ఇద్దరు పోస్టల్‌ అధికారులు అరెస్టు | cbi arrests two postal officers involved in unauthorized currencey exchange | Sakshi
Sakshi News home page

ఇద్దరు పోస్టల్‌ అధికారులు అరెస్టు

Published Mon, Mar 20 2017 10:24 PM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM

cbi arrests two postal officers involved in unauthorized currencey exchange

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల నవరంగ్‌పూర్‌ పోస్టల్‌ కార్యాలయంలో పనిచేసే డైరెక్టర్‌, సీనియర్‌ సూపరింటెండెంట్‌లను అరెస్టు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ.6,59,800/- విలువజేసే పాత పెద్ద నోట్లను నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు అధికారులు కొత్త నోట్లతో మార్చారని పేర్కొంది.

నవరంగ్‌పూర్‌లో గల పోస్టల్‌ కార్యాలయాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో అక్రమాలు వెలుగుచూశాయని చెప్పింది. అధికారుల ఇళ్లు, కార్యాలయంలో జరిపిన దర్యాప్తులో రూ.2.66 లక్షలు దొరికినట్లు వెల్లడించింది. ఇరువురు అధికారులను అరెస్టు చేసి ప్రత్యేక జడ్జి ముందు హాజరుపరచనున్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement