సమష్టి కృషితోనే అభివృద్ధి
సమష్టి కృషితోనే అభివృద్ధి
Published Sun, Mar 26 2017 10:02 PM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM
-రాయలసీమ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ సంజీవ్ రంజన్
– ఘనంగా రీజియన్ స్థాయి అవార్డుల ప్రదానోత్సవం
కర్నూలు (ఓల్డ్‌సిటీ) అధికార, సిబ్బంది సమష్టిగా పనిచేయడమే తపాలాశాఖ అభివృద్ధికి కారణమని రాయలసీమ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ సంజీవ్ రంజన్ అన్నారు. తపాలాశాఖ రీజియన్‌స్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం స్థానిక దేవీ ప్యారడైజ్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో రీజియన్ పరిధిలోని వివిధ కేటగిరీ ఉద్యోగులకు వారి పనితీరులో కనబరచిన ప్రతిభ ఆధారంగా అవార్డులు, ప్రశాంసా పత్రాలు అందజేశారు.
డైరెక్టర్ ఆఫ్ పోస్టాఫీసెస్ పి.సంతాన రామన్‌కు ఉత్తమ రీజియన్ అధికారి అవార్డు లభించగా డివిజన్ హెడ్‌గా కర్నూలు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు, సబ్‌డివిజన్ హెడ్‌గా కర్నూలు ఏఎస్పీ సి.హెచ్.శ్రీనివాస్, కంప్యూటర్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్‌గా అబ్దుల్‌హక్‌తో పాటు ఇతర డివిజన్‌కు చెందిన పలువురికి వారి సేవా నైపుణ్యాలను బట్టి రీజియన్ స్థాయి ఉత్తమ అవార్డులతో పాటు ప్రశంసాపత్రాలను పీఎంజీ చేతుల మీదుగా అందుకున్నారు. అలాగే డివిజన్ పరిధిలో ఉత్తమ హెడ్‌పోస్టాఫీసు అవార్డును కర్నూలు పోస్టుమాస్టర్ ఎద్దుల డేవిడ్‌కు అందజేశారు.
అనంతరం పీఎంజీ మాట్లాడుతూ పీఎల్‌ఐ, ఆర్‌పీఎల్‌ఐ, మైస్టాంప్స్, ఫిలాటలీ వంటి పథకాలలో అనూహ్యమైన ప్రగతి సాధించి కర్నూలు డివిజన్ ప్రథమ స్థానంలో నిలిచిందని, రీజియన్ పరిధిలోని మిగతా డివిజన్లు కర్నూలును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ సతీమణి రమాదేవి, ఏడీలు బాలసత్యనారాయణ, మల్లికార్జనశర్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement