పోటీలతో ఉత్సాహం
పోటీలతో ఉత్సాహం
Published Thu, Oct 27 2016 10:10 PM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM
కాకినాడ కల్చరల్ :
పోటీలు ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని జెఎ¯ŒSటీయూకే రెక్టార్ బి.ప్రభాకరరావు అన్నారు. సూర్యకళామందిర్‌లో భారత తపాలాశాఖ 31వ జాతీయ స్థాయి సాంస్కృతిక ప్రాథమిక పోటీలు గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు మానసిక ప్రశాంతతను కలిగించడానికి ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమాన్ని పోస్ట్‌మాస్టర్ జనరల్ (విశాఖపట్టణం) టి.ఎం.శ్రీలత జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్(కాకినాడ శాఖ) అధికారి కె.కుమార్ మాట్లాడుతూ ఈ పోటీలు శుక్రవారం కూడా జరుగుతాయన్నారు. ఆం«ధ్ర ప్రదేశ్, తెలంగాణ పోస్టల్ సర్కిల్స్‌లోని 104 మంది ఉద్యోగులు ఈ సాంస్కృతిక పోటీలలో పాల్గొంటున్నారన్నారు.
ఈ ప్రాథమిక పోటీలలో ప్రథమ స్థానం పొందినవారు నవంబర్‌లో రాజస్థా¯ŒSలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు అర్హులని అన్నారు. మొదటి రోజున జానపద గేయాల ఆలాపన, వేణుగానం, గాత్రం విభాగాల్లో జూనియర్స్, సీనియర్స్‌కు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గుంటూరు, రామచంద్రపురం, హనుమకొండ, విశాఖపట్నంకు చెందిన 15 మంది కళాకారులు పాల్గొన్నారు. శుక్రవారం కూచిపూడి, భరత నాట్యం, ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహిస్తామని సూపరింటెండెంట్ శ్రీకుమార్ తెలిపారు. కళాకారులు పెద్దాడ సూర్యకుమారి, పాండురంగ రాధాకృష్ణ, చిలుకూరి సుబ్బలక్ష్మి, ఎస్.కృష్ణకుమార్, వి.లోకేష్, వై.కె.కృష్ణవేణిలు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో తపాలా శాఖాధికారులు వై.ఎస్.నరసింగరావు, కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement