
సిర్పూర్(టి): కాగజ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని ఫాల్గుణ పెద్దపులికి అరుదైన గౌరవం దక్కింది. పెద్దపులి ఫొటోతో ఉన్న పోస్టల్ స్టాంప్‌ను కేంద్రం విడుదల చేసింది. కాగజ్‌నగర్ డివిజన్ ఫారెస్ట్ రేంజ్ అధికారులు పంపిన ప్రతిపాదనలను కేంద్రం ఇటీవల అంగీకరించింది.
పెద్దపులి (ఫాల్గుణ) ఫొటోతో పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయడం దేశంలో ఇదే తొలిసారి అని ఎఫ్‌ఆర్‌వో పూర్ణచందర్ తెలిపారు. ఫాల్గుణ ప్రస్తుతం కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని పెంచికల్‌పేట్ అటవీ ప్రాంతంలో ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment