తపాలా శాఖ ఉద్యోగుల సస్పెన్షన్‌ | postal department employees suspended | Sakshi
Sakshi News home page

తపాలా శాఖ ఉద్యోగుల సస్పెన్షన్‌

Published Tue, Jan 3 2017 10:40 PM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM

postal department employees suspended

  • సొంత ఉద్యోగులనే పావులుగా వాడుకున్న వైనం
  • మరింత లోతుగా విచారిస్తున్న సీబీఐ
  • బాలాజీచెరువు (కాకినాడ) :
     ప్రతి ఒక్కరికీ ఒక టైం వచ్చినట్టుగా తమకి టైం వచ్చిందనుకున్నారేమే ఏమో కానీ ఆ ఉద్యోగులు ఇదే అదనుగా చేసిన తప్పిదం వారి ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించినప్పటి నుంచీ జనం నగదు కోసం అవస్థలు పడుతున్నా వారికేమీ పట్టనట్టు వ్యవహరించారు. గత నెల 30వ తేదీ రాత్రి అదుపులోకి తీసుకుని వైజాగ్‌ సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టిన కాకినాడ తపాలా శాఖ ప్రధానశాఖ హెడ్‌ పోస్టుమాస్టర్‌ బి.సుభాకర్‌తోపాటు ట్రెజరర్‌ ఎంఎస్‌కె శ్రీనివాస్‌లను విధులు నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు అదేశాలు జారీ చేశారు. కమీషన్లకు కక్కుర్తిపడి   బడాబాబులతో కుమ్మక్కై వారి ధనాన్ని తెల్లదనంగా మార్చి  కటకటాల పాలవగా వారు అదేశాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యుల పేర్లను చేర్చి ఈ తతంగమంతా జరిపిన నేపధ్యంలో సీబీఐ అధికారులు వారిపైన  మరింత లోతుగా విచారిస్తున్నారు.  ఇప్పటి వరకూ దాదాపు రూ.20 లక్షలకు పైబడి నల్లధనాన్ని తపాలాశాఖ అధికారులు మార్చినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. వీరిద్దరినీ అరెస్టు చేసిన నేపథ్యంలో నోట్ల మార్పిడికి వచ్చిన ఆధార్, ఇతర వివరాలు ఇందుకు ఉపయోగించగా వారందదరనీ ఒక్కొక్కరినీ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ నగదు మార్పిడిలో  సొంతశాఖ ఉద్యోగులనే ఈ ఇద్దరూ ఎలా పావులుగా వాడుకున్నారో రికార్డులు పరిశీలింగా ఒక ఉద్యోగి ఐదువేలు మార్చుకుంటే దాని పక్కన ఒకటి వేసి  పదిహేను అలా వందలు వేలుగా మార్చినట్టు తెలిసింది. కాకినాడ ప్రధాన తపాలాశాఖ కార్యాలయానికీ ప్రతిరోజు దాదాపుగా 20 లక్షలు వరకూ వచ్చేవి. వీటిని దాని పరిధిలో ఉన్న శాఖలకు పంపించి మిగతావి ప్రధాన కార్యాలయంలో మార్చేవారు. అయితే మిగతా శాఖలకు తక్కువగా పంపించి ఈ వ్యవహరమంతా నడిపించారు.
    ఈ వ్యవహారంలో గతంలో ఆరోపణలు రాగా సీబీఐ విచారణ జరగకముందు ఈ విషయంపై కాకినాడ ప్రధాన తపాలాశాఖ హెడ్‌ పోస్టు మాస్టర్‌ సుభాకర్‌ను  వివరణ కోరగా తమ బ్రాంచ్‌లో అటువంటివి ఏమీ జరగలేదని, నగదు మార్పిడి అంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరిగిందని ‘సాక్షి’కి చెప్పడం గమనార్హాం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement