ఏడో రోజూ తపాలా ఉద్యోగుల సమ్మె
అనంతపురం రూరల్: గ్రామీణ తపాలా ఉద్యోగులను డిపార్ట్‌మెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో తలపెట్టిన సమ్మె ఏడో రోజు మంగళవారం కూడా కొనసాగింది. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన వేతనం అందించడంతోపాటు రిటైర్మ్‌ంట్ బెనిఫిట్‌ను అందజేసేవరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తపాలా ఉద్యోగులు క్రిష్ణయ్యయాదవ్, ఓబిరెడ్డి, రాజశేఖర్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
నేడు డిపార్ట్‌మెంట్ ఉద్యోగుల సమ్మె:
గ్రామీణ తపాలా ఉద్యోగులకు బాసటగా బుధవారం నుంచి డిపార్ట్‌మెంట్ (పీ3, పీ4) ఉద్యోగులు సమ్మె చేపడుతున్నట్లు ఆ సంఘం నాయకులు నాగేశ్వర్, వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తపాలా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామన్నారు.