుకుని ఆయా కార్యాలయాలకు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాలు తట్టుకుని ముందుకు సాగాడు. అప్పటి కేంద్ర మంత్రుల సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ నుంచి ఎంతో మంది ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా వినతులు పంపాడు. సింగిల్ పేరెంట్స్ అభ్యర్థనల మేరకు పాస్‌పోర్ట్ నియమాలను 2016 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం సవరించింది. పాస్‌పోర్ట్ దరఖాస్తులో చట్టపరమైన సంరక్షకులుగా తండ్రి లేదా తల్లి పేరు చేర్చేలా నిబంధనలను సవరించారు. అలాగే పాన్‌కార్డు నిబంధనలను కూడా ఆదాయపు పన్ను శాఖ 2018లో మార్చింది. అయితే ఆన్లైన్లో దీన్ని అప్డేట్ చేయలేదు. సువామ్ సిన్హా ఇ-దరఖాస్తు చేసిన ప్రతిసారి తండ్రి పేరు అడుగుతూనేవుంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) జోక్యంతో అతడు చివరికి దరఖాస్తు చేయగలిగాడు. పాన్‌కార్డుతో సహా అన్ని గుర్తింపుకార్డుల్లో తనకు చట్టబద్ద సంరక్షకురాలిగా తల్లి పేరును లిఖించి అమ్మకు ఎనలేని ఆనందాన్ని కలిగించిన సువామ్ సిన్హాను నెటిజన్లు మనసారా మెచ్చుకుంటున్నారు. -
ఫేక్ ఆఫీసర్లు ఓకే.. మరి ఐడీలు ఇచ్చే తలకాయలు ఎక్కడ?
సాక్షి, సిటీబ్యూరో: సీఎం ఓఎస్డీకి పీఏనంటూ ఎర వేసి డబుల్ బెడ్రూం ఇళ్ల నుంచి ఉద్యోగాల వరకు అనేక పేర్లు చెప్పి మోసం చేసిన ఎ.సుధాకర్.. ఐపీఎస్ నుంచి ఎస్ఎస్బీ వరకు వివిధ విభాగాల పేర్లు, అనేక హోదాలు వాడేసి మోసాలకు పాల్పడిన కర్నాటి గురువినోద్‌కుమార్ రెడ్డి.. పెళ్లి పేరుతో అనేక మంది యువతులకు ఎర వేసి, భారీగా వసూలు చేసి మోసం చేసిన నకిలీ ఆర్మీ మేజర్ ముదావత్ శ్రీను నాయక్.. ఈ ముగ్గురూ తమ ‘పని’ పూర్తి చేసుకోవడానికి నకిలీ గుర్తింపుకార్డులు (ఐడీ) సైతం వినియోగించారు. మిగిలిన ఇద్దరి కంటే గత వారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన ఎ.సుధాకర్ ఏడాకులు ఎక్కువే చదివాడు. ఆ ఇద్దరి వద్దా ఒక్కో గుర్తింపు కార్డే లభించగా.. ఇతగాడి వద్ద మాత్రం పీఏ టు సీఎం ఓఎస్డీ (తెలంగాణ సెక్రటేరియేట్) అంటూ మూడు, పోలీసు అధికారి అంటూ నాలుగు, నకిలీ ఓటర్ ఐడీలు మూడు, నకిలీ సెక్రటేరియేట్ ఎంట్రీ కార్డులు మూడు లభించాయి. ఈ నేరగాళ్లను పట్టుకుంటున్న అధికారులు గుర్తింపు కార్డులు తయారు చేసి ఇచ్చిన వారిని మాత్రం పట్టించుకోవట్లేదు. సొంతంగా సాధ్యం కాదు.. నకిలీ డాక్టర్లుగా అవతారం ఎత్తే మోసగాళ్లకు బోగస్ గుర్తింపు కార్డులతో పెద్దగా పని ఉండదు. అయితే సూడో పోలీసులు, నకిలీ ప్రభుత్వ అధికారులుగా ‘మారే’ వారికి మాత్రం ఆయా పేర్లు, వివరాలతో ఉండే ఫేక్ ఐడీ కార్డుల అవసరం ఉంటుంది. వీటిని ఆయా నేరగాళ్లు అనేక చోట్ల చూపిస్తూ ఉంటారు. ఈ గుర్తింపు కార్డులను ఎవరికి వారుగా తయారు చేసుకోలేరు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వాటిలోనూ అవసరమైన మార్పు చేర్పులు చేసి లామినేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఆయా నేరగాళ్లు ఏదో ఒక దుకాణాన్ని ఆశ్రయించాల్సిందే. వారికి అధిక మొత్తం ఆశ చూపిస్తున్న నేరగాళ్లు తమకు కావాల్సిన కార్డులు తయారు చేయించుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులకు గుర్తింపు కార్డుల్ని ఆయా విభాగాలే జారీ చేస్తాయి. ఈ విషయం తెలిసినప్పటికీ డబ్బుకు ఆశ పడుతున్న దుకాణాల నిర్వాహకులు నకిలీవి తయారు చేసి ఇస్తున్నారు. ‘స్టాంపుల’పై ఉన్న చర్యలు ఇక్కడేవి? ఉద్యోగార్ధులు, వీసా ప్రాసెసింగ్‌తో పాటు పెళ్లి సంబంధాల కోసమూ అనేక మంది నకిలీ సర్టిఫికెట్లు సేకరిస్తూ ఉంటారు. వీటిని తయారు చేసి ఇచ్చే ముఠాలు నగరంలో అనేకం ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ)లతో పాటు శాంతిభద్రతల విభాగం అధికారులూ ప్రతి ఏటా ఈ నకిలీ సర్టిఫికెట్ల తయారీదారులపై నిఘా ఉంచి దాడులు చేస్తుంటారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీకి నేరగాళ్లు ఆయా స్కూళ్లు, యూనివర్శిటీలు, వృత్తి విద్యా సంస్థల పేర్లతో ఉన్న రబ్బర్ స్టాంపుల్ని వాడతారు. ఫేక్ సర్టిఫికెట్ గ్యాంగ్స్‌ను పట్టుకున్న సందర్భాల్లో పోలీసులు ఈ రబ్బర్ స్టాంపులు తయారు చేసి ఇచ్చిన వారి వివరాలు ఆరా తీస్తారు. వారినీ గుర్తించి అరెస్టు చేస్తుంటారు. భారీ స్థాయిలో నకిలీ పత్రాలతో గ్యాంగ్స్ దొరికినప్పుడు ఈ స్టాంపుల తయారీదారుల్ని పట్టుకోవడానికి టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, సైబర్ క్రైమ్ అధికారులు నగరం, రాష్ట్రం దాటి వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ‘సూడోగాళ్లను’ పట్టుకున్నప్పుడు మాత్రం వారికి గుర్తింపు కార్డులు తయారు చేసి ఇచ్చిన వారి విషయంలో ఇలాంటి చర్యలు ఉండట్లేదు. దీంతో ఫేక్ ఐడీ కార్డుల దందా యథేచ్ఛగా సాగుతోంది. కఠిన చర్యలతోనే అడ్డుకట్ట నకిలీ సర్టిఫికెట్ల తయారీకి అవసరమైన రబ్బరు స్టాంపులు తయారు చేసి ఇవ్వడం ఎంత నేరమో.. నకిలీ గుర్తింపు కార్డులు చేసి ఇవ్వడమూ అంతే నేరం. నకిలీ సర్టిఫికెట్లు/ ఐడీ కార్డుల్ని నేరగాళ్లు ఏ నేరానికి వినియోగిస్తారో దానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్లే తయారీదారుడి మీదా ప్రయోగించాలి. నగరంలో ఏళ్లుగా స్టాంపులు తయారు చేసి ఇస్తున్న వారిపై తీసుకున్న చర్యలను.. గుర్తింపు కార్డులు తయారు చేసి ఇచ్చే వారిపై తీసుకోవట్లేదు. నకిలీ ఐడీ కార్డులు తయారు చేసే వారిపైనా చర్యలు తీసుకుంటేనే ఈ వ్యవహారాలకు కొంత వరకు అడ్డుకట్ట పడే ఆస్కారం ఉంటుంది. – నగరానికి చెందిన విశ్రాంత డీఎస్పీ -
గుర్తింపు కార్డుల పంపిణీ
చిలమత్తూరు : నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులకు స్థానిక పంచాయతీ కార్యాలయంలో శనివారం కన్వీనర్ ఎం.సదాశివారెడ్డి, సర్పంచ్ శ్రీకళ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతం చేయడంతో పాటు, పార్టీ ఆశయాల సాధన కు చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. మండల వ్యాప్తంగా 965 మంది క్రియాశీలక కార్యకర్తలు, నాయకులకు గుర్తింపు కార్డులు రాగా తొలివిడతగా 750 మందికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రామచంద్రప్ప, నరసారెడ్డి, బాబురెడ్డి, జనార్దన్ రెడ్డి, వెంకటేష్, గంగరాజు తదితరులు ఉన్నారు. -
నగరంలో రెండు లక్షలకు పైగా బోగస్ ఓటర్లు
సాక్షి, న్యూఢిల్లీ : నగరంలో మొత్తం 2,09,761 మంది బోగస్ ఓటర్లున్నట్టు ఎన్నికల కమిషన్ గుర్తించింది. వీరిలో 1,20,605 మంది డూప్లికేట్ ఓటరు గుర్తింపు కార్డులను, 89,156మంది పలు ఓటరు గుర్తింపు కార్డులను కలిగిఉన్నారని ఢిల్లీ ఎన్నికల కార్యాలయం నిర్ధారించింది. ఓటరు జాబితా పునఃపరిశీలనలో ఈ విషయం వెల్లడి కావడంతో పలు ఓటరు ఐడీ కార్డులు, డూప్లికేట్ ఓటరు కార్డులకు సంబంధించి ఓటరు జాబితాలో ఉన్న పొరపాట్లను సవరించారు. ఐటీ ఆధారిత అప్లికేషన్లు, క్షేత్ర స్థాయిలో ధ్రువీకరణ సహాయంతో బోగస్ ఓటర్ల గుట్టు రట్టు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. క్షేత్ర స్థాయి ధ్రువీకరణ సమయంలో అనుమానాస్పద ఓటరు గుర్తింపు కార్డులున్నట్లు తేలినవారికి నోటీసులు ఇచ్చి, వారి పేర్లను జాబితానుంచి తొలగించవచ్చంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు బూత్‌స్థాయి అధికారుల క్షేత్ర స్థాయిలో ఓటరు కార్డుల ధ్రువీకరణ జరిపి, డూప్లికేట్, మల్టిపుల్ కార్డులు ఉన్నవారిని గుర్తించి, వారికి నోటీసులు జారీ చేసిన అనంతరం వారి పేర్లను జాబితా నుంచి తొలగించారు. జిల్లా ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని ఆయా రాజకీయ పార్టీలకు కూడా తెలియజేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఢిల్లీ ఎన్నికల కార్యాలయం 12 లక్షల మంది బోగస్ ఓటర్లను జాబితానుంచి తొలగించింది. -
పులివెందులలో అధికారుల గందరగోళం
వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో పోలింగ్ సందర్భంగా పోలింగ్ అధికారులు గందరగోళం సృష్టించారు. అధికారికంగా ఓటర్లకు ఇళ్లకు వెళ్లి మరీ స్లిప్పులు ఇచ్చినా, ఫోటో గుర్తింపు కార్డు కావాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పలువురు ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. అలాగే నెల్లూరు 54వ డివిజన్లో పోలింగ్ ఆగిపోయింది. ఓటరు స్లిప్పులకు, అధికారుల వద్ద ఉన్న జాబితాకు పొంత లేకపోవడంతో ఓటర్లు నిరసన వ్యక్తంచేశారు. తమకు ఇళ్లకు వచ్చి అధికారులే స్లిప్పులు ఇచ్చారని, అలాంటప్పుడు ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా నందిగామ 17వ వార్డులో ఏజెంట్లకు ఫారాలు ఇవ్వలేదు. దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావు బైఠాయించారు. నందిగామ 19వ వార్డులో ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకోవడంతో అధికారులు పోలింగ్ నిలిపివేశారు. -
తప్పుల తడక
= ఓటర్ల జాబితాపై సీఓపీఎస్ = 14 అంశాలపై సర్వే = ఒక్కో ఓటరుకు నాలుగైదు ఐడీ కార్డులు = ఫొటోలూ గల్లంతు = జాబితాలో 11 శాతం తప్పులు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని పలు నియోజక వర్గాల్లో ఓటర్ల జాబితాలు తప్పుల తడకలుగా తయారయ్యాయని నగరంలోని క్రియేటివ్ సెంటర్ ఫర్ సోషల్ అండ్ పొలిటికల్ స్టడీస్ (సీఓపీఎస్) తేల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని ఓటర్ల జాబితాలను గత నెల ఎనిమిదో తేదీ నుంచి ఈ నెల పది వరకు పరిశీలించింది. 70 మంది ఎంఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థులు ఈ కసరత్తులో పాల్గొన్నారు. ఒకే ఓటరు పేరు రెండు సార్లు చోటు చేసుకోవడం, చనిపోయిన ఓటర్లు, పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన, వలస పోయిన ఓటర్లు, వయసులో తేడాలు, లింగ నిర్ధారణలో తప్పులు, ఫొటో లేకపోవడం, పేరు మార్పు, ఎపిక్ నంబరు మార్పు...ఇలా 14 అంశాలపై సర్వే చేశారు. తేలిందేమంటే... జాబితాలో తమ పేర్లు గల్లంతయ్యాయని, ఇంటి చిరునామా మారిపోయిందని, వార్డు నెంబరును మార్చేశారని సర్వే సందర్భంగా ఓటర్లు ఫిర్యాదు చేశారు. ఉదాహరణకు నగరంలోని బసవనగుడి నియోజక వర్గంలో ఖాళీ నివేశనం చిరునామా పేరిట నాలుగైదు ఐడీ కార్డులున్నాయి. ఒక బ్యాంకు పేరిట రెండు, మూడు ఐడీ కార్డులున్నాయి. ఓ టీ దుకాణం చిరునామాలో పది మందికి పైగా ఓటర్లున్నారు. అయితే అక్కడ అలాంటి వారెవరూ లేరు. కొందరి ఓటర్లు వయసు తప్పుగా నమోదు చేశారు. ఉదాహరణకు ఓ ఓటరు వయసును ఏడాదిగా పేర్కొన్నారు. మరో ఓటరు వయసు 196గా ఉంది. ఓటర్ల జాబితాలో అనేక మంది ఫొటోలు గల్లంతయ్యాయి. చాలా మంది ఓటర్ల పేర్లు మారిపోయాయి. ఓటర్ల ఆగ్రహం అధికారుల నిర్లిప్త వైఖరిపై ఓటర్లలో ఆగ్రహం వ్యక్తమైంది. ఆరు సార్లకు పైగా దరఖాస్తు చేసుకున్నా ఐడీ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు. దీంతో చాలా మంది విసిగిపోయారు. రాజకీయ పార్టీలు ఖాతా లేదా రేషన్ కార్డులను ఇప్పించడంలో చూపిస్తున్న ఉత్సాహం ఓటరు ఐడీ కార్డుల విషయంలో చూపడం లేదు. సర్వే చేసిన నియోజక వర్గాలు తుమకూరు, చిత్రదుర్గ, దావణగెరె దక్షిణ, హావేరి, గదగ, హుబ్లీ-ధార్వాడ తూర్పు, హుబ్లీ-ధార్వాడ సెంట్రల్, బెల్గాం రూరల్, చిక్కోడి, గుల్బర్గా ఉత్తర, బీదర్, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బళ్లారి రూరల్, కోలారు, చిక్కబళ్లాపురం, రామనగర, మండ్య, మైసూరు, హాసన, చామరాజ నగర, బిజాపుర, బాగలకోటె, హొసకోటె, కార్వార, చిక్కమగళూరు, ఉడిపి, మంగళూరు దక్షిణ, శివమొగ్గ నగరం, మడికేరి, బసవనగుడి, రాజాజీ నగర. ముక్తాయింపు క్షేత్ర స్థాయిలో 34 రోజుల పాటు కసరత్తు చేసిన అనంతరం బసవనగుడి నియోజక వర్గంలో 25,347 తప్పులు తేలాయి. మొత్తం ఓటర్లతో లెక్కిస్తే ఇది 12.72 శాతం. బెల్గాం రూరల్‌లో అత్యధికంగా 30.925 తప్పులు కనిపించగా, బెంగళూరులోని రాజాజీ నగరలో తక్కువగా 20.816 తప్పులు దొర్లాయి. మొత్తం ఓటర్లు 64,52,007 కాగా 8,27,313 (11 శాతం) తప్పులు తేలాయి.