పులివెందులలో ఓటేసిన వైఎస్ విజయమ్మ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. పులివెందుల మున్సిపల్ ఎన్నికలలో ఆమె తన ఓటు వేశారు. ముందుగా ఇచ్చిన ఓటరు స్లిప్పు, గుర్తింపుకార్డు తీసుకుని వెళ్లి, ఆమె ఓటు వేశారు.
వైఎస్ విజయమ్మ వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. వీరందరూ కూడా మున్సిపల్ ఎన్నికలలో తమ తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.