న్యూఢిల్లీ: కొత్త బ్యాంక్‌ల రాకతో బ్యాంక్ లావాదేవీల చార్జీలు తగ్గే అవకాశాలున్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. అధికంగా పేపర్ కరెన్సీని ఉపయోగించడం సమాజానికి చేటన్నారు. డిజిటల్ లావాదేవీలు ఊహించిన దానికన్నా వేగంగా విస్తరిస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. తపాలా కార్యాలయాలు బ్యాంక్‌లుగా మారడం.. తదుపరి విప్లవమని ఆయన అభివర్ణించారు. కాగిత కరెన్సీని అధికంగా వినియోగించడం సమాజానికి చేటు చేస్తుందన్న వాస్తవాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని పేర్కొన్నారు.
అందరికీ ఆర్థిక సేవలు...
బ్యాంకింగ్ రంగంలో మరిన్ని టెలికం కంపెనీల ప్రవేశం వల్ల ప్రతి ఒక్కరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి వస్తాయని జైట్లీ ఆశాభావం వ్యక్తంచేశారు. పోస్టల్ బ్యాంకు ఒక కొత్త ఒరవడిని సృష్టించనుందన్నారు. దేశవ్యాప్తంగా 1.75 లక్షల తపాలా కార్యాలయాలున్నాయని, వీటిని సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నామని, వీటన్నిటినీ బ్యాంక్‌లుగా మార్చాలని ఉందని తెలియజేశారు. లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ, సర్వీస్ చార్జీలు తగ్గుతాయని చెప్పారాయన.
ఇక తపాలా బ్యాంక్‌ల విప్లవం: జైట్లీ
Published Fri, Jan 13 2017 1:44 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
Advertisement
Advertisement