సుధీర్‌బాబు రిస్కీ ఫైట్స్!
సుధీర్‌బాబు రిస్కీ ఫైట్స్!
Published Mon, Sep 30 2013 2:37 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
ఎస్‌ఎమ్‌ఎస్, ప్రేమకథా చిత్రమ్ అంటూ క్యూట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌లో నటించిన సుధీర్‌బాబు ఈసారి ‘ఆడు మగాడ్రా బుజ్జి’ అనే యాక్షన్ ఓరియంటెడ్ మూవీలో నటిస్తున్నారు. కృష్ణారెడ్డి గంగదాసు దర్శకత్వంలో కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుబ్బారెడ్డి, ఎస్.ఎన్. రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘సుధీర్‌బాబు నటన, డాన్స్, ఫైట్స్ హైలైట్‌గా నిలుస్తాయి. శ్రీ కోటి ఇచ్చిన పాటలు ఓ ఎస్సెట్ అవుతాయి. కుటుంబం అంతా ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇది’’ అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘రిస్కీ ఫైట్స్‌ని సుధీర్‌బాబు సునాయాసంగా చేశారు.
ఈ చిత్రానికి ప్రధాన బలం కథ. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో పాటలను, నెలాఖరున సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శాంటోనియో ట్రెజియో, సహనిర్మాత: సుభాష్ చంద్రబోస్.
Advertisement
Advertisement