- జనవరిలో ఏర్పాటైన కమిషనరేట్
- తాజాగా కమిషనర్ నియామకం
- త్వరలో మొదలుకానున్న పాలన
- మామునూరుకు తరలనున్న రూరల్ విభాగం
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- మూడు రోజుల్లో విధుల్లో చేరుతా : సుధీర్‌బాబు
సాక్షి, హన్మకొండ : వరంగల్ నగర పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌బాబును నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న సుధీర్‌బాబు 2001 బ్యాచ్‌కు చెందిన అధికారి. హైదరాబాద్ నార్త్‌జోన్ డీసీపీగా ఇప్పటి వరకు పని చేశారు. ఆయనకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ కమిషనర్‌గా నియమిస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీస్ శాఖ పరంగా వరంగల్ అర్భన్ జిల్లా ఉన్న ప్రాంతాన్ని వరంగల్ పోలీస్ కమిషరేట్‌గా వ్యవహరిస్తు రాష్ట్ర ప్రభుత్వం 2015 జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవలే న్యాయపరమైన కార్యక్రమాలు పూర్తికావడంతో వరంగల్ నగర పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొది రోజుల్లోనే వరంగల్ నగరంలో కమిషనరేట్ అమల్లోకి రానుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్‌ల తర్వాత మూడో పోలీస్ కమిషనరేట్‌గా వరంగల్ నగరం ఏర్పాటు కానుంది. త్వరలో కమిషనరేట్ ఏర్పాటు కానుండటంతో ఇప్పటివరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో కొనసాగిన వరంగల్ రూరల్ పోలీస్ విభాగం మామూనూరు బెటాలియన్‌కు మారుతుంది. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌బాబును నియమించడంతో త్వరలోనే కమిషనరేట్ పరిపాలన మొదలుకానుంది.
పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌బాబు
Published Fri, Jun 5 2015 5:43 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM
Advertisement