కడపలో పాస్‌పోర్టు కార్యాలయం | passport office in Kadapa | Sakshi
Sakshi News home page

కడపలో పాస్‌పోర్టు కార్యాలయం

Published Sat, Feb 18 2017 11:47 PM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM

passport office in Kadapa

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : గల్ప్‌ దేశాలకు వెళ్లేవారు  పాస్‌ పోర్టు కోసం తిరుపతి, హైదరాబాద్‌ ప్రాంతాలకు  వెళ్లాల్సిన అవసరం లేదు.  కేంద్ర ప్రభుత్వం జిల్లా ప్రజల కోసం   కడప పోస్టల్‌ కార్యాలయంలో పాస్‌ పోర్టు కార్యాయాలన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం సరిపడా గదులను సైతం నిర్మిస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా కువైట్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌  మలేషియా, అమెరికా వంటి దేశాలకు జీవనోపాధి కోసం ఎక్కువ సంఖ్యలో ప్రజలు వెళుతుంటారు.  పాస్‌ పోర్టు తయారు చేయించుకోవడానికి ఇతర ప్రాంతాలైన తిరుపతి. హైదరాబాద్‌ వెళ్లాల్సి వచ్చేది.  పాస్‌ పోర్టులో ఏవైనా పొరపాట్లు  మళ్లీ వెళ్లాల్సిన పరిస్థితి. దీనివల్ల ప్రజలకు సమయం, డబ్బు వృథా అయ్యేవి. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తొలగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement