మర్యా‘దగా’ మెక్కుడు
Published Sun, Dec 4 2016 11:52 PM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
విదేశీ మారకద్రవ్యాన్ని స్వదేశీ ధనంగా మార్చే క్రమంలో కొందరు తంతితపాలాశాఖ ఉద్యోగులు తప్పుడు ఆర్జనను మరిగారు. అందుకు సం బంధించి లావాదేవీలు జరిపే వారికి చేయని మర్యాద చేసినట్టు చూపు తూ సొమ్ము చేసుకుంటున్నారు. లావాదేవీలు జరిపే ప్రతివారికీ టీ, కాఫీ లు, అల్పాహారాలు ఇప్పించినట్టు లెక్కల్లో చూపి రూ.లక్షలు తాము మెక్కుతున్నారు. కాకినాడ కేంద్రంగా మూడేళ్లుగా సాగుతున్న ఈ కక్కుర్తి బాగోతంపై ’సాక్షి’ పరిశీలనలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
విదేశాల్లోని ప్రవాస భారతీయులు ఇక్కడి బంధువులకు, కుటుంబ సభ్యులకు పంపే విదేశీ మారక ద్రవ్యాన్ని మన కరెన్సీలోకి మార్చుకునేందుకు వెస్ట్ర¯ŒS యూనియ¯ŒS మనీ ట్రా¯Œ్స ఫర్ కేంద్రం కాకినాడ ప్రధాన తంతితపాలా కార్యాలయంలో నడుస్తోంది. రూ.50 వేలు పంపిస్తే అందుకు రుసుముగా వసూలు చేసే రూ.350లో రూ.30 తపాలా శాఖ ఉద్యోగులకు వస్తుంది. ఇందులో రూ.15 వెస్ట్ర¯ŒS మనీ ట్రా¯Œ్సఫర్ విధానంలో నగదు మార్చుకోవడానికి వచ్చిన వినియోగదారుడికి రిఫ్రెష్‌మెంట్ (టీ, కూల్‌డ్రింక్, బిస్కెట్ వంటివి)గా ఖర్చు చేయాలి. ఈ కౌంటర్‌ను పోస్టాఫీసులో సెం ట్రల్ పోస్ట్ మాస్టర్ ఒక ఉద్యోగి సహాయంతో నిర్వహించాలి.
ఈ తపాలా కార్యాలయంలో నిత్యం సుమారు 100 మంది మనీ ట్రా¯Œ్సఫర్ సేవలను వినియోగించుకుంటున్నారు. వీరికి టీ, స్నాక్స్ ఇచ్చేందుకు రూ.15 వంతున ఖర్చు చేయొచ్చు. గత మూడేళ్లుగా ఒక్కరికి మంచినీళ్లు ఇచ్చిన దాఖలా లేదు. తక్కువలో తక్కువ 60 మంది వచ్చినా రూ.900 ఖర్చు చేయాలి. కానీ అలా చేయకుండానే చేసినట్టు చూపుతూ ఆ సొమ్మునంతటినీ ఆ కార్యాలయంలో ఒక ముఖ్య ఉద్యోగి జేబులో వేసుకుంటున్నారని ఆ శాఖ సిబ్బందే చెపుతున్నారు. ఇలా నొక్కేసే మొత్తం ఒక్కోరోజు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఉంటుందన్నారు. ఇందులో మరో ఉన్నతాధికారికీ, ఓ దిగువస్థాయి ఉద్యోగికీ వాటాలు ముడుతున్నాయన్నారు. ఈ రకంగా మూడేళ్ళలో రూ.12 లక్షలు దిగమింగినట్టు అంచనా.
ఏనాడూ మంచినీళ్లు కూడా ఇవ్వలేదు..
నేను దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాను. సంవత్సరానికి రెండు నెలలు ఇక్కడ ఉంటాను. ఆ సమయంలో స్నేహితులు వెస్ట్ర¯ŒS యూనియ¯ŒS మనీ ట్రా¯Œ్సఫర్ ద్వారా మనీ ట్రా¯Œ్సఫర్ చేస్తుంటారు. ఎప్పుడూ కాకినాడ సెంట్రల్ పోస్టాఫీసులోనే విత్‌డ్రా చేస్తాను. కనీసం ఒక్కసారైనా మంచినీరు కూడా ఇవ్వలేదు.
– ఎల్.రామకృష్ణ, కాకినాడ
విచారించి చర్యలు తీసుకుంటాం..
రిఫ్రెష్‌మెంట్‌గా ఒక్కొక్కరికీ రూ.15 నుంచి రూ.20 లోపు ఎంతైనా ఖర్చు చేయవచ్చన్న నిబంధన ఉన్న మాట వాస్తవమే. అవి అందరికీ సమానంగా అందుతున్నాయా, లేదా అనేది నాకు తెలియదు. వినియోగదారులకు అందడం లేదనే విషయం నా దృష్టికి రాలేదు. దీని పూర్తి నిర్వహణ బాధ్యతలు చూసే వారిని విచారిస్తాను.
– కె.శ్రీకుమార్, పోస్టల్ సూపరింటెండెంట్, కాకినాడ
Advertisement
Advertisement