
న్యూఢిల్లీ: తపాలా శాఖకు చెందిన పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు తన సేవల్ని దేశవ్యాప్తంగా విస్తరించనుంది. వచ్చే మే నుంచి పేమెంట్స్ బ్యాంకు శాఖలను దేశవ్యాప్తంగా ప్రారంభించే ఆలోచనతో ఉన్నామని, ఇందుకు రూ.1,450 కోట్లు వెచ్చిస్తామని తపాలా శాఖ సెక్రటరీ అనంత నారాయణ్ నందా తెలిపారు. ‘‘ఏప్రిల్ నాటికి ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి. మే నుంచి సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా పోస్ట్ పేమెంట్స్ బ్యాం కు శాఖలను ప్రారంభిస్తాం’’ అని వెల్లడించారు.
1.55 లక్షల పోస్టాఫీసులు సేవల కేంద్రాలుగా పనిచేస్తాయని, వీటికి బ్యాక్ ఎండ్ సేవల్ని 650 పేమెంట్స్ బ్యాంకు శాఖలు అందిస్తాయని చెప్పారు. గతేడాది జనవరిలో తపాలా శాఖ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సేవల్ని ప్రయోగాత్మకంగా రాంచీ, రాయ్‌పూర్‌లో ప్రారంభించింది. మొత్తం 11 సంస్థలు పేమెంట్స్ బ్యాంకు సేవల్ని ప్రారంభించేందుకు ఆర్‌బీఐ 2015లో అనుమతించింది. ఎయిర్‌టెల్, పేటీఎం, పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులు మాత్రమే ఇప్పటిదాకా సేవల్ని ఆరంభించాయి.
Comments
Please login to add a commentAdd a comment