టైటిలే చెబుతోంది ఆడేంటో! | Aadu magadura bujji almost ready for release | Sakshi
Sakshi News home page

టైటిలే చెబుతోంది ఆడేంటో!

Published Wed, Oct 23 2013 1:35 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM

టైటిలే చెబుతోంది ఆడేంటో!

టైటిలే చెబుతోంది ఆడేంటో!

‘ప్రేమకథా చిత్రమ్’ విజయం తర్వాత సుధీర్‌బాబు చేస్తున్న చిత్రం ‘ఆడు మగాడ్రా బుజ్జి’. కృష్ణారెడ్డి గంగదాసు దర్శకుడు. ఎస్.ఎన్.ఆర్.ఫిలిమ్స్ ఇండియా, కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త నిర్మాణంలో సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘టైటిల్ బట్టే ఈ సినిమా ఎంత శక్తివంతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. హీరోగా సుధీర్‌బాబు రేంజ్‌ని పెంచే సినిమా ఇది’’ అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఆద్యంతం నవ్వించే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శాంటోనియో ట్రెజియో, సహనిర్మాత: సుభాష్‌చంద్ర ఆకుల.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement